MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌ల సీక్రెట్ మ్యారేజ్.. సొంత చెల్లెళ్లనే రానివ్వలేదా?

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌ల సీక్రెట్ మ్యారేజ్.. సొంత చెల్లెళ్లనే రానివ్వలేదా?

Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ సీక్రెట్ మ్యారేజ్‌కు సంబంధించిన షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. సైఫ్ అలీఖాన్ పెళ్లికి సోహా, సబా ఎందుకు రాలేదో తెలిసింది. వారి సీక్రెట్ మ్యారేజ్ సీక్రెట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 07 2026, 05:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
12 ఏళ్ల పెద్దదానితో సైఫ్ అలీ ఖాన్ సీక్రెట్ పెళ్లి.. ఆ రోజు స్కూల్లో అసలేం జరిగింది?
Image Credit : Instagram

12 ఏళ్ల పెద్దదానితో సైఫ్ అలీ ఖాన్ సీక్రెట్ పెళ్లి.. ఆ రోజు స్కూల్లో అసలేం జరిగింది?

బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ సైఫ్ అలీ ఖాన్ మొదటి పెళ్లి నటి అమృతా సింగ్‌తో జరిగింది. 1991లో వీళ్లిద్దరూ సీక్రెట్‌గా, చాలా హడావుడిగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లికి సైఫ్ సొంత చెల్లెళ్లు సోహా అలీ ఖాన్, సబా అలీ ఖాన్ హాజరు కాలేదు. రీసెంట్‌గా నేహా ధూపియా, అంగద్ బేడీల 'డబుల్ డేట్' షోలో పాల్గొన్న ఖాన్ సిస్టర్స్.. ఆ రోజు అసలేం జరిగిందో పూర్తి వివరాలు బయటపెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్కూల్లో ఉన్నప్పుడు ప్రిన్సిపల్ ఆఫీస్ నుంచి కాల్
Image Credit : instagram

స్కూల్లో ఉన్నప్పుడు ప్రిన్సిపల్ ఆఫీస్ నుంచి కాల్

సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ పెళ్లి చేసుకునే సమయానికి సోహా, సబా ఇంకా స్కూల్లోనే చదువుకుంటున్నారు. అప్పట్లో సబా వయసు 15 ఏళ్లు కాగా, సోహా వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే. సైఫ్ పెళ్లి వార్త పేపర్లలో రాగానే స్కూల్ యాజమాన్యం స్పందించింది. సబా మాటల్లో చెప్పాలంటే.. "మమ్మల్ని సడన్‌గా ప్రిన్సిపల్ ఆఫీస్‌కి పిలిచారు. మా పేరెంట్స్ నుంచి ఫోన్ వచ్చింది. అన్నయ్య పెళ్లి గురించి చెబుతూ, ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎంతవరకు నిజముందో కూడా మాకు అప్పట్లో తెలీదు." అన్నారు. ఇక సోహా మాట్లాడుతూ, తన ఫ్రెంచ్ టీచర్ వచ్చి ఈ పెళ్లి విషయం చెప్పిందని, అంతా చాలా సడన్‌గా జరిగిపోయిందని గుర్తు చేసుకుంది.

Related Articles

Related image1
Telangana Ooty: హైదరాబాద్‌కు అతిదగ్గరలో ‘తెలంగాణ ఊటీ’.. వీకెండ్ ట్రిప్ కోసం సూపర్ ప్లాన్
Related image2
Success Story: 5 రూపాయల కూలీ నుంచి రూ. 1500 కోట్ల కంపెనీకి యజమాని.. సంచలన సక్సెస్ స్టోరీ
35
రూ.100 అప్పుతో మొదలైన లవ్ స్టోరీ
Image Credit : Instagram/rafikkhan9586

రూ.100 అప్పుతో మొదలైన లవ్ స్టోరీ

1990లో డైరెక్టర్ రాహుల్ రావైల్ 'బేఖుదీ' సినిమాతో సైఫ్‌ను లాంచ్ చేయాలనుకున్నారు. ప్రమోషనల్ ఫోటోషూట్ కోసం అప్పటి స్టార్ హీరోయిన్ అమృతా సింగ్‌ను పిలిచారు. షూటింగ్ సమయంలో సైఫ్ ఆమె భుజంపై చేయి వేయడంతో అమృత కోపంగా చూసింది. ఆ తర్వాత సైఫ్ ఆమెకు ఫోన్ చేసి డిన్నర్‌కి వస్తావా అని అడిగితే అమృత నో చెప్పింది. కానీ ఇంటికే వచ్చి డిన్నర్ చేయమని ఆఫర్ ఇచ్చింది. అలా ఆమె ఇంటికి వెళ్లిన సైఫ్ రెండు రోజులు అక్కడే ఉండిపోయాడు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది. అమృత సీరియస్ కావడంతో సైఫ్ తన లవ్‌ను ప్రపోజ్ చేశాడు. రెండ్రోజుల తర్వాత షూటింగ్‌కి వెళ్లడానికి సైఫ్ దగ్గర డబ్బులు లేకపోతే అమృత దగ్గర రూ.100 అప్పు తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత వరుసగా లేట్‌గా రావడంతో సైఫ్‌ను ఆ సినిమా నుంచి తీసేశారు.

45
మతం మార్చుకుని పెళ్లి.. ఆపై డివోర్స్
Image Credit : others

మతం మార్చుకుని పెళ్లి.. ఆపై డివోర్స్

తనకంటే 12 ఏళ్లు పెద్దదైన అమృతా సింగ్‌ను 1991లో సైఫ్ పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి సైఫ్ వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. నవాబ్ కుటుంబంలోకి అడుగుపెట్టేందుకు అమృత తన మతాన్ని మార్చుకుని 'అజీజా'గా మారింది. పెళ్లి కోసం ఒక మౌల్వీ, ఒక సిక్కు పూజారి వచ్చి స్నేహితుడి ఇంట్లో వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత అమృత కెరీర్‌కి గుడ్‌బై చెప్పేసింది. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే ఈ పెళ్లి సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్‌కి అస్సలు ఇష్టం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అనుమానించినట్లే కొన్ని ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సైఫ్ నటి కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు.

55
ఇంకా సింగిల్‌గానే సబా అలీ ఖాన్
Image Credit : Instagram@sabapataudi

ఇంకా సింగిల్‌గానే సబా అలీ ఖాన్

ఇదే షోలో సబా అలీ ఖాన్ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు 18-19 ఏళ్ల వయసు నుంచే సంబంధాలు వచ్చాయని, కలకత్తాకి చెందిన ఒక వ్యక్తితో పెళ్లి దాదాపు ఫిక్స్ అయిందని చెప్పింది. కానీ అప్పట్లో పెళ్లికి సిద్ధంగా లేకపోవడంతో ఆ సంబంధం క్యాన్సిల్ అయింది. తన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ లాంటి గొప్ప వ్యక్తి భర్తగా రావాలని కోరుకున్నానని, కానీ అలాంటి వ్యక్తి తనకు దొరకకపోవడంతోనే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయానని సబా తెలిపింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image3
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Related Stories
Recommended image1
Telangana Ooty: హైదరాబాద్‌కు అతిదగ్గరలో ‘తెలంగాణ ఊటీ’.. వీకెండ్ ట్రిప్ కోసం సూపర్ ప్లాన్
Recommended image2
Success Story: 5 రూపాయల కూలీ నుంచి రూ. 1500 కోట్ల కంపెనీకి యజమాని.. సంచలన సక్సెస్ స్టోరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved