MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Uyir OTT: భార్య అక్రమ సంబంధం నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్, క్లైమాక్స్ లో పోలీస్ మానవత్వానికి కన్నీళ్లు ఆగవు

Uyir OTT: భార్య అక్రమ సంబంధం నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్, క్లైమాక్స్ లో పోలీస్ మానవత్వానికి కన్నీళ్లు ఆగవు

ఇటీవల ఓటీటీలోకి వచ్చిన మలయాళం హిట్ మూవీ ఉయిర్ ప్రేక్షకులని మెప్పిస్తోంది. ఈ మూవీలో రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలో నటించారు. ట్విస్ట్ లు మాత్రమే కాదు, కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ సీన్స్ కూడా ఈ మూవీలో ఉన్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 07 2026, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Uyir Movie
Image Credit : Asianet News

Uyir Movie

మలయాళం నుంచి వచ్చే థ్రిల్లర్ సినిమాలకు అన్ని భాషల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే మలయాళం థ్రిల్లర్ చిత్రాలని ఓటీటీలో అన్ని భాషల్లోకి డబ్ చేస్తుంటారు. ఇటీవల విజయం సాధించిన ఉయిర్ అనే చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. పద్మకుమార్ దర్శత్వంలో రోషన్ మాథ్యూ హీరోగా ఈ చిత్రం తెరకెక్కింది. అత్యుల్య చంద్ర, శ్రుతి మీనన్, బైజు సంతోష్, వినోద్ సాగర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రియల్ స్టోరీ
Image Credit : Asianet News

రియల్ స్టోరీ

పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక మహిళ సూసైడ్ నేపథ్యంలో మొదలైన కథ ఆ తర్వాత క్రైమ్ యాంగిల్ కి మారుతుంది. చివరికి ఎమోషనల్ గా ముగుస్తుంది. ఇన్వెస్టిగేషన్ వేగం పుంజుకున్నప్పుడు వచ్చే ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. క్రైమ్ జరిగిన బ్యాక్ డ్రాప్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన రియల్ స్టోరీ.

Related Articles

Related image1
Peddi: పెద్ది మూవీలో తప్పులన్నీ బయటపెట్టిన సీనియర్ రచయిత.. రాంచరణ్ హీరో కాకపోయి ఉంటే ఏం జరిగేది ?
Related image2
ANR: తాగేసి హోటల్ లో గొడవ, స్టార్ హీరోని పిలిచి వార్నింగ్ ఇచ్చిన ఏఎన్నార్..అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా
35
కథ ఏంటంటే
Image Credit : Manorama Music Songs

కథ ఏంటంటే

కేరళలోని ఓ ఊరికి అజీబ్( రోషన్ మాథ్యూ) ప్రొబేషనరీ ఎస్ఐగా వస్తాడు. అతడు డ్యూటీలో చేరిన కొన్ని రోజులకే ఊరి చివరన బావిలో ఒక మహిళ శవం బయట పడుతుంది. అజీబ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించగా ఆమె పేరు శోభ అని.. రోజూ కూలీగా పనిచేస్తూ ఉంటుంది అని తెలుస్తోంది. ఆమెకి ఇద్దరు పిల్లలు.. రాజు అనే భర్త కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె భర్తని ఎలాగోలా వెతికి పట్టుకుని తీసుకువస్తారు. చనిపోయింది తన భార్యే అని గుర్తిస్తాడు. శోభ ఆమె ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే తాను దూరంగా ఉంటున్నానని పిల్లలని మా సోదరి వద్ద ఉంచి పెంచుతున్నాను అని రాజు పోలీసులకు చెబుతాడు. శోభ డెడ్ బాడీ చూసి తీవ్ర భావోద్వేగానికి గురవుతాడు.

45
మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
Image Credit : Asianet News

మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్

కొంత కాలానికి శోభ ప్రియుడు ఆమెని వదిలేసి వెళ్ళిపోయాడు అని.. ఆ బాధతోనే శోభ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అని రాజు చెబుతాడు. రాజు చెప్పింది నిజమని పోలీసులు నమ్ముతారు. అతడికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు కూడా ఉండవు. దీనితో అతడిని వదిలి పెట్టడమే కాకుండా ఆర్థిక సాయం కూడా చేస్తారు. కొన్ని రోజుల తర్వాత శోభ మరణం గురించి వార్తల్లో తెలుసుకున్న ఆమె బంధువులు సడెన్ గా పోలీస్ స్టేషన్ కి వస్తారు. వాళ్ళు ఇచ్చే ట్విస్ట్ తో మైండ్ బ్లాక్ కావడం ఖాయం. దీనితో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. ఆమె బంధువులు అసలేం చెప్పారు. రాజు చెప్పినదంతా నిజమేనా ? ఏదైనా దాచి పెట్టాడా ? అసలు శోభ అక్రమ సంబంధం పెట్టుకున్నది ఎవరితో ? ఆమె పిల్లలు ఏమయ్యారు ? లాంటి విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలి.

55
కన్నీళ్లు పెట్టించిన పోలీస్
Image Credit : Asianet News

కన్నీళ్లు పెట్టించిన పోలీస్

ఈ మూవీలో హీరో రోషన్ మాథ్యూ లీడ్ గా జరిగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. అతడి పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో కేసు ముగిసినప్పటికీ మానవత్వంతో ఇంకా వదలకుండా అతడు చేసిన ప్రయత్నం, పలికించిన ఎమోషన్ కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంటుంది. పోలీసులు డ్యూటీ మాత్రమే కాదు మానవత్వం కూడా చూపించాలి అని చాటి చెప్పిన రియల్ స్టోరీ ఇది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడేవారు అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన చిత్రం ఇది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Related Stories
Recommended image1
Peddi: పెద్ది మూవీలో తప్పులన్నీ బయటపెట్టిన సీనియర్ రచయిత.. రాంచరణ్ హీరో కాకపోయి ఉంటే ఏం జరిగేది ?
Recommended image2
ANR: తాగేసి హోటల్ లో గొడవ, స్టార్ హీరోని పిలిచి వార్నింగ్ ఇచ్చిన ఏఎన్నార్..అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved