జబర్దస్త్ యాంకర్‌గా పాపులర్ అయిన రష్మి గౌతమ్ ప్రస్తుతం `జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలకు యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.
రష్మి నలభై ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. మొన్నటి వరకు సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ నడిపించిందనే వార్తలు వచ్చాయి. జబర్దస్త్ లో వీరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది.
సుడిగాలి సుధీర్ షో నుంచి తప్పుకోవడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని, ఇప్పుడు దూరమయ్యారని తెలుస్తోంది. కానీ అడపాదడపా కలుస్తూ తమ పాత జ్ఞాపకాల్లోకి వెళ్తుంటారు.
రష్మి గౌతమ్ నలభై ఏళ్లకు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడు చేసుకుంటుందో తెలియదు. ఈ క్రమంలో క్లారిటీ వచ్చింది. పెళ్లి వార్త బయటకు వచ్చింది. టైమ్ కూడా ఫిక్స్ అయ్యిందట.
రష్మి గౌతమ్ వచ్చే ఏడాది ఆగస్ట్ లో పెళ్లి చేసుకోబోతుందని, ఆమె జీవితంలో పెళ్లి యోగం ఉందని తెలిపారు ఆస్ట్రాలజర్. కోరుకున్నవాడితోనే పెళ్లి అని ఆశ్చర్యపరిచారు.
మనసులో ఉన్న వ్యక్తితోనే పెళ్లి జరుగుతుందని తెలిపాడు ఆస్ట్రాలజర్. రష్మి జీవితంలోకి పెళ్లి గాలి సోకిందని, ఆ గాలి బలంగా వీస్తుందని తెలిపారు.
మరి ఆ గాలి సుడిగాలినా అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి రష్మి కూడా స్పందించింది. ఆస్ట్రాలజర్ చెప్పినదాంట్లో చాలా వరకు నిజం ఉందని తెలిపింది.
రష్మి కూడా నిజమే అని చెప్పిందంటే వచ్చే ఏడాది ఆగస్ట్ లో పెళ్లి చేసుకోబోతుందని చెప్పొచ్చు. ఆమె చేసుకోబోయేది సుధీర్ నా? లేక మరో వ్యక్తిని ప్రేమిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఒక ఆస్ట్రాలజర్ పాల్గొన్నాడు. అందులో యాంకర్ రష్మి గౌతమ్ జాతకం చెప్పాడు. ఆయన చెప్పింది నిజమైతే వచ్చే ఏడాది రష్మి పెళ్లి ఫిక్స్ అన్నమాట.