MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sobhita Dhulipala: తెలుగమ్మాయి, పైగా అక్కినేని కోడలు.. శోభితకి టాలీవుడ్‌లో నో ఆఫర్స్, ఏం జరుగుతోంది ?

Sobhita Dhulipala: తెలుగమ్మాయి, పైగా అక్కినేని కోడలు.. శోభితకి టాలీవుడ్‌లో నో ఆఫర్స్, ఏం జరుగుతోంది ?

Sobhita Dhulipala: నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా శోభితకు తెలుగులో అంతగా ఆఫర్స్ రావడం లేదు. ప్రస్తుతం ఆమె హిందీ, తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 08 2026, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sobhita Dhulipala
Image Credit : Asianet News

Sobhita Dhulipala

శోభిత ధూళిపాళ తెలుగులో చాలా తక్కువ చిత్రాల్లో నటించింది. యువ కథానాయకుడు నాగ చైతన్యను వివాహం చేసుకుని దాదాపు రెండేళ్లు కావస్తున్నా, ఇప్పటివరకు ఆమె నుంచి కొత్త తెలుగు సినిమా ప్రకటన రాలేదు. శోభిత ధూళిపాళ తెలుగు అమ్మాయే. ఆమె ఫ్యామిలీ వైజాగ్ కి చెందిన వారు. తెలుగు అమ్మాయి, పైగా అక్కినేని కోడలు అయినప్పటికీ శోభిత తెలుగు సినిమాలకు దూరంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఏడాది బిగినింగ్ లో ఆమె నుంచి చీకటిలో అనే చిత్రం వచ్చింది. అది కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన మూవీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాలీవుడ్ లో నో ఆఫర్స్
Image Credit : ANI

టాలీవుడ్ లో నో ఆఫర్స్

పెళ్లి తర్వాత శోభిత తన కెరీర్‌ను ఇతర భాషలు, ఇతర రంగాల్లో కొనసాగిస్తున్నారు. ఫ్యాషన్‌కు సంబంధించిన కార్యక్రమాలు, హిందీ వెబ్ ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉంటున్నారు. అదే సమయంలో ఇతర సినీ పరిశ్రమల్లో కూడా తన పరిధిని విస్తరిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న భవిష్యత్ నేపథ్య సైన్స్ ఫిక్షన్ చిత్రం వెట్టువంలో ఆమె భాగమయ్యారు. దీంతో తమిళం, హిందీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నప్పటికీ, తెలుగు సినిమాకు మాత్రం ఇప్పటివరకు ఆమె సైన్ చేయలేదు. గతంలో ఆమె తెలుగులో నటించిన గూఢచారి, మేజర్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.

Related Articles

Related image1
Tollywood: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు, చెత్త గెటప్పులతో నవ్వులపాలైన హీరోలు.. నాగ్, చిరు లకు కూడా తప్పలేదు
Related image2
Varun Tej: ఎన్టీఆర్ మాత్రమే కాదు.. కృష్ణ, చిరంజీవిపై కూడా.. నందమూరి అభిమానుల ట్రోలింగ్ కి వరుణ్ తేజ్ రిప్లై
35
నాగ చైతన్యతో మూవీ ?
Image Credit : Instagram/ Sobhita Dhulipala

నాగ చైతన్యతో మూవీ ?

ఈ నేపథ్యంలో శోభిత తెలుగు సినిమాలను ఎందుకు ఎంచుకోవడం లేదనే ప్రశ్న తెరపైకి వస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శోభిత ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సరైన అవకాశం వస్తే తన భర్త నాగచైతన్యతో కలిసి తెరపై నటించడానికి ఎంతో సంతోషిస్తానని ఆమె తెలిపారు. అయితే ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదనతో ఏ దర్శకుడు లేదా నిర్మాత తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. దీంతో భార్యాభర్తలు కలిసి నటించే సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రాజెక్ట్ ఖరారు కాలేదని తెలుస్తోంది.

45
పాత్రని బట్టే సినిమాల ఎంపిక
Image Credit : instagram

పాత్రని బట్టే సినిమాల ఎంపిక

శోభితకు తెలుగు మూలాలు ఉండటం, నాగచైతన్యను వివాహం చేసుకుని ప్రముఖ అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టడం వంటి అంశాలు ఆమెను తెలుగు సినిమాకు దగ్గరగా ఉంచుతున్నప్పటికీ, ప్రస్తుతం ఆమె సినిమాల ఎంపిక మాత్రం మరో విధంగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. తనకు వచ్చే పాత్రలు, కథలు నచ్చితేనే ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. అంటే ప్రత్యేకంగా తెలుగు సినిమాలు చేయాలనే ఉద్దేశంతో కాకుండా, పాత్రకు, కథకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

55
ఇతర భాషల్లో బిజీ
Image Credit : instagram

ఇతర భాషల్లో బిజీ

ప్రస్తుతం శోభిత చేతిలో తమిళ, హిందీ ప్రాజెక్టులు ఉండగా, తెలుగు సినిమాలో ఆమె తదుపరి ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నాగచైతన్యతో కలిసి నటించే అవకాశం గురించి ఆమె సానుకూలంగా స్పందించడంతో, భవిష్యత్తులో ఈ కాంబినేషన్ తెరపై కనిపిస్తుందా అనే ఆసక్తి కూడా అభిమానుల్లో నెలకొంది. అయితే ప్రస్తుతానికి శోభిత తెలుగు సినిమా సైన్ చేయకపోవడానికి ప్రత్యేక కారణాన్ని ఆమె వెల్లడించలేదు. శోభిత గ్లామర్ పాత్రలతో పాటు రొమాంటిక్ సీన్స్ లో కూడా గతంలో నటించింది. అయితే పెళ్లి తర్వాత గ్లామర్ రోల్స్ కొనసాగిస్తుందో లేదో చూడాలి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: వెంకటేష్ కోసం తండ్రితో గొడవపడిన హీరోయిన్ ఎవరో తెలుసా? వెంకీని చూడగానే ఆమెకు ఏమనిపించిందంటే?
Recommended image2
Salman Khan Watch: సల్మాన్ ఖాన్ కొత్త వాచ్.. స్పెషాల్ ఫీచర్స్ ఏంటో తెలుసా? కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగుతాయ్..
Recommended image3
Main Vaapas Aaunga OTT: ఓటీటీలోకి రొమాంటిక్ డ్రామా.. సూపర్ హిట్ సినిమాను ఎక్కడ చూడాలంటే?
Related Stories
Recommended image1
Tollywood: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు, చెత్త గెటప్పులతో నవ్వులపాలైన హీరోలు.. నాగ్, చిరు లకు కూడా తప్పలేదు
Recommended image2
Varun Tej: ఎన్టీఆర్ మాత్రమే కాదు.. కృష్ణ, చిరంజీవిపై కూడా.. నందమూరి అభిమానుల ట్రోలింగ్ కి వరుణ్ తేజ్ రిప్లై
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved