- Home
- Entertainment
- Vijay Rashmika: విజయ్ దేవరకొండతో పెళ్లైతే రాజకీయాల్లోకి రష్మిక.. వారి జాతకం ఇదే చెబుతోందా?
Vijay Rashmika: విజయ్ దేవరకొండతో పెళ్లైతే రాజకీయాల్లోకి రష్మిక.. వారి జాతకం ఇదే చెబుతోందా?
స్ఠార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నల నిశ్చితార్థం శుక్రవారం నాడు నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు నటుల జాతకాల ప్రకారం పెళ్లి తర్వాత రష్మిక రాజకీయాల్లోకి వస్తుందా? జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.

విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న
నిన్న(శుక్రవారం) ఎంగేజ్ మెంట్ తో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా వీరి ప్రేమ, పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పుడు చాలామంది జ్యోతిష్య నిపుణులు… విజయ్ , రష్మికల జాతకాల ప్రకారం వీరు చాలా తెలివైనవారు. రెండు కుటుంబాల అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటారని చెప్పారు. ఇప్పుడు అదే జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య విజయ్, రష్మిక ఎంగేజ్ మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెళ్లి తర్వాత వీరిద్దరి లైఫ్ ఎలా మారిపోతుంది? పెళ్లి ఎవ్వరికి బాగా కలిసివస్తుంది. పెళ్లి తర్వాత రష్మిక రాజకీయాల్లోకి వస్తుందా? పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
రష్మిక మందన్న
రష్మిక మందన్న సినీరంగంలోకి వచ్చిన తర్వాత ఆమె జీవితంలో అతిపెద్ద ప్రతికూల అంశం ఏదైనా ఉందంటే అది ఆమె గత నిశ్చితార్థమే. రష్మిక మందన్నకు గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు వారు విడిపోయారు. అక్కడితో అది ముగిసిపోయింది. అయితే రష్మిక జాతకం ప్రకారం ఆ ఎంగేజ్ మెంట్ రద్దు చేసిన తర్వాతే ఆమెకు కలిసివచ్చిందని చాలామంది పండితులు చెబుతున్నారు. రష్మిక జాతకం.. అనుకూలత లేని బంధాల్లో ఉంటేనే ప్రతికూల ఫలితాలను ఇస్తుందనేది వారి మాట. నిజానికి ఆమె వ్యక్తిగత అదృష్టం చాలా బలమైనదని వారు చెబుతున్నారు.
విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ జాతకంలో వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేసే ప్రత్యక్ష దోషం ఉన్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. శుక్రుడు నీచ స్థితిలో ఉంటడం వల్ల విజయ్ కెరీర్ సమస్యలతో పాటు, వివాహ సంబంధిత సమస్యలు తప్పవని అంచనా వేస్తున్నారు. అయితే రష్మికకు ఉన్న అద్భుత యోగం, విజయ్ దేవరకొండ జాతకంలో ఉన్న శుక్రుడి నీచం కారణంగా ఏర్పడే వివాహ సమస్యలను అధిగమించడానికి బలంగా సహాయపడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కర్కాటక లగ్నం కారణంగా విజయ్‌లో ఉన్న రక్షించే స్వభావం రష్మికకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వవచ్చని చెబుతున్నారు.
కుటుంబ నేపథ్యం
నిజానికి ఈ స్టార్స్ ఇద్దరూ మధ్యతరగతి నేపథ్యం నుంచి స్వయంకృషితో ఎదిగినవారే. రష్మిక కూడా తన కుటుంబ ఆర్థిక కష్టాల గురించి చాలాసార్లు అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా విజయ్ కూడా తన తండ్రి కష్టపడటం చూసి, కుటుంబ జీవన ప్రమాణాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉమ్మడి నేపథ్యం వారి కుటుంబాల మధ్య బంధాన్ని, గౌరవాన్ని పెంచడానికి సహాయపడుతాయని పండితులు అంచనా వేస్తున్నారు.
రాజకీయాల్లోకి రష్మిక!
రష్మిక జాతకంలోని అసాధారణ అదృష్టం దేవరకొండ కుటుంబ ప్రతిష్టపై కూడా సానుకూల ప్రభావం చూపించే అవకాశం ఉందట. రష్మిక మందన్నకు ఉన్న బలమైన అదృష్టం కారణంగా ఆమె భవిష్యత్తులో లోక్‌సభ ఎంపీ అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ రష్మిక రాజకీయాల్లోకి ప్రవేశిస్తే, తద్వారా విజయ్ దేవరకొండ కుటుంబానికి మరింత సామాజిక గుర్తింపు, ప్రజాదరణ దక్కే అవకాశం ఉంది. రష్మిక రాజకీయ, సినీరంగాలలో సాధించే అద్భుత విజయాలు దేవరకొండ కుటుంబ ప్రతిష్టను మరింత పెంచవచ్చని పండితులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.