MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Venkatesh: వెంకటేష్ కోసం తండ్రితో గొడవపడిన హీరోయిన్ ఎవరో తెలుసా? వెంకీని చూడగానే ఆమెకు ఏమనిపించిందంటే?

Venkatesh: వెంకటేష్ కోసం తండ్రితో గొడవపడిన హీరోయిన్ ఎవరో తెలుసా? వెంకీని చూడగానే ఆమెకు ఏమనిపించిందంటే?

Venkatesh: సౌత్ స్టార్ హీరో వెంకటేష్ తో సినిమా అంటే చాలామంది హీరోయిన్లు ఎగిరి గంతేస్తుంటారు. ఆయనతో పనిచేయడం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఒక హీరోయిన్ అయితే వెంకీతో సినిమా కోసం ఏకంగా తండ్రినే ఎదిరించి గొడవ పెట్టుకుందట. ఇంతకీ ఎవరా నటి.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 08 2026, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాలీవుడ్ ను నిలబెట్టిన హీరోలలో ఒకరు..
Image Credit : Asianet News

టాలీవుడ్ ను నిలబెట్టిన హీరోలలో ఒకరు..

టాలీవుడ్ కు నాలుగు స్థంభాల్లా నిలిచిన నలుగురు హీరోలలో విక్టరీ స్టార్ వెంకటేష్ ఒకరు. ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ ను తీసుకుని.. హిట్ల మీద హిట్లు కొట్టిన వెంకీ.. మహిళా అభిమానులను ఎక్కువగా సంపాదించుకున్నాడు. ఆయన సినిమా అంటే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి థియేటర్లలో కూర్చునేవారు. అంతలా వెంకటేష్ టాలీవుడ్ పై ప్రభావం చూపించారు. ఇక వెంకీతో సినిమా అంటే హీరోయిన్లు కూడా పోటీపడేవారు. ఒక హీరోయిన్ అయితే కన్నతండ్రి వద్దన్నా వినకుండా వెంకటేష్ తో సినిమా చేసి.. సూపర్ హిట్ కొట్టింది. ఆమె మరెవరో కాదు ఖుష్బూ సుందర్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇండస్ట్రీని ఊపు ఊపేసిన హీరోయిన్
Image Credit : Google

ఇండస్ట్రీని ఊపు ఊపేసిన హీరోయిన్

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని దశాబ్దాల పాటు ఏలిన హీరోయిన్లలో ఖుష్బూ కూడా ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో బాగా పాపులర్ అయిన ఈ నటి.. హీరోయిన్ గా ఇండస్ట్రీని ఊపు ఊపేసింది. తెలుగులో వెంకటేష్ హీరోగా పరిచయం అయిన కలియుగ పాండవులు సినిమాతో..తెలుగు తెరకు ఖుష్బుూ పరిచయం అయ్యింది. అంతకు ముందు తమిళ సినిమాలు మాత్రమే చేసుకుంటూ ఉన్న ఈ బ్యూటీ.. తెలుగులో ఈ సాహసం చేయడానికి పలు కారణాలు కూడా ఉన్నాయి. తండ్రి తెలుగు సినిమా వద్దన్నా వినకుండా.. నమ్మకంతో ముందడుగు వేసింది ఖుష్బూ.. ఈ విషయంలో తండ్రితో గొడవపడిందట కూడా. ఈ విషయాలను 'అలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె షేర్ చేసుకున్నారు. ఖుష్బూ.. మాట్లాడుతూ, విక్టరీ వెంకటేష్ పరిచయం మరియు తమ మొదటి చిత్రం 'కలియుగ పాండవులు' ప్రారంభ దినాల అనుభవాలను ఆత్మీయంగా గుర్తుచేసుకున్నారు.

Related Articles

Related image1
వెంకటేష్‌నే పెళ్లి చేసుకుంటా అని మొండికేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఫస్ట్ క్రష్ బయటపెట్టిన సీనియర్ నటి
Related image2
Korean Kanakaraju Day 1 Collections: సాలిడ్ ఓపెనింగ్స్ సాధించిన వరుణ్ తేజ్ సినిమా, కొరియన్ కనకరాజు ఫస్ట్ డే వసూళ్లు ఎంత?
34
తండ్రితో గోడవపడి మరీ తెలుగు సినిమాల్లోకి..
Image Credit : Asianet News

తండ్రితో గోడవపడి మరీ తెలుగు సినిమాల్లోకి..

తెలుగు సినిమా ఆఫర్ రాగానే ఖుష్బూ తండ్రీ వద్దన్నారట. బాలీవుడ్ కు వెళ్దాం అని సలహా ఇచ్చారట. కానీ హిందీలో 'హిమ్మత్‌వాలా', 'తూఫానీ' వంటి బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో, దిగ్గజ నిర్మాత డి. రామానాయుడు నిర్మిస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ చిత్రంలో నటించే అవకాశం రావడం ఖుష్బూకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. తండ్రి మాటను కూడా కాదని..గొడవపెట్టుకుని మరీ.. తెలుగు సినిమాకు సైన్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. "రామానాయుడు గారు నిర్మాత, రాఘవేంద్రరావు గారు దర్శకుడు అనగానే ఇది ఖచ్చితంగా ఒక భారీ బడ్జెట్ సినిమా అని అర్థమైంది. అందుకే ఆలోచించకుండా వెంటనే ఒప్పుకున్నాను." అని ఖుష్బుూ అన్నారు.

44
మొదటి సారి వెంకటేష్ ను చూసిన క్షణం
Image Credit : Asianet News

మొదటి సారి వెంకటేష్ ను చూసిన క్షణం

ఈ చిత్రంలో హీరో ఎవరనే విషయం తెలిసినప్పటి క్షణాన్ని ఖుష్బూ తలుచుకున్నారు. నిర్మాత రామానాయుడు గారి కుమారుడు వెంకటేష్ ఈ సినిమా ద్వారా హీరోగాగా పరిచయం అవుతున్నారని వినగానే ఆమె ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. "రామానాయుడు గారి అబ్బాయి వెంకటేష్ గారు హీరో అని చెప్పగానే.. 'ఓ వావ్!' అనుకున్నాను. అంత పెద్ద బ్యానర్ వారసుడి సినిమా అంటే ఖచ్చితంగా గ్రాండ్ లాంచ్ అవుతుందని భావించాను. వెంకటేష్‌ను మొదటిసారి చూసిన క్షణం నా మనస్సులో ఇప్పటికీ చెరిగిపోలేదు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పాత ఇంట్లో.. వైట్ అండ్ వైట్ డ్రెస్సులో వచ్చి.. అమెరికనైజ్డ్ యాక్సెంట్‌తో 'హాయ్, ఐ యామ్ వెంకీ!' అని ఆయన పరిచయం చేసుకున్న విధానం ఇప్పటికీ నా కళ్లముందే ఉంది." అని ఖుష్బుూ అన్నారు.

సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది?

1985 డిసెంబర్ చివరి వారంలో వెంకటేష్, ఖుష్బూల తొలి కాంబినేషన్ ఫోటో షూట్ జరిగింది. అనంతరం 1986 జనవరి 1న నూతన సంవత్సరం కానుకగా చెన్నైలో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ఈ విషయంపై కూడా ఖుష్బుూ క్లారిటీ ఇచ్చింది. "1985 డిసెంబర్ చివర్లో ఫోటో షూట్, 1986 జనవరి 1న చెన్నైలో మూవీ లాంచ్.. సౌత్ ఇండియాలో 'కలియుగ పాండవులు' చిత్రంతో నా ప్రయాణాన్ని ప్రారంభించడం నా జీవితంలో తీసుకున్న బెస్ట్ డిసిషన్." అప్పుడు అలా తీసుకోబట్టే.. ఆతరువాత టాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుని స్టార్ గా మారాను అని ఖుష్బూ సుందర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
దగ్గుబాటి వెంకటేష్
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Recommended image3
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Related Stories
Recommended image1
వెంకటేష్‌నే పెళ్లి చేసుకుంటా అని మొండికేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఫస్ట్ క్రష్ బయటపెట్టిన సీనియర్ నటి
Recommended image2
Korean Kanakaraju Day 1 Collections: సాలిడ్ ఓపెనింగ్స్ సాధించిన వరుణ్ తేజ్ సినిమా, కొరియన్ కనకరాజు ఫస్ట్ డే వసూళ్లు ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved