- Home
- Entertainment
- Chiranjeevi: సౌందర్య సినిమా చూసి చేతులు కాల్చుకున్న చిరంజీవి, ఇదెక్కడి గొడవరా అని తలపట్టుకున్న డైరెక్టర్
Chiranjeevi: సౌందర్య సినిమా చూసి చేతులు కాల్చుకున్న చిరంజీవి, ఇదెక్కడి గొడవరా అని తలపట్టుకున్న డైరెక్టర్
సౌందర్య సినిమా వల్ల చిరంజీవి తన కెరీర్ లో ఒక పెద్ద ఫ్లాప్ ఎదుర్కొన్నారు. ఆ సినిమా వద్దని డైరెక్టర్ ఎంత చెప్పినా చిరంజీవి వినలేదట. ఇంతకీ ఆ మూవీ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

కోడి రామకృష్ణ సినిమాలు
తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడు కోడి రామకృష్ణది సరికొత్త పంథా. కోడి రామకృష్ణ ఫ్యామిలీ చిత్రాలు చేసినా, కమర్షియల్ సినిమాలు చేసినా అందులో వైవిధ్యం ఉంటుంది. తన కెరీర్ రెండవ దశలో కోడి రామకృష్ణ గ్రాఫిక్స్ మాయాజాలం చేశారు. ఆయన తెరకెక్కించిన గ్రాఫిక్స్ చిత్రాలు టాలీవుడ్ లో సరికొత్త స్టాండర్డ్స్ సెట్ చేశాయి.
చిరంజీవి అంజి మూవీ
అమ్మోరు, అంజి, దేవి, అరుంధతి లాంటి అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. ఈ చిత్రాల్లో ఉండే గ్రాఫిక్స్ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అయితే వీటిలో చిరంజీవితో చేసిన అంజి చిత్రం మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కంటెంట్ బ్యాడ్ గా ఏమీ లేదు. చాలా అద్భుతమైన కథ. టేకింగ్ కూడా బావుంది. గ్రాఫిక్స్ అయితే వండర్ అనిపించేలా ఉంటాయి. కానీ పూర్తిగా ప్లానింగ్ ఫెయిల్యూర్. ఏళ్ళ తరబడి షూటింగ్ ఆలస్యం కావడంతో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. అంజి రిలీజయ్యే సమయానికి ఈ మూవీపై అంచనాలు అంతగా లేవు. అందుకే ఈ చిత్రం నిరాశ పరిచింది.
చిరంజీవికి నచ్చిన సౌందర్య మూవీ
దీని గురించి డైరెక్టర్ కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సౌందర్యతో తెరకెక్కించిన అమ్మోరు రిలీజ్ అయ్యాక చిరంజీవితో సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. అమ్మోరు చిత్రం అద్భుత విజయం సాధించింది. ఇది కూడా గ్రాఫిక్స్ బేస్డ్ చిత్రమే. ఒళ్ళు గగుర్పొడిచే సీన్లతో కోడి రామకృష్ణ ఈ చిత్రాన్ని మెమొరబుల్ మూవీగా మలిచారు. ఈ మూవీ చిరంజీవికి చాలా బాగా నచ్చింది.
గ్రాఫిక్స్ మూవీనే కావాలి
నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి వెళ్లి చిరంజీవిని డేట్లు అడిగారు. ఆయన డేట్లు ఇవ్వడానికి అంగీకరించారు. కోడి రామకృష్ణతో గ్రాఫిక్స్ మూవీ ప్లాన్ చేస్తాను అని శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిరంజీవికి చెప్పారు. దానికి కూడా చిరంజీవి అంగీకారం చెప్పారు. ఇదే విషయాన్ని శ్యామ్ ప్రసాద్ రెడ్డి నాకు చెప్పారు. చిరంజీవితో గ్రాఫిక్స్ మూవీనా ? ఇదెక్కడి గోడవరా అని అనుకున్నా. చిరంజీవితో సినిమా చేస్తే మంచి కమర్షియల్ అంశాలు ఉండే సినిమా తీయాలి.
పట్టుబట్టిన నిర్మాత, చిరంజీవి
అప్పటికి చిరంజీవి కోసం డ్యూయెల్ రోల్ లో అద్భుతమైన కథ ఒకటి రాసుకున్నా. అది చేద్దాం అని శ్యామ్ ప్రసాద్ రెడ్డికి చెప్పా. లేదు.. చిరంజీవి గారికి నేను మాట ఇచ్చేశాను. మనం గ్రాఫిక్స్ మూవీనే చేయాలి అని అన్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డికి తెలియకుండా చిరంజీవిని కలిశా. గ్రాఫిక్స్ మూవీ అంటే చాలా కష్టం అవుతుంది. మీరు గంటలు గంటలు సెట్స్ లో నిలబడాలి. ఒక కొత్త ఆర్టిస్ట్ లాగా చేయాలి. మీ ఇమేజ్ ని మరిచిపోవాలి. ఇది చాలా కష్టం, మనం వేరే మంచి కథతో సినిమా చేద్దాం అని రిక్వస్ట్ చేశా. అమ్మోరు సినిమా ప్రభావంతో చిరంజీవి గారు కూడా గ్రాఫిక్స్ మూవీ కోసమే పట్టుబట్టారు. నేను కొత్త ఆర్టిస్ట్ లాగే చేస్తాను అని హామీ ఇచ్చారు.
అందుకే ఫ్లాప్
అంజి చిత్రానికి సింగపూర్, మలేషియా, అమెరికా లాంటి దేశాల్లో గ్రాఫిక్స్ వర్క్ జరిగింది అని కోడి రామకృష్ణ తెలిపారు. అంజిపై విపరీతమైన అంచనాలు ఉండేవి. ఆ అంచనాలని సినిమా అందుకోలేకపోయింది. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ అంజి అద్భుతమైన మూవీ అని అంతా ప్రశంసించినట్లు కోడి రామకృష్ణ తెలిపారు.

