Naga Chaitanya: నేనూ ఏడుస్తాను, చివరగా ఎప్పుడు ఏడ్చానంటే.. నాగచైతన్య అంతరంగం
Naga Chaitanya: నాగ చైతన్య.. తాను కూడా ఏడుస్తానని తెలిపారు. రెండు నెలల క్రితమే ఏడ్చాడట. అదే సమయంలో సోషల్ మీడియాలోపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మొత్తంగా దానిలో లీనమై పోయాడట.

నాగచైతన్య ఏడుస్తాడా?
నాగచైతన్య అడపాదడపా ట్రావెల్ చేస్తుంటారు. బైక్, కార్ రేసింగ్ అంటే ఇష్టం. ట్రెక్ కి ఎప్పుడో చిన్నప్పుడు వెళ్లాడట. కానీ ఇన్నాళ్లకు మళ్లీ వెళ్లాడు. ఒక యూట్యూబ్ ఛానెల్ తో ఇంటరాక్షన్‌లో భాగంగా ఆయన ట్రెక్ చేశారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా విషయాలను పంచుకున్నారు. మీరు ఎప్పుడైనా ఏడ్చారా అని యూట్యూబర్ అడగ్గా, అవును తాను ఏడుస్తానని చెప్పారు.
తాను అందరి లాంటివాడినే అని, తనకు అన్ని ఫీలింగ్స్ ఉంటాయని చెప్పిన నాగచైతన్య.. తనకు ఏడుపు వస్తుందని, రెండు నెలల క్రితం కూడా ఏడ్చానని వెల్లడించారు. ఎందుకు ఏడ్చాడో చెప్పలేదు, కానీ తాను ఏడ్చినట్టు చెప్పారు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఉందని, తాను బయటకు ఏడవలేదట. లోలోపల ఏడ్చినట్టు చెప్పాడు. లోలోపల చాలా బాధ బాధపడతాడట.
చైతూ చివరగా ఎప్పుడు ఏడ్చాడంటే?
ఆ సమయంలో గుండె అంతా బరువెక్కినట్టు ఉంటుందట. హార్ట్ ఎటాక్ వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుందని, ఆ తర్వాత నెమ్మదిగా కూల్ అవుతుందని చెప్పారు. అయితే సినిమాలు చూసినప్పుడు కూడా ఏడుపొస్తుందని చెప్పాడు. చివరగా రెండు నెలల క్రితమే ఏడ్చానని చెప్పాడు. బ్రాడ్ పిట్ నటించిన `హార్ట్ ఆఫ్ ది బీస్ట్` వంటి కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పాడు నాగచైతన్య. ఇలా ఓపెన్‌గా ఆయన కామెంట్స్ చేశాడు.
సోషల్ మీడియాపై చైతూ కామెంట్స్
సోషల్ మీడియా గురించి చెబుతూ, కోవిడ్ తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలోనే గడపడం స్టార్ట్ చేశాడట. ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నాడో కూడా తెలియకుండా దానిలోనే మునిగిపోయేవాడట. అనంతరం క్రియేటివ్ అంశాలపై ఫోకస్ పెట్టడం, సహనం తగ్గడం, నిద్ర క్వాలిటీ తగ్గిపోవడం వంటి మార్పులను గమనించాను.
ఆ సమయంలోనే సోషల్ మీడియాలో ఇంత టైమ్ స్పెండ్ చేయడం అవసరమా అనేది ప్రశ్నించుకున్నానని, మన పని మన గురించి చెబుతుంది, మన ఫ్యామిలీకి మనం ఎలాంటివాళ్లమో తెలుసు, అలాంటప్పుడు సోషల్ మీడియాతో పనేంటి అనే ఆలోచనకు వచ్చినట్టు తెలిపారు నాగచైతన్య.
అనంతరం క్రమంగా ఫోన్ చూసే టైమ్, సోషల్ మీడియాని చూసే సమయం పది, ఇరవై నిమిషాలకు తగ్గించుకున్నారట. సోషల్ మీడియాలో ఏదీ శాశ్వతం కాదు, ప్రతి రోజూ వార్త స్థానంలో మరో వార్త వస్తుంటుంది, ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి అని తెలిపారు చైతూ.
కమర్షియల్ సినిమాలపై నాగచైతన్య కామెంట్
కమర్షియల్ చిత్రాల గురించి చైతూ మాట్లాడుతూ, కమర్షియల్ సినిమాలంటే పాటలు, ఫైట్స్, హీరోయిజం ఎలివేట్ చేసే సీన్లు ఉంటాయి. వాటిపై ఆడియెన్స్ లో చాలా అంచనాలుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే కమర్షియల్ సినిమాలను రూపొందించడం, నాన్ కమర్షియల్ చిత్రాల కంటే చాలా కష్టమైనది. ఇలాంటి సినిమాల భారాన్ని తమ భుజాలపై మోయడం అంత ఈజీ కాదు, పూర్తిస్థాయి కమర్షియల్ మార్గాన్ని ఎంచుకుని విజయవంతమైన చిత్రాలను అందించే దర్శకులు, నటులంటే తనకు ఎంతో గౌరవం అని వెల్లడించారు చైతూ.
ప్రేమ కథల్లో చూసేందుకు ఆడియెన్స్ ఇష్టపడతారు
ఈ సందర్భంగా లవ్ స్టోరీస్ గురించి చెబుతూ, ప్రేమ కథల్లో నన్ను చూడటానికి ఆడియెన్స్ ఇష్టపడతారనిపిస్తుంది. వీటిలో ఏదైనా కొత్తగా చెప్పినప్పుడు వారు బాగా ఆదరిస్తారు. ఉదాహరణకు మజిలీ ఒక సాధారణ ప్రేమ కథ కాదు. అది చాలా భిన్నంగా ఉండటంతో ప్రేక్షకులు దాన్ని బాగా స్వీకరించారు. ప్రేమ కథలను ప్రధానాంశంగా ఉంచుకొని, అందులో ఏదైనా కొత్తదనాన్ని ప్రయత్నించినప్పుడల్లా అది నాకు కలిసి వచ్చింది.
ముఖ్యంగా యాక్షన్ అంశాలతో బ్యాలెన్స్ చేసినప్పుడు, ఆడియెన్స్ అలాంటి పాత్రల్లో నన్ను చూసేందుకు ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారని అనిపించింది. అయితే ఏదో ఒక సినిమా హిట్ అయ్యిందని అదే తరహా కథలను పదే పదే చేయడం నాకిష్టం లేదు. అందుకే నేను ఎప్పుడూ డిఫరెంట్ మూవీస్ చేయడానికి ప్రయారిటీ ఇస్తున్నాను` అని చెప్పారు నాగచైతన్య. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.











