పెళ్లికొడుకు లుక్‌లో నిఖిల్.. వైరల్‌ అవుతున్న ఫోటోలు

First Published 13, May 2020, 8:40 PM

టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్‌ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. మే 14న ఉదయం 6 గంటల 31 నిమిషాలకు పల్లవి వర్మను పెళ్లాడ బోతున్నాడు ఈ యంగ్ హీరో. అసలు ఏప్రిల్ 16నే ఈ జంట వివాహం జరగాల్సి ఉంది. కానీ అప్పడే కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటంతో పెళ్లి వేడుకను వాయిదా వేసుకున్నారు. అయితే లాక్‌ డౌన్‌ తరువాత మూఢం రావటం, ముహూర్తాలు లేకపోవటంతో మే 14న వివాహ తంతు ముగించనున్నారు.  సోష‌ల్ డిస్టెన్స్ దృష్ట్యా క్లొజ్ స‌ర్కిల్ ని మాత్ర‌మే పిలిచి షామిర్ పెట్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో  పెళ్ళి చేయ నిశ్చ‌యించారు. కరోనా సందర్భంగా ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా తను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు నిఖిల్‌. ఈ రోజు (బుధవారం) సాయంత్రం పెళ్లి వేడుక మొదలైంది.

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

loader