- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Latest Episode: వేలంపాటలో కార్తీక్ ను లేకుండా చేసిన జ్యో- దీపను బాధపెట్టిన సుమిత్ర
Karthika Deepam 2 Latest Episode: వేలంపాటలో కార్తీక్ ను లేకుండా చేసిన జ్యో- దీపను బాధపెట్టిన సుమిత్ర
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 4వ తేదీ)లో వేలంపాట నుంచి కార్తీక్, శివన్నారాయణ, దశరథలను వెళ్లిపోయేలా చేస్తుంది జ్యో. ఈ పని ఎవరో చేశారో నాకు బాగా తెలుసు అంటాడు దశరథ. నేను చాలా సంతోషంగా ఉన్నా అంటుంది సుమిత్ర. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 శనివారం ఎపిసోడ్ లో నువ్వు నన్ను ఎలా చూడాలి అనుకున్నావో అలాగే చూస్తావు గ్రానీ అంటుంది జ్యోత్స్న. వేలంపాటలో గెలిచి అందరినీ తనవైపు తిప్పుకుంటానని చెబుతుంది. కార్తీక్ గాడు వస్తే అది కుదరదు అంటుంది పారు. బావ రాకుండా నేను చూసుకుంటాను అంటుంది జ్యోత్న్స. ఇంతలో వేలంపాటకు వెళ్తామా అంటూ రెడీ అయి వస్తారు శివన్నారాయణ, దశరథ.
సుమిత్రను ఎదురురమ్మని అడుగుతారు. ఆగు తాత నేను అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అంటుంది జ్యో. గెలవడానికి ప్రయత్నిస్తున్నవారికి చాలామంది శత్రువులు ఉంటారు. గెలిచిన తర్వాత వాళ్లు ఏమి చేయలేరు. నేను గెలవాలని నన్ను ఆశీర్వదించు మమ్మీ అంటుంది జ్యో. ఆశీర్వదిస్తుంది సుమిత్ర. కార్తీక్ నువ్వు కూడా మాతో పాటు రా అంటాడు దశరథ. అవసరం లేదు కారు నేను డ్రైవ్ చేస్తా అంటుంది జ్యోత్స్న. కారు నువ్వే డ్రైవ్ చేయ్ కానీ కార్తీక్ మనతో వస్తాడు అంటాడు దశరథ. అవసరంలేదని జ్యో అన్న.. శివన్నారాయణ ఒప్పుకోడు. అందరూ కలిసి వేలంపాట దగ్గరకు బయల్దేరుతారు.
వేలంపాటలో జ్యోత్స్న గెలుస్తుందా?
కార్తీక్ కు ఆల్ ది బెస్ట్ చెబుతుంది దీప. నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్లిపోతుంది. దీప వెనకాలే వెళ్లిన పారు... నువ్వు జ్యోత్స్సకు కదా ఆల్ ది బెస్ట్ చెప్పాలి. కార్తీక్ కి ఎందుకు చెబుతున్నావు అని అడుగుతుంది. జ్యోకు అమ్మ దీవనలే ఉన్నాయి. ఇక నా ఆల్ ది బెస్ట్ ఎందుకు అంటుంది దీప. అయితే వేలంపాటలో జ్యోత్స్స గెలుస్తుందా అని అడుగుతుంది పారు. అది నాకెలా తెలుస్తుంది అంటుంది దీప. నువ్వు ఏం అనుకుంటున్నవ్ అని అడుగుతుంది పారు. నేను అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా అంటుంది దీప. నా మనువరాలు గెలుస్తుందని మీకు కుళ్లే అంటూ అక్కడినుంచి వెళ్లిపోతుంది పారు.
దశరథ శత్రువు వైరవ్ ఎంట్రీ..
వేలంపాట దగ్గరకు శివన్నారాయణ, దశరథల శత్రువు వైరవ్ వస్తాడు. అతను గతంలో శివన్నారయణ కుటుంబాన్ని మోసం చేసి ఉంటాడు. వేలం దగ్గరకు వచ్చిన శివన్నారాయణ, దశరథలను పలకరిస్తాడు. వారికి అతను చేసిన మోసం గుర్తొచ్చి కోపం వస్తుంది. వేలంపాటలో తానే గెలుస్తానని.. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండని వైరవ్ అంటాడు. ఎవరు గెలుస్తారో చూద్దాంలే అనుకుంటూ లోపలికి వెళ్లిపోతారు తండ్రీ కొడుకులు.
జ్యోతో ఛాలెంజ్ చేసిన వైరవ్
వెనకాలే వస్తున్న కార్తీక్ జ్యోత్స్నలను కూడా ఆపేస్తాడు వైరవ్. తనని తాను పరిచయం చేసుకొని.. ఉన్నరెస్టారెంట్లే నష్టాల్లో ఉంటే.. ఇప్పుడు కొత్తది కొని ఏం చేస్తారని జ్యోను ప్రశ్నిస్తాడు. అవన్నీ నీకేందుకు అంటుంది జ్యో. నేను మీ నాన్న ఫ్రెండును అంటాడు వైరవ్. ఇతన్నీ ఎప్పుడు చూడలేదే అనుకుంటాడు కార్తీక్. వీడు జ్యోత్స్న కంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకుంటాడు. ఈ వేలంపాటలో నేనే గెలిచి తీరుతానని చెబుతాడు వైరవ్. ఆల్ ది బెస్ట్.. కంగ్రాచులేషన్స్ చెప్పడానికి సిద్ధంగా ఉండమని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది జ్యోత్న్స.
జ్యోత్న్స కొత్త ప్లాన్..
వేలంపాట ఎక్కువ పాడొద్దు. ఎక్కడ ఆపాలో తాను చెబుతానంటాడు శివన్నారాయణ. క్రెడిట్ మొత్తం తానే తీసుకోవాలి అనుకున్న జ్యోకు అది నచ్చదు. వీళ్లను ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి అనుకుంటుంది. చాటుగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేస్తుంది. వాళ్లకు సంబంధించిన రెస్టారెంట్లపై అధికారులు రైడ్ చేయడానికి వచ్చినట్లు దశరథకు ఫోన్ వస్తుంది. వెంటనే వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుంటారు. కార్తీక్ ను కూడా రమ్మంటారు. ఇది ఎవరు చేశారో నాకు బాగా తెలుసు అని వైరవ్ వైపు చూస్తాడు దశరథ. నేను ఇక్కడ హ్యాండిల్ చేస్తాను మీరు వెళ్లండి అంటుంది జ్యోత్న్స.
నీ జీవితమే అబద్దం
మరోవైపు సుమిత్రకు కాఫీ తీసుకెళ్తుంది దీప. ఏం వంట చేశావని అడుగుతుంది సుమిత్ర. మీరు చెప్పిందే చేస్తానని చెబుతుంది దీప. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు నచ్చిన ఫుడ్ చేసుకొని నా కూతురుతో కలిసి తినాలి అనుకుంటున్నాను అంటుంది. నువ్వు టిఫిన్ చేశావా అని అడుగుతుంది. తిన్నానని చెబుతుంది దీప. నిజంగానే తిన్నావా.. లేక అబద్దం చెబుతున్నావా అంటుంది సుమిత్ర. మీతో అబద్దం చెబుతానా అంటుంది దీప. అబద్దాలు చెప్పి చెప్పి నీకు అలవాటు అయిపోయింది అని సుమిత్ర అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగుస్తుంది.