MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Mandaadi Movie BO Collections
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Feature
  • ఆడా, మగ సమానం కాదా..? సమాజం ఏమంటోంది, సైన్స్ ఏం చెబుతోంది?

ఆడా, మగ సమానం కాదా..? సమాజం ఏమంటోంది, సైన్స్ ఏం చెబుతోంది?

ప్రస్తుతం ఆడా, మగా సమానమే అనే వాాదన వినిపిస్తోంది. అయితే కొన్న విషయాల్లో వీళ్లు ఎప్పటికీ సమానం కాదు. ఆ అంశాలేంటో ఇక్కడ కూలంకషంగా చర్చిద్దాం… ఆ తర్వాత మీరే డిసైడ్ చేయండి ఇద్దరూ సమానమో కాదో… 

5 Min read
Author : Amarnath Vasireddy
Published : Feb 11 2026, 08:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మహిళలకు స్ట్రెస్ ఎక్కువా..?
Image Credit : Getty

మహిళలకు స్ట్రెస్ ఎక్కువా..?

ఆమె చురుకయిన అమ్మాయి. కష్టపడే తత్త్వం. సివిల్స్ కోచింగ్ తీసుకొంది. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది. నిజాయితీ, పరిపాలనా దక్షతతో ... కొద్ది కాలంలోనే గొప్ప పేరు సంపాదించింది.

రోజులు ఎప్పుడూ ఒక్కేలా ఉండవు .. కారణాలు ఏమైతేనేమి ఆమె జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి.

స్ట్రెస్ .

ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది.

"కోచింగ్ కు వచ్చినప్పుడు తాను యువతి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దమ్మా అంటే వినేది. ఇప్పుడు యాభైకి దగ్గర పడుతోంది. ఏమని చెబుతాము? బాధ కలుగుతుంది. అందరూ అని కాదు కానీ కొంతమంది మహిళలు స్ట్రెస్ తట్టుకోలేక పర్సనల్ లైఫ్ ను నాశనం చేసుకొంటున్నారు. ఈమె సంగతి కాదు కానీ.. మరో ముగ్గురి సంగతి చెబుతాను. వివిధ సందర్భాల్లో వారి భర్తలు వారిని కోచింగ్ లో చేర్పించారు. కస్టపడ్డారు. ఇప్పుడు ఉన్నత స్థాయి అధికారిణిలు. ముగ్గురికీ విడాకులు. ఉన్నత ఉద్యోగం సాధించి హ్యాపీగా ఉన్నారా? అంటే "లేదు" అని వారే చెబుతున్నారు. స్ట్రెస్ .. డిప్రెషన్. లక్షల్లో ఒక్కరు సాధించే ఐఏఎస్, ఐపీఎస్ కు ఎంపికయిన వారు కూడా లైఫ్ ను సరిగా ప్లాన్ చేసుకోలేక, మేనేజ్ చేసుకోలేక పోతుంటే ఇక... సాధారణ స్త్రీల సంగతి ఏంటి? కాస్త తెలివి, మంచి రూపం ఉంటే సొషల్ మీడియా విపరీతమయిన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. ఇదే లైఫ్ అనుకొని ప్రొఫెషనల్.. పర్సనల్ లైఫ్ ను నాశనం చేసుకొంటున్న ఆధునిక మహిళలు ఎంత మందో !! " అంటాడొక మిత్రుడు.

భర్త ఉన్నత స్థానంలో బిజీ గా ఉంటే భార్య ఇంటిని మేనేజ్ చేస్తుంది.

మరి భర్య బిజీగా ఉంటే భర్త ఆ పని చేస్తాడా?

తనకంటే... తన భార్య ఉన్నత స్థానంలో ఉంటే భర్త అహం దెబ్బతిని... భార్యకు గడ్డుపరిస్థితులు ఎదురు కాదా? .. నా అనుమానం.

అతనో ఐఐటీ గ్రాడ్యువేట్ .

భార్య ఐఏఎస్ అయ్యింది .

ఇద్దరు పిలల్లు .

ఆమె కలెక్టర్ గా పని చేస్తున్నప్పడు ఇద్దరూ విడాకులు తీసుకొన్నారు.

"పితృస్వామ్య సమాజంలో మహిళకు విజయం అంత ఈజీ గా దక్కదు. ఏటికి ఎదురీదాలి. అన్ని కష్టాలు పడి ఉన్నత స్థానాన్ని అందుకొన్న ఆమె ఫీలింగ్స్ వేరుగా ఉంటాయి. తాను సాధించిన దాన్ని కాపాడుకోవాలి అనుకొంటుంది. ఎక్కువ ఒత్తడికి గురవుతుంది. ఆ స్ట్రెస్ లో తప్పు మీద తప్పు చేసే అవకాశం. దాని ప్రభావం కుటుంబ జీవనంపై పడుతుంది. ఈ విషయాలపై నేను... రెండు పుస్తకాలు రాశాను" అన్నాడు మరో మిత్రుడు.

ఈ మాజీ దంపతులు ఇద్దరు నాకు అత్యంత సన్నిహితులు. విడిపోయినా నేను ఇక్కడ వారి జీవితం గురించి ఎక్కువ రాసి వారిని ఇబ్బంది కి గురి చెయ్యడం ఇష్టం లేదు. వారి పేర్లతో కామెంట్స్ పోస్ట్ చెయ్యొద్దు.

అంటే ఏంటి ?

మహిళ... ప్రొఫెషనల్ ప్రెషర్ ను తట్టుకోలేదా ?

ఉద్యోగం చేసే మహిళ తన కాపురాన్ని తానే పాడుచేసుకొంటుందా ?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మహిళలు ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేయగలరా..?
Image Credit : Getty

మహిళలు ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేయగలరా..?

నా వ్యక్తిగత జీవితంలో ముగ్గురు మహిళలు .

1. అమ్మ : టీచర్ వృత్తికి గృహిణి / తల్లి పోస్ట్ కు 100 శాతం న్యాయం చేసింది .

2. భార్య :బయట వారికి పెద్దగా కనబడదు. స్లేట్, కాగ్నిబోట్ మొత్తం ఆర్థిక వ్యవహారాలు తన భుజాలపైనే. నాది కేవలం అకడెమిక్స్. భార్యగా, తల్లిగా 100 మార్కులు .. ఇప్పుడు అమ్మమ్మ గా 120/ 100.

3 . కూతురు : భర్త హైకోర్ట్ న్యాయవాది. మహా బిజీ. ఇంటి పని వంట పని, ఇద్దరు పిల్లలు. ఇది కాకుండా స్కూల్ పని .

4. నా ప్రొఫషనల్ జీవితం లో వందలాది మహిళలు. స్లేట్ మహిళాశక్తి . అందరూ { బహుశా అతి తక్కువ మంది మినహా } పర్సనల్ లైఫ్ ను ప్రొఫషనల్ లైఫ్ ఇన్ బాగా బాలన్స్ చేస్తున్నవారే.

సరే నా అనుభవం పక్కన పెడుదాము .

ఒక మహిళ ప్రొఫెషనల్ లైఫ్ లో బాగా... బిజీ .. అయిపోతే పర్సనల్ లైఫ్ ను మేనేజ్ చేయగలదా ?

ఇదే విషయం ఇంకో మితృడిని అడిగా .

తాను ప్రిన్సిపాల్ కమిషనర్ అఫ్ ఇన్కమ్ టాక్స్ .

"నేను ఎంతో మందిని చూసాను . పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తారు. జస్ట్ నో డౌట్ " అన్నాడు .

1. ఒకాయనేమో “ స్ట్రెస్ తట్టుకోలేరు “ అంటాడు.

2. ఇంకో అయన కనీసం పది ఉదాహరణలు ఇచ్చి స్ట్రెస్ వల్ల డిప్రెషన్ తెచ్చుకొని లైఫ్ ను ఎలా పాడు చేసుకున్నారో వివరించాడు.

3. ఇంకో ఆయన “ మహిళలు చక్కగా రెండూ మానేజ్ చేస్తారు “ అంటాడు .

ఎవరి అనుభవాలు వారివి.

ఇంతకీ సైన్స్ ఏమి చెబుతోంది?

సైకాలజీ , ఆంత్రోపాలజీ కోణంనుంచి అర్థం చేసుకొందాము .

పురుషుడు, స్త్రీ .. ఇరువురి శరీర నిర్మాణం... అది పని చేసే తీరు... వేర్వేరు.

1. స్ట్రెస్ - మానసిక ఒత్తిడి .. కలిగినప్పుడు మనుషులు ఏమి చేస్తారు ?

దాన్ని ఎదిరించి పోరాటం చేస్తారు .

చేయలేము అంటే వదిలేస్తారు .

అంటే ఫైట్ . లేదా ఫ్లైట్. ( Fight or flight )

ఇది కేవలం పురుషుల్ని దృష్టిలో ఉంచుకొని చెప్పింది అంటారు .. ప్రఖ్యాత మానసిక నిపుణురాలు ప్రొఫెసర్ షెల్లీ టేలర్.

ఆమె మహిళల సైకాలజీ పై లోతుగా అధ్యయనం చేశారు .

స్ట్రెస్ ఎదురయినప్పుడు మహిళ సామాజిక తోడ్పాటును ఆశిస్తుంది అంటారు షెల్లీ.

పురుషుడు స్ట్రెస్ ను టెస్టరోస్టోన్, అడ్రినాలిన్ ద్వారా ఎదుర్కొంటే మహిళ ఆక్సిటోసిన్, ఈస్ట్రోజెన్ ద్వారా.

ఆక్సిటోసిన్ ప్రేమ హార్మోన్.

అంటే మహిళ ప్రేమ ద్వారా తన స్ట్రెస్ ను ఎదుర్కొంటుంది.

తల్లి -తండ్రి , భర్త , కొడుకు- కూతురు , కనీసం ఫ్రెండ్ .

వీరిలో కనీసం ఒకరి మానసిక అండను ఆశిస్తుంది స్త్రీ .

పురుషుడు కూడా మరో వ్యక్తి అండలేకుండా బతకలేడు. నిజమే .

కానీ ఈ విషయం లో స్త్రీ పురుషుడి కంటే ఎక్కువ అండను, ప్రేమను , మానసిక నిబ్బరతను కోరుకొంటుంది . "నీకు నేనున్నాను" అని మనో నిబ్బరం ఇచ్చే కనీసం ఇంకో స్నేహితురాలు లేక పొతే మహిళ తట్టుకోలేదు .

ఒంటరి జీవితం... మహిళకు ఎక్కువ ఇక్కట్లు తెస్తుంది.

2. స్ట్రెస్ కలిగినప్పుడు శరీరంలో కార్టిజాల్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. కానీ ఇక్కడ కూడా స్త్రీ - పురుషుల మధ్య తేడా ఉంటుంది .

పురుషుల్లో తక్కువ కార్టిజాల్ .

దానికి తోడు... త్వరగా దానినుంచి శరీరం బయటపడుతుంది . ఇది మానవ సూక్ష్మ పరిణామక్రమం లో జరిగింది .

అదే స్త్రీ శరీరంలో ఎక్కువ స్ట్రెస్ హార్మోన్. దాని నుంచి బయట పడడానికి ఎక్కువ సమయం .

దీని అర్థం .. మహిళ తన స్ట్రెస్ విషయం లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి అని .

33
మహిళల భావోద్వేగం...
Image Credit : Getty

మహిళల భావోద్వేగం...

3. పురుషుల్లో టెస్టరోస్టోన్ హార్మోన్ . ఇది దూకుడు స్వభావాన్ని కలిగిస్తుంది . మహిళల్లో కూడా ఈ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది . కానీ దాని లెవల్స్ మారుతూ ఉంటాయి .

దీనికి తోడు మహిళల్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరోన్ హార్మోన్స్. ఆలోచనలను మారుస్తుంటాయి.

పురుషుల్లో ఆలోచనల మార్పు ఉండవని కాదు కానీ మహిళల్లో ఎక్కువ ఉండే అవకాశం .

4. మహిళ తన భావోద్వేగాన్ని సులభంగా వ్యక్త పరుస్తుంది .

నవ్వు .. ఏడుపు .. కోపం .. పురుషుడు ఎమోషన్స్ ను అంత బాగా ఎక్ష్ప్రెస్స్ చేయలేడు . చేయడు . ఇది కూడా పురుషాదిక్య సమాజ ప్రభావం . బాధ గుండెలో గూడు కట్టుకొంటే .. గుండెపోట్లు మెదడుపోట్లు పక్షవాతాలు . ఇప్పుడు అర్తంమయిందా హార్ట్ అటాక్స్ పక్షవాతాలు పురుషుల్లో ఎందుకు ఎక్కువో..?

"నాకు కష్టం లేదా ? బాధను తట్టుకొంటున్నాను .. నువ్వు చీటికిమాటికి ఏడుస్తావు ... ముక్కు చీదుతావు ఏంటి ?" అని మీ ఇంటి మహిళ పై కోపపడొద్దు .

5. నిద్రలేమి . ఎవరికైనా అనారోగ్యాన్ని కలుగచేస్తుంది . ఇది మహిళల్లో మరింత ఎక్కువ . భర్త చనిపోయిన బాధలో నాలుగు రోజులు నిద్రపోక ప్రాణంమీదకు తెచ్చుకొన్న మహిళలు ఎందరో !

5. పురుషుడికి భౌతిక బలం ఎక్కువ . స్త్రీకి బాధను తట్టుకొనే శక్తి ఎక్కువ .

పైవన్నీ శారీరిక ధర్మాలు .

ఇవి కాకుండా సమాజం తీసుకొని వచ్చే ఒత్తిడి .

ఉన్నత స్థానంలో ఉన్న భర్త అర్ధ రాత్రి అపరాత్రి ఇంటికి వచ్చినా నడుస్తుంది .

అమ్మ ఇంటికి లేటుగా వస్తే పిల్లలు తట్టుకోలేరు. పిల్లలు తట్టుకొన్నా "అయ్యో! నా పిలల్లు తిన్నారో నిద్రపొయ్యారో !అని ఆమె తట్టుకోలేదు.

పురుషుడి కన్నా ఎక్కువగా స్త్రీ ప్రేమను కోరుకుంటుంది .

అదే అమ్మతనానికి మూలం. మానవ జాతిని నిలబెట్టింది ఆ ప్రేమ స్వరూపమే !

పురుషుడికన్నాస్త్రీ అండను కోరుకుంటుంది. ఓదార్పును కోరుకొంటుంది .

అది ఆమె బలం .

అదే సమాజానికి పునాది .

మానవత్వానికి ఒడి .

అందుకే ఆమె అబల కాదు సబల !

పురుషుడు .. స్త్రీ . పరస్పర వైరుధ్యం లేదు .

అర్ధనారీశ్వర తత్త్వం .

సగం - సగం దేహం .

ఒకరు గెలిస్తే ఇంకొకరు గెలిచినట్టే .

ఒకరు ఓడితే మొత్తం సమాజం ఓడినట్టే .

సమాజం లో మార్పు రావాలి .

పురుషుడ్ని స్త్రీ అర్థం చేసుకోవాలి .

ఇంతకు మించి పురుషుడు స్త్రీని అర్థం చేసుకోవాలి . గౌరవించాలి .

డిజిటల్ యుగం లో ప్రబలుతున్న స్త్రీ ద్వేషం .. పురుష ద్వేషం నశించాలి.

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
మహిళలు
బంధుత్వం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Facts : వాటర్ బాటిల్‌పై అడ్డంగా గీతలుంటాయి కదా.. ఎందుకో తెలుసా?
Recommended image2
IRCTC Ultimate Ooty Tour: బడ్జెట్‌లో హైదరాబాద్ నుంచి ఊటీ, కూనూర్ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Recommended image3
River : వేల కిలోమీటర్లు ప్రయాణించి... సముద్రంలో కలవక ముందే కనుమరుగయ్యే నది ఏది?
Related Stories
Recommended image1
Women Safety Apps : అమ్మాయిలూ.. మీ ఫోన్లో ఈ యాప్స్ లేకుంటే అరిచి గోలచేసినా లాభం ఉండదు
Recommended image2
Women Psychology: ఆడవాళ్లు నిజంగానే సీక్రెట్స్ దాచుకోలేరా? సైకాలజీ ఏం చెప్తోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved