- Home
- Entertainment
- Yash Ravana Look: రావణాసురుడి పాత్రకు 'యశ్' ధరించిన ఆభరణాల బరువెంతో తెలుసా? దాని డిటెయిలింగ్ ఇంత ఉందా?
Yash Ravana Look: రావణాసురుడి పాత్రకు 'యశ్' ధరించిన ఆభరణాల బరువెంతో తెలుసా? దాని డిటెయిలింగ్ ఇంత ఉందా?
Yash Ravana Look: ‘రామాయణం’ సినిమాలో రావణుడిగా కనిపించిన యశ్ లుక్ కోసం ఏకంగా 130 రకాల ఆభరణాలను తయారు చేశారు. ఒక్కో లుక్‌లో సుమారు 6-7 కేజీల నగలు ధరించిన యశ్ కోసం వీటిని ఎలా రూపొందించారు? వాటి డిజైన్ల వెనుక ఉన్న ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

లంకేశ్వరుడి పాత్రలో అదరగొట్టిన యశ్
బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రామాయణం' (Ramayana) సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ప్రేక్షకులు సినిమా సెట్స్, విఎఫ్ఎక్స్ (VFX), అద్భుతమైన విజువల్స్‌ను మెచ్చుకుంటుంటే.. మరోవైపు 'రాకింగ్ స్టార్' యశ్ (Yash) నటించిన 'లంకేశ్వరుడు' రావణుడి పాత్ర, ఆయన లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
రావణుడి పాత్ర కోసం 30 ఆభరణాలు
తెరపై రావణుడి పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా, రాజసంగా చూపించేందుకు దర్శకుడు కేవలం కాస్ట్యూమ్స్పైనే కాకుండా.. పక్కాగా డిజైన్ చేసిన ఆభరణాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ 'హౌస్ ఆఫ్ ఆమ్రపాలి' (House of Amrapali) యశ్ రావణుడి పాత్ర కోసం ఏకంగా 130 ఆభరణాలను సిద్ధం చేసింది. ఈ ఆభరణాల వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటంటే..
ఆభరణాల బరువు 6-7 కిలోలు
ఈ సినిమాలో రావణుడి పాత్ర కోసం మొత్తం 13 రకాల లుక్స్‌ను రెడీ చేశారు. ప్రతి లుక్‌కి తగ్గట్టుగా సుమారు 130 ఆభరణాలను ఉపయోగించారు. వీటన్నింటి బరువు ఏకంగా 6 నుంచి 7 కిలోల వరకు ఉంటుంది.
'హౌస్ ఆఫ్ ఆమ్రపాలి' క్రియేటివ్ హెడ్ తరంగ్ అరోరా చెప్పిన దాని ప్రకారం..రావణుడి అహంకారం, శివ భక్తి, గాంభీర్యం, లంకా వైభవాన్ని చూపించేలా ఈ ఆభరణాలను ఎంతో సూక్ష్మంగా డిజైన్ చేశారు. మొత్తం సినిమా కోసం ఈ సంస్థ సుమారు 18 నెలల పాటు కష్టపడి 4,500కి పైగా ఆభరణాలను డిజైన్ చేసింది.
శివ భక్తి (త్రిశూలం), రాక్షస డిజైన్లు
రావణుడు కేవలం క్రూరమైన రాజు మాత్రమే కాదు.. గొప్ప శివభక్తుడు, అసాధారణ యోధుడు కూడా. ఈ వైవిధ్యాన్ని ఆయన ఆభరణాల్లో స్పష్టంగా చూపించారు.
డార్క్ మెటాలిక్ టోన్: ఆభరణాల్లో నీలం, నలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు ఇత్తడి, బంగారు పూత (Plating) ఉపయోగించారు.
ప్రత్యేక ఆకృతులు: పెద్ద చెస్ట్ ప్లేట్ (ఛాతీ కవచం), కడియాలపై శివుని త్రిశూలం, సింహం, పాము, రాక్షసుల ముఖాల డిజైన్లను చాలా ఆకర్షణీయంగా చెక్కారు.
7 కిలోల బరువున్న ఆభరణాలు ధరించి ఎలా నటించారు?
షూటింగ్ సమయంలో యశ్ 6-7 కిలోల బరువున్న ఈ ఆభరణాలను ధరించి గంటల కొద్దీ నటించడం నిజంగా పెద్ద సవాల్. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఆభరణాల లోపలి భాగంలో ప్రత్యేకమైన మృదువైన లైనింగ్ (Soft Lining) ఇచ్చారు. దీనివల్ల గుచ్చుకోవడం గానీ, అసౌకర్యం గానీ కలగలేదు. విశేషమేమిటంటే.. షూటింగ్ టైమ్‌లో యశ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని.. ముందుగా వర్కర్లు ఆ ఆభరణాలను ధరించి టెస్ట్ చేసిన తర్వాతే సెట్‌కు పంపించారు.
మొత్తానికి.. లంకా స్వర్ణ వైభవం, రావణుడి పాత్ర బరువును పెంచడంలో ఈ ప్రత్యేకమైన ఆభరణాలు కీలక పాత్ర పోషించాయి. యశ్ రావణుడి లుక్ భారతీయ సినిమాలో ఒక కొత్త మైలురాయిని సృష్టించింది అనడంలో సందేహం లేదు.













