MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • KJQ Movie Review: `కేజేక్యూ` మూవీ రివ్యూ.. కేకే డైరెక్ట్ చేసిన చివరి మూవీ ఎలా ఉందంటే?

KJQ Movie Review: `కేజేక్యూ` మూవీ రివ్యూ.. కేకే డైరెక్ట్ చేసిన చివరి మూవీ ఎలా ఉందంటే?

కేకే దర్శకత్వంలో దీక్షిత్‌ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా హీరోహీరోయిన్లుగా `కేజేక్యూ` చిత్రం రూపొందింది. ఇది నేడు శుక్రవారం విడుదలైంది. మరి మూవీ ఎలా ఉందంటే?

3 Min read
Author : Aithagoni Raju
Published : Aug 07 2026, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కేజేక్యూ మూవీ రివ్యూ
Image Credit : X/@SLVCinemasOffl

కేజేక్యూ మూవీ రివ్యూ

`దసరా`, `గర్ల్ ఫ్రెండ్‌` వంటి చిత్రాలతో ఆకట్టుకున్న దీక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన చిత్రం `కేజేక్యూ`(కింగ్‌ జాకీ క్వీన్‌). శశి ఓదెల మరో హీరోగా, యుక్తి తరేజ హీరోయిన్‌గా నటించింది. కేకే(కిరణ్‌ కుమార్‌) దర్శకుడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. దర్శకుడు కేకే ఈ మూవీ చిత్రీకరణ సమయంలోనే కన్నుమూశాడు. దీంతో చిత్ర బృందం సినిమాని కంప్లీట్‌ చేసి రిలీజ్‌ చేశారు. తాజాగా నేడు శుక్రవారం(ఆగస్ట్ 7)న ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కేజేక్యూ మూవీ కథ
Image Credit : X/@SLVCinemasOffl

కేజేక్యూ మూవీ కథ

పార్థ(దీక్షిత్‌ శెట్టి) అనాథ. క్రమంగా నేరాలు చేస్తూ మాఫియాకి కింగ్‌గా ఎదుగుతాడు. సిటీలోని మరో డాన్‌ కూతురునే పెళ్లి చేసుకుంటాడు. అయితే స్థానికంగా ఉన్న ఓ పోలీస్‌ తనని ఇబ్బంది పెడుతుంటాడు. అదే సమయంలో జాకీ(శశి ఓదెల) అమ్మపై ఆ పోలీస్‌ అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేస్తాడు. దీంతో అతన్ని కాల్చి చంపేస్తాడు జాకీ. ఈ ఫైరింగ్‌లోనే అమ్మ కూడా చనిపోతుంది. తనని ఇబ్బంది పెట్టిన పోలీస్‌ని చంపడంతో జాకీని చేరదీస్తాడు పార్థ. పార్థ తనకు లైఫ్‌ ఇవ్వడంతో అతని కోసం అనేక నేరాలు చేస్తాడు జాకీ. ఈ క్రమంలో ఇద్దరు బాగా క్లోజ్‌ అవుతాడు. స్నేహానికి మించిన బాండింగ్‌ వీరి మధ్య ఏర్పడుతుంది. వీరికి చిచ్చా(మురళీధర్‌ గౌడ్‌) సపోర్ట్ గా ఉంటాడు. ఎదిగేందుకు సపోర్ట్ చేస్తాడు. కింగ్‌గా ఎదిగిన నేపథ్యంలో పార్థలో ఆహాం పెరిగిపోతుంది. అదే సమయంలో భార్గవి(యుక్తి తరేజా) స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతుంది. ఆమె అనేక స్ట్రగుల్స్ ఫేస్‌ చేసి తెగించి హీరోయిన్‌ అవుతుంది. అయితే ఆ హీరోయిన్‌పై పార్థ మోజు పడతాడు. ఆమె కోసం పిచ్చోడైపోతాడు. భార్యని కూడా వదిలేస్తాడు. దీంతో లైఫ్‌ మొత్తం తలక్రిందులవుతుంది. హీరోయిన్‌ ఛీ కొట్టి పోతుంది. ఇంతలోనే ఆమె జాకీతో క్లోజ్‌గా ఉన్నట్టు ఫోటో లీక్‌ అవుతుంది. ఆమెని చంపమని పార్థ భార్య జాకీకి సుఫారీ ఇస్తుంది. మరి హీరోయిన్‌ని జాకీ చంపేశాడా? భార్గవి కోసం పార్థ ఏం చేశాడు? మొగుడి కోసం పార్థ భార్య ఏం చేసింది? జాకీలో వచ్చిన మార్పేంటి? పార్థ, జాకీల మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

36
కేజేక్యూ మూవీ విశ్లేషణ
Image Credit : X/@SLVCinemasOffl

కేజేక్యూ మూవీ విశ్లేషణ

ఒక అనాథ ఒక కింగ్‌గా ఎదిగిన జర్నీని ఆవిష్కరించే మూవీ ఇది. లవ్‌, రొమాన్స్, ఎమోషన్స్, స్నేహం విలువలను తెలియజేస్తూ సాగింది. అదే సమయంలో హీరోయిన్‌ జీవితం వెనక చీకటి కోణాలను ఆవిష్కరించేలా ఈ మూవీ సాగడం విశేషం. యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు కేకే. అయితే కథగా రొటీన్‌ మూవీనే. స్క్రీన్‌ ప్లేతో మ్యాజిక్‌ చేసే ప్రయత్నం చేశాడు కేకే. ప్రారంభంలో సీన్లు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. అవి ఎంగేజింగ్‌గా సాగుతాయి. అయితే ఓ దశ తర్వాత సినిమా బోరింగ్‌గా, స్లోగా సాగుతుంది. యాక్షన్‌ సీన్లు ఫర్వాలేదు. కానీ అవి ఇరికించినట్టుగానే ఉంటాయి. సినిమా ఓ వైపు వెళ్తూ, హీరోయిన్‌ ఎంట్రీతో రాంగ్‌ ట్రాక్ ఎక్కుతుంది. దీనికితోడు హీరోయిన్ కి సంబంధించిన సీన్లు రిపీటెడ్‌గా చూపించారు. కంటెంట్‌ లేకపోవడంతో అలా రిపీట్‌ చేసినట్టు అనిపిస్తుంది. అదే సమయంలో చాలా సీన్లు కట్‌ కట్‌ గా ఉంటాయి. దీనికితోడు సెకండాఫ్‌ అంతా స్లోగా మారిపోయింది. కొన్ని షాకింగ్‌ ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటాయి. కానీ అవి వస్తూ పోతుంటాయి. హీరోయిన్‌, జాకీ పాత్రల మధ్య సీన్లు కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్ సీన్‌లో డ్రామా, యాక్షన్‌, ఎమోషన్స్ కూడా తేలిపోయాయి. స్నేహానికి సంబంధించిన సీన్లు మాత్రం కొంత ఎమోషనల్‌గా ఉంటాయి. అదే సమయంలో యుక్తి తరేజా.. నటిగా మారడం వెనుక తన స్ట్రగుల్స్ ని చూపించిన తీరు హార్ట్ ని కదిలిస్తుంది. అయితే ఆమెకి సంబంధించిన సీన్లు కూడా ఆశించిన స్థాయిలో పండలేదు. కేవలం సీన్లుగానే మిగిలాయి. క్లైమాక్స్ ముగింపు కూడా అంతగా వర్కౌట్‌ కాలేదు. తప్పు చేసిన వాళ్లు ఎప్పటికైనా శిక్షకు అర్హులే అని, హత్యలు చేసేవాళ్లు ఏదో ఒక రోజు అలాంటి పరిస్థితుల్లోనే మరణించాల్సి వస్తుందని చెప్పిన సందేశం బాగుంది.

46
కేజేక్యూ మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
Image Credit : X/@SLVCinemasOffl

కేజేక్యూ మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

పార్థగా దీక్షిత్‌ శెట్టి నటన బాగుంది. స్ట్రగులింగ్‌ సీన్లు, ఆహానికి సంబంధించిన సీన్లలో అదరగొట్టాడు. తనదైన విలక్షణ నటనతో మెప్పించాడు. పాజిటివ్‌, నెగటివ్‌ యాంగిల్స్ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. ఇక జాకీ పాత్రలో శశి ఓదెల సైతం బాగా నటించాడు. సెటిల్డ్ గా చేసి మెప్పించాడు. ఎమోషనల్‌గానూ మెప్పించాడు. హీరోయిన్‌గా యుక్తి తరేజా దుమ్ములేపింది. స్ట్రగులింగ్‌ లేడీగా, హీరోయిన్‌గా, యాటిట్యూడ్‌ చూపించిన అమ్మాయిగా, తెగించిన అమ్మాయిగా మెప్పించింది. గ్లామర్‌తోనూ కనువిందు చేసింది. చిచ్చాగా మురళీధర్‌ గౌడ్‌ సైతం ఆకట్టుకున్నాడు. సురేఖ వాణి చాలా రోజుల తర్వాత ఇందులో మెరిసింది. ఆమె పాత్రలోనూ విభిన్నమైన షేడ్స్ ఉన్నాయి. మిగిలిన వారు ఓకే అనిపించారు.

56
కేజేక్యూలో టెక్నీషియన్ల పనితీరు
Image Credit : X/@SLVCinemasOffl

కేజేక్యూలో టెక్నీషియన్ల పనితీరు

టెక్నీకల్‌గా ఈ మూవీ పూర్ణచంద్ర తేజస్వి అందించిన మ్యూజిక్‌ ఫర్వాలేదు. కానీ అన్ని చోట్ల అది వర్కౌట్‌ కాలేదు. కెమెరామెన్‌ నగేష్‌ బనెల్‌ విజువల్స్ బాగున్నాయి. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. శ్రావణ్‌ కటికనేని ఎడిటింగ్‌ ఫర్వాలేదు. కాకపోతే సీన్లు రిపీట్‌ చేశారు. నిర్మాణ విలువలకు కొడవ లేదు. దర్శకుడు కిరణ్‌ కుమార్‌ మంచి కథని ఎంచుకున్నారు. స్క్రీన్‌ ప్లే కూడా బాగుంది. కానీ దాన్ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేయలేకపోయారు. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ లో ఆ తేడా కనిపిస్తుంది. ఆయన లేని లోటు సినిమాలో కనిపిస్తుంది. ఆయన ఉంటే సినిమా బెటర్‌గా ఉండేది. కానీ ఇప్పుడు డిజప్పాయింట్‌ చేసిందని చెప్పొచ్చు.

66
ఫైనల్‌గా
Image Credit : X/@SLVCinemasOffl

ఫైనల్‌గా

ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో డీలా పడ్డ కేజేక్యూ.. కేకే లేని లోటు కనిపిస్తుంది. 

రేటింగ్‌: 2

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hanuman Ansh Telugu Review: హనుమాన్‌ అంశ్‌ మూవీ రివ్యూ.. నీమ్‌ కరోలి బాబా జీవితం వెండితెరపై ఎలా ఉందంటే?
Recommended image2
Chakkora Movie Review: చకోర మూవీ రివ్యూ.. సరికొత్త ప్రేమ కథలోని సందేశం ఎలా ఉందంటే?
Recommended image3
Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ రివ్యూ.. నక్సల్‌ నేపథ్యంలో శ్రీవిష్ణు చేసిన కామెడీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
DC Movie Review: డీసీ మూవీ రివ్యూ, లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా నటించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Korean Kanakaraju Movie Review: కొరియన్‌ కనకరాజు మూవీ రివ్యూ.. వరుణ్‌ తేజ్‌కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved