- Home
- Entertainment
- Suman: సుమన్ కోసం ఇంటి గేటుముందు వెయిట్ చేసిన మోహన్ బాబు, జైలుకెళ్లి వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా?
Suman: సుమన్ కోసం ఇంటి గేటుముందు వెయిట్ చేసిన మోహన్ బాబు, జైలుకెళ్లి వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా?
Suman: సినీ నటుడు సుమన్ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు, ఊహించని మలుపులు ఉన్నాయి. తన జీవితంలోని ఆ క్లిష్ట సమయంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చూపిన ఆదరణ, ఇచ్చిన ధైర్యాన్ని సుమన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.

ఒకప్పుడు స్టార్ గా రాణించిన సుమన్
హీరో సుమన్ ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు. మెగాస్టార్ కి పోటీ ఇచ్చారనే విషయం తెలిసిందే. కానీ అనూహ్యంగా బ్లూ ఫిల్మ్ ఆరోపణ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కెరీర్ తలక్రిందులయ్యింది. తనకు సంబంధం లేని కేసులో తాను అరెస్ట్ కావాల్సి వచ్చింది. కెరీర్‌నే పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ కేసులో ఆయన నిర్ధోశిగానే విడుదలయ్యారు. కానీ కొందరు చేసిన కుట్రలకు ఆయన బలయ్యారు. ఈ క్రమంలో ఆ సమయంలో తనకు అండగా నిలబడ్డ హీరో మోహన్ బాబు గురించి సుమన్ షాకింగ్ విషయాలు బయటపెట్టారు.
కష్టకాలంలో ముందుకొచ్చిన మోహన్ బాబు
తాను ఎదుర్కొన్న కష్టకాలం తర్వాత మరుసటి రోజు ఉదయమే మోహన్ బాబు తన ఇంటి వద్దకు వచ్చారని సుమన్ తెలిపారు. బయట ఎవరినీ కలవడానికి ఇష్టం లేదని తల్లి చెప్పినప్పటికీ, మోహన్ బాబు వచ్చినట్లు తెలియగానే లోపలికి పిలిచారని చెప్పారు. మోహన్ బాబు తనకు పూలదండ వేసి, "శిరిడీ సాయిబాబా ఆశీర్వాదాలతో నువ్వు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి వస్తావు. ఏం భయపడొద్దు, నీ సీటు నీకే వస్తుంది" అంటూ భరోసా ఇచ్చారని సుమన్ వివరించారు. ఆ మాటలు తనకెంతో ధైర్యాన్ని ఇచ్చాయని, ఆ సంఘటనను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు .ఇండస్ట్రీలో ఫోన్ చేసి పలకరించిన వారు చాలామంది ఉన్నా, బహిరంగంగా ముందుకు వచ్చి కలిసిన వారిలో పురుషుల తరఫున మోహన్ బాబు, మహిళల తరఫున సుమలత ఉన్నారని గుర్తుచేశారు.
పెళ్లి మండపంలో చందనం దండల జ్ఞాపకం
తన వివాహ సమయంలోనూ మోహన్ బాబు చూపిన ఆప్యాయతను సుమన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉదయం 5:15 గంటలకే పెళ్లి మండపానికి వచ్చిన మోహన్ బాబు, రెండు చందనం దండలు ఇచ్చారట. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నానని చెబుతూ, ఆ దండలు చివరి వరకు మెడలోనే ఉండాలని, ఫోటో తీసి పంపాలని ఆప్యాయంగా చెప్పి వెళ్లారని సుమన్ తెలిపారు.
కోపం వెనుక ఉన్న నిజాయితీ
మోహన్ బాబును బయటి వారు కోపిష్టి అని అంటుంటారని, కానీ ఆయనలో గోల్డెన్ హార్ట్ ఉందని సుమన్ అన్నారు. ఆయన కొంచెం ఓపెన్‌గా, రఫ్ అండ్ టఫ్‌గా మాట్లాడతారని, షార్ట్ టెంపర్డ్ అయినప్పటికీ ఆయన వాదనలో ఒక పాయింట్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. అనవసరంగా ఎవరితోనూ గొడవ పడరని, కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే మోహన్ బాబుపై తనకు ప్రత్యేక గౌరవం ఉందని స్పష్టం చేశారు.
కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సుమన్..
తెలుగు సినిమా చరిత్రలో స్టార్ హీరోగా ఎదిగిన సుమన్ కెరీర్‌లో అనూహ్యమైన ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన సినీ ప్రయాణానికి తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే, ఆ కష్టాలను అధిగమించి మళ్లీ సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ఇక మోహన్ బాబు విషయానికి వస్తే, సినీ రంగంలో తనదైన శైలిలో ముందుకు సాగుతూనే, రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర పోషించారు. తన సహచర నటులకు కష్టకాలంలో అండగా నిలవడం, సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయన ప్రత్యేకతగా నిలిచాయి.











