- Home
- Entertainment
- Bigg Boss 9 లో ముద్దుల గోల , డార్క్ రూమ్ లో వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Bigg Boss 9 లో ముద్దుల గోల , డార్క్ రూమ్ లో వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Bigg Boss 9 రాను రాను కొన్ని భాషల్లో బిగ్ బాస్ పరిస్థితి దారుణంగా తయారవుతోంది. కంటెస్టెంట్స్ చేసే పిచ్చిపనుల వల్ల బిగ్ బాస్ టీమ్ కు చెడ్డపేరు వస్తోంది. తాజాగా బిగ్ బాస్ 9 హౌస్ లో ఇద్దరు కంటెస్టెంట్లు ముద్దుల వివాదంలోచిక్కుకున్నారు ఇంతకీ ఎవరు వాళ్లు.

బిగ్ బాస్ షోలో రిలేషన్స్ కామన్..
బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ల మధ్య స్నేహాలు, ప్రేమలు కామన్. ప్రతీ సీజన్ లో కొత్త జంటల మధ్య ప్రేమాయణాలు కొత్తవి కావు. తెలుగు బిగ్ బాస్ లో మొదటి సీజన్ నుంచే అమ్మాయి, అబ్బాయి స్నేహంగా మెలగడం, లవ్ స్టోరీస్ ను బిగ్ బాస్ తనకు అనుకూలంగా మార్చుకుని రేటింగ్ ను పెంచుకోవడం చూస్తూనే ఉన్నాం. కానీ వీరు బయటు వెళ్లిన తరవాత ఎవరి దారి వారిది అన్నట్టే ఉంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉండగా.. హద్దులు మీరితే మాత్రం హెచ్చరికలు తప్పవు. మన తెలుగు బిగ్ బాస్ లో ప్రేమాయణాలు కామన్... కానీ ఇంత వరకూ ఎవరు హద్దులు మీరలేదు. కానీ ఇతర భాషల్లో మాత్రం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య విషయం హద్దులు మీరుతూ.. విమర్శలకు కారణం అవుతోంది.
డార్క్ రూమ్ లో ఏం చేశారు?
వివరాల్లోకి వెళితే, బిగ్ బాస్ షోలో భాగంగా పార్వతి , కమ్రుద్దీన్ ఇద్దరూ ఒక డార్క్ రూమ్ లోకి వెళ్లారు. అక్కడ వారు సుమారు గంటపాటు ఏకాంతంగా గడిపినట్లు సమాచారం. ఈ సమయంలో వారు ముద్దులు పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కెమెరాల్లో ఈ దృశ్యాలు స్పష్టంగా నమోదు కాకపోయినా, వారి మైకుల్లో ముద్దుల శబ్దాలు స్పష్టంగా వినిపించాయని పలువురు ప్రేక్షకులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
హద్దుమీరుతున్న కంటెస్టెంట్లు..
హిందీ బిగ్ బాస్ లో మాత్రం ముద్దులు, హగ్గులు ఎక్కువగా చూపించడంపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. తాజాగా అదే తరహా విమర్శలు తమిళ బిగ్ బాస్ పై కూడా వినిపిస్తున్నాయి.ఈ విషయంలో మరోసారి వివాదంలో చిక్కుకుంది తమిళ బిగ్ బాస్. తాజా సీజన్ లో కంటెస్టెంట్లు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ 9 తమిళ్ హౌస్ మేట్స్ అయిన పార్వతి - కమ్రుద్దీన్ డార్క్ రూమ్ లో ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఆ ఇద్దరిపై పలు ఆరోపణలు
సీజన్ ప్రారంభం నుంచే పార్వతి , కమ్రుద్దీన్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే హౌస్ మెంట్స్ ను మాత్రం వీరి విషయంలో దూరం మెయింటేన్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా నియమాలను ఉల్లంఘించిన కారణంగా ఈ జంటపై చర్యలు తీసుకున్నట్టు ప్రేక్షకులు గుర్తు చేస్తున్నారు. పలుమార్లు నియమాలు అతిక్రమించడంతో ఇంట్లోని ప్రతి ఒక్కరి నుంచి పాలు, గుడ్లు తదితర వస్తువులను బిగ్ బాస్ తీసేసిన ఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా వల్గర్ భాష వాడటం.. తోటి కంటెస్టెంట్స్ ను ఎగతాళి చేయడం వంటి కారణాలతో కూడా పార్వతి, కమ్రుద్దీన్ పై విమర్శలు పెరుగుతున్నాయి.
బిగ్ బాస్ పై విమర్శలు..
ఫ్యామిలీతో కలిసి చూసే ఈ కార్యక్రమంలో ఇలాంటి ప్రవర్తన సరికాదని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షో నిర్వాహకులు ఇలాంటి సన్నివేశాలకు అవకాశం ఇవ్వడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఆ ఇద్దరు జంట గంట తర్వాత బిగ్ బాస్ ఆదేశాల మేరకు డార్క్ రూమ్ నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో వారిద్దరినీ షో నుంచి ఎలిమినేట్ చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ఈ వారం పార్వతి నామినేషన్ లో లేకపోయినా, ఆమెకు రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. మొత్తం మీద తమిళ బిగ్ బాస్ తాజా సీజన్ లో చోటు చేసుకున్న ఈ డార్క్ రూమ్ ఘటన షోపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
