Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • తాగిన మత్తులో బూతులు తిట్టిన `జైలర్‌` విలన్‌, బహిరంగ క్షమాపణలు

తాగిన మత్తులో బూతులు తిట్టిన `జైలర్‌` విలన్‌, బహిరంగ క్షమాపణలు

 `జైలర్‌` విలన్‌, మలయాళ నటుడు వినాయకన్ తాగిన మత్తులో అసభ్యకరంగా మాట్లాడిన వీడియో వైరల్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో రచ్చ చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు దిగొచ్చాడు నటుడు. 

Aithagoni Raju | Published : Jan 21 2025, 10:20 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

రజనీకాంత్‌ `జైలర్‌` చిత్రంతో విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు వినాయకన్‌.  మలయాళంలో ప్రముఖ నటులలో ఒకరైన వినాయకన్, తమిళంలో విశాల్ `తిమిరు`, సింబు `సిలంబాట్టం`, `ఎల్లామ్ అవన్ సెయల్`, `సిరుతై`, `మర్యాన్` వంటి చిత్రాల్లో నటించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన` జైలర్` సినిమాలో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.  

24
Asianet Image

సినిమాల్లో నటుడిగా ఎంత పాపులరో, బయట వివాదాలతో అంతే వార్తల్లో నిలుస్తుంటారు వినాయకన్‌.  కొన్ని నెలల క్రితం హైదరాబాద్ విమానాశ్రయంలో భద్రతా సిబ్బందితో గొడవ జరిగి అరెస్ట్ అయి, తర్వాత విడుదలయ్యారు. ఇటీవల తన ఇంటి బాల్కనీలో తాగిన మత్తులో అసభ్యకరంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయనపై ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో దెబ్బకి దిగొచ్చాడు.  ప్రజలకు క్షమాపణలు తెలిపారు.

34
Asianet Image

సోషల్ మీడియా ద్వారా వీడియోలో క్షమాపణలు చెప్పిన వినాయకన్, "సినిమా నటుడిగా, వ్యక్తిగా కొన్ని విషయాలు నేను సరిగ్గా నిర్వహించలేకపోయాను. నా చర్యల వల్ల కలిగిన అన్ని రకాల ఇబ్బందులకు, అసౌకర్యానికి ప్రజలకు క్షమాపణలు కోరుతున్నాను` అని అన్నారు.

read  more: ఎన్టీఆర్‌ సినిమాతో పరిచయం కావాల్సిన కృష్ణంరాజుకి ఆఫర్‌ ఎలా మిస్‌ అయ్యింది? సిగరేట్ ఎంత దెబ్బకొట్టింది?

also read: చిలుకూరి బాలాజీని దర్శించుకున్న SSMB29 హీరోయిన్‌.. రాజమౌళి ప్లాన్‌ ఫాలో అవుతుందా?

 

44
Asianet Image

వినాయకన్ వీడియోపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని కొచ్చి పోలీసులు తెలిపారు. అయితే, సోషల్ మీడియాలో వినాయకన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతకు ముందు కూడా వినాయకన్ ఇలాగే అసభ్యకరంగా మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇలా నటుడిగా కంటే వివాదాలతోనే ఆయన ఎక్కువగా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. ప్రస్తుతం మలయాళంలో ఓ మూవీలో నటిస్తున్నారు. 

read more: రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు సినిమా నుంచి గూస్‌ బంమ్స్ అప్‌డేట్‌.. RC16 స్టోరీలో కీలక పాయింట్‌ లీక్‌?

also read: వెంకటేష్‌ సరికొత్త రికార్డు, `సంక్రాంతికి వస్తున్నాం` కలెక్షన్ల సునామీ.. చిరు, బన్నీ రికార్డులకు ఎసరు!

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories