Viral Video: వివాహ వేడుకలో బంగారు బిస్కెట్లు..? వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పెళ్లి వీడియో నెటిజన్లలో భారీ చర్చకు దారి తీసింది. 24 క్యారెట్ బంగారు బిస్కెట్లను పెళ్లి కానుకగా ఇస్తున్నట్టు కనిపించిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఇంతకీ ఈ వీడియోలో ఉంది నిజమైన బంగారమేనా.?

వైరల్ అయిన 33 సెకన్ల వీడియో
సుమారు 33 సెకన్ల ఈ వీడియోలో పెళ్లి వేడుకలో సూట్‌లు ధరించిన కొందరు వ్యక్తులు కూర్చుని ఉంటారు. ఒక వ్యక్తి చేతిలో మెరుస్తున్న పసుపు రంగు బార్లతో నిండిన పెట్టెతో అక్కడ ఉన్నవారికి వాటిని అందిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను Xలో @Rainmaker1973 అనే యూజర్ షేర్ చేస్తూ, “సౌదీ అరేబియాలో జరిగిన ఒక పెళ్లిలో వధువు సోదరుడు వరుడి కుటుంబానికి 24 క్యారెట్ బంగారు బిస్కెట్లు బహుమతిగా ఇచ్చాడు” అని పేర్కొన్నారు. కొద్ది గంటల్లోనే ఈ వీడియోకు 3.7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి
నిజంగానే బంగారమా? నెటిజన్లలో చర్చ
వీడియో చూసిన కొందరు ఇది రాజసంగా ఇచ్చిన కానుక అంటూ ఆశ్చర్యపోయారు. మరికొందరు ఇది అసంభవమని అనుమానం వ్యక్తం చేశారు. భారతదేశంలో పెళ్లిళ్లలో బట్టలు, నగలు ఇవ్వడం సాధారణం. కానీ బంగారు బిస్కెట్లు ఇవ్వడం ఏంటని నెటిజన్లలో అనుమానం మొదలైంది. అందుకే సోషల్ మీడియాలో ఈ వీడియోపై పెద్ద చర్చ మొదలైంది.
అసలు నిజం ఏంటి.?
ఈ వీడియో వైరల్ అవుతోన్న క్రమంలో ఓ యూజర్ అసలు విషయాన్ని బయట పెట్టారు. వీడియోలో కనిపించినవి నిజమైన బంగారు బిస్కెట్లు కావు. అవి బంగారు రంగు ఫాయిల్‌లో కప్పిన లగ్జరీ చాక్లెట్లు మాత్రమే అని తేలింది. మధ్యప్రాచ్య దేశాల్లో పెళ్లిళ్లు, ప్రత్యేక వేడుకల్లో ఇలాంటి విలాసవంతమైన చాక్లెట్లు కానుకగా ఇవ్వడం సాధారణమే. అవి నిజమైన బంగారంలా కనిపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు.
At a Saudi wedding the bride’s brother gifts the groom’s family 24-karat gold biscuits.pic.twitter.com/3F0BwnuZSq
— Massimo (@Rainmaker1973) February 11, 2026
లగ్జరీ చాక్లెట్లు
ఈ వీడియోలో కనిపిస్తున్నవి ప్రముఖ ప్రీమియం చాక్లెట్ బ్రాండ్ “Patchi” అని గుర్తించారు. ఈ బ్రాండ్ చాక్లెట్లు బంగారు కవర్‌లో ప్యాక్ చేసి అందంగా తయారు చేస్తారు. బంగారం కంటే ఎక్కువ కాకపోయినా ఈ చాక్లెట్ ధర కూడా ఎక్కువగానే ఉంటుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ చాక్లెట్లు అమెజాన్‌లో సైతం అందుబాటులో ఉన్నాయి. 9 చాక్లెట్ల ప్యాక్ ధర సుమారు రూ. 5200గా ఉంది.

