MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anand Deverakonda : రష్మిక మందన్నతో ఆనంద్ దేవరకొండ స్టెప్పులు, విజయ్ దేవరకొండ పెళ్లిలో.. బేబీ హీరో రచ్చ

Anand Deverakonda : రష్మిక మందన్నతో ఆనంద్ దేవరకొండ స్టెప్పులు, విజయ్ దేవరకొండ పెళ్లిలో.. బేబీ హీరో రచ్చ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫోటోలు, వీడియోల కోసం అబిమానులు  ఎదురుచూస్తున్న టైంలో.. విజయ్ తమ్ముడు, హీరో ఆనంద్ దేవరకొండ ఒక అదిరిపోయే వీడియో షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేశాడు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 12 2026, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఘనంగా విజయ్ రష్మిక పెళ్లి..
Image Credit : Instagram

ఘనంగా విజయ్ - రష్మిక పెళ్లి..

సౌత్ ఇండియా మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవల పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వాళ్ల పెళ్లి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

27
విజయ్, రష్మిక అభిమానులకు సర్ ప్రైజ్..
Image Credit : Instagram

విజయ్, రష్మిక అభిమానులకు సర్ ప్రైజ్..

ఈ స్టార్ కపుల్ పెళ్లి ఫోటోలు, వీడియోల కోసం అభిమానులకు  ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ టైంలో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఒక సూపర్ వీడియో షేర్ చేసి సోషల్ మీడియాలో దుమారం రేపాడు.

Related Articles

Related image1
మహేష్ బాబు డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా? సూపర్ స్టార్ అంత సాహసం చేయగలడా..?
Related image2
జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కిలోలు బరువు తగ్గాడో తెలుసా? తారక్ కు ఎలా సాధ్యం అయ్యింది?
37
ఆనంద్ దేవరకొండ స్పెషల్ వీడియో..
Image Credit : Instagram

ఆనంద్ దేవరకొండ స్పెషల్ వీడియో..

నటుడు ఆనంద్ దేవరకొండ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పెషల్ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో కొత్త జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నతో కలిసి ఆనంద్ ఫుల్లుగా స్టెప్పులేశాడు. ఎలాంటి హడావుడి లేకుండా ముగ్గురూ చాలా సింపుల్‌గా, హ్యాపీగా డ్యాన్స్ చేయడం అభిమానులు  ను ఆకట్టుకుంటోంది.

47
వీడియోలో ప్రత్యేకత ఏంటంటే?
Image Credit : Instagram

వీడియోలో ప్రత్యేకత ఏంటంటే?

ఈ వీడియోలో విజయ్ దేవరకొండ రంగురంగుల షర్ట్, వైట్ ప్యాంట్‌లో మెరుస్తుండగా, రష్మిక మందన్న సింపుల్‌గా షార్ట్స్, షర్ట్‌తో క్యాజువల్ లుక్‌లో కనిపించింది. పచ్చని గడ్డిపై పక్కన ఎవరున్నారని పట్టించుకోకుండా ముగ్గురూ ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేశారు.
57
ఆనంద్ దేవరకొండ పాటకు..
Image Credit : Instagram

ఆనంద్ దేవరకొండ పాటకు..

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా 'ఎపిక్' (Epic)లోని 'సంచారమే' అనే పాటకు వీళ్లు డ్యాన్స్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ పాట ప్లే అవుతుంటే, కుటుంబ సభ్యులంతా కలిసి చిందేశారు. "చూడటానికి కొంచెం గందరగోళంగా (Chaotic) ఉండొచ్చు, కానీ ఆ క్షణంలో మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. మనకు ఇష్టమైన వాళ్లతో కలిసి ప్రయాణించడం, డ్యాన్స్ చేయడం కన్నా ఆనందం ఏముంటుంది?" అని ఆనంద్ ఎమోషనల్‌గా క్యాప్షన్ పెట్టాడు.
67
రష్మిక గురించి ఒక స్పెషల్ పోస్ట్
Image Credit : Instagram

రష్మిక గురించి ఒక స్పెషల్ పోస్ట్

పెళ్లి తర్వాత ఆనంద్ తన వదిన రష్మిక గురించి ఒక స్పెషల్ పోస్ట్ పెట్టాడు. "గతంలో బయటకు వెళ్లినప్పుడు అభిమానులు 'వదిన ఎలా ఉన్నారు?' అని ఆటపట్టించేవారు. అప్పుడు ఏం చెప్పాలో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అధికారికంగా ఆమెను మా కుటుంబంలోకి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది" అని చెప్పాడు. మెహెందీ ఫంక్షన్ ఫోటోలు షేర్ చేస్తూ, "పెళ్లిలోని ప్రతి రోజు ఒక హాలిడేలా గడిచింది. మా ఆత్మీయులతో గడిపిన ఆ క్షణాలను ఇప్పుడు మిస్ అవుతున్నాం" అని అన్నాడు.

77
ఎపిక్' సినిమా పనుల్లో ఆనంద్ దేవరకొండ..
Image Credit : Instagram

ఎపిక్' సినిమా పనుల్లో ఆనంద్ దేవరకొండ..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చాలా ప్రైవేట్‌గా జరిగింది. కేవలం దగ్గరి బంధువులు, కొద్దిమంది సినీ ప్రముఖులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ తన 'ఎపిక్' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు  ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి విజయ్-రష్మిక డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఆడపడుచు మృతి.. 30 ఏళ్లకే మాయా కిబెల్ ఎలా కన్నుమూసిందంటే?
Recommended image2
Monalisa: వైరల్ గర్ల్ మోనాలిసా భర్త ఏం చేస్తాడు? ఎక్కడ కలుసుకున్నారు? ఎంతకాలం ప్రేమించుకున్నారు?
Recommended image3
జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కిలోలు బరువు తగ్గాడో తెలుసా? తారక్ కు ఎలా సాధ్యం అయ్యింది?
Related Stories
Recommended image1
మహేష్ బాబు డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా? సూపర్ స్టార్ అంత సాహసం చేయగలడా..?
Recommended image2
జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కిలోలు బరువు తగ్గాడో తెలుసా? తారక్ కు ఎలా సాధ్యం అయ్యింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved