యోగిబాబు చేతి మణికట్టుకి నల్లతాడు.. సీక్రెట్ బయటపెట్టిన స్టార్ కమెడియన్
కోలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా రాణిస్తున్న యోగిబాబు ఓ రహస్యాన్ని బయటపెట్టారు. తన చేతిమణికట్టుకు ఉన్న తాడు సీక్రెట్ వెల్లడించారు.

యోగిబాబు తమిళ సినిమాల్లో ప్రముఖ హాస్యనటుడుగా రాణిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన బాగా పాపులర్ అయ్యారు. స్టార్ కమెడియన్‌గా మెప్పిస్తున్నారు. రజినీకాంత్, విజయ్, సూర్య, రవిమోహన్, విజయ్ సేతుపతి, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి చాలా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఆర్టిస్ట్ అయ్యారు. హాస్యనటుడిగానే కాకుండా హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు.
ప్రతి సినిమా తర్వాత యోగిబాబు ఆధ్యాత్మిక సేవలో ఉంటారు. భక్తిమార్గంలో వెళ్తుంటారు, టెంపుల్స్ ని దర్శిస్తుంటారు. ఆయన గుళ్ళ చుట్టూ తిరగడం అలవాటు చేసుకున్నాడు. ఇటీవల కృష్ణగిరి జిల్లాలోని ఓసూర్‌లో ఉన్న మోరన్‌పల్లిలోని రాహు కేతు అథర్వణ శ్రీ మహా ప్రత్యంగిరా దేవాలయంలో దర్శనం చేసుకున్నాడు. స్వయంగా దీపారాధన చేసి పూజలు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తిరుచెందూర్, తిరుత్తణి వంటి చాలా గుళ్లకు వెళ్లాడు. ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్న యోగిబాబు ప్రతి సినిమాకు ముందు, తర్వాత గుడికి వెళ్లి పూజలు చేయడం అలవాటు చేసుకున్నాడు. చేతికి రకరకాల తాయత్తులు కట్టుకుంటాడు. కానీ సినిమాల్లో అలాంటివి ఏవీ ఉండవు. అయితే కొన్ని సినిమాల్లో అలాగే నటించాడు.
యోగిబాబు కట్టిన కయిరు గుట్టు
సాధారణంగా ఆధ్యాత్మిక భక్తి ఉన్నవారు దిష్టి తగలకుండా చేతికి, మెడకి, కాలికి నల్ల తాడు కడతారు. ఇది చాలా పురాతన ఆచారం. ఈ ఆచారం నేటి యువతలో కూడా ఉంది. కొంతమంది పచ్చ, ఎర్ర, పసుపు వంటి రంగుల తాళ్లని చేతికి కట్టుకుంటారు.
read more:సినిమాలు వదిలేసి హిమాలయాల్లో సెటిల్ అవుతా.. స్టార్ హీరో ప్రకటన.. కారణం ఏంటో తెలుసా?
also read: రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా నుంచి గూస్ బంమ్స్ అప్‌డేట్.. RC16 స్టోరీలో కీలక పాయింట్ లీక్?
యోగిబాబు గుడి సందర్శనం
అలాగే యోగిబాబు కూడా చేతికి చాలా నల్లతాడు కట్టుకున్నాడు. దీని గురించి ఓ కార్యక్రమంలో యాంకర్ అడిగాడు. రోజురోజుకీ మీ చేతిలో తాళ్లు ఎక్కువ అవుతున్నాయి, ఎందుకని అడిగాడు. దానికి యోగిబాబు, ఇది అనవసర ప్రశ్న, నువ్వు లేవు, నేను లేను, మన పూర్వీకులకు ముందే ఇది వచ్చింది, దీని గురించి మాట్లాడొద్దని చెప్పాడు. దేవాలయాలను సందర్శించినప్పుడు ఆయా టెంపుల్స్ లోని దైవంగా భావించే దారాలను ఇలా తన చేతికి కట్టుకుంటున్నట్టు తెలుస్తుంది.
also read: తాగిన మత్తులో బూతులు తిట్టిన `జైలర్` విలన్, బహిరంగ క్షమాపణలు