రాజమౌళి , కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా ఎలా మిస్ అయ్యిందో తెలుసా?
తెలుగు సినిమా గౌరవాన్ని హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టాడు రాజమౌళి.. అయితే జక్కన్నతో చాలామంది స్టార్ హీరోల సినిమాలు మిస్ అయ్యాయి. ఆ లిస్ట్ లో కమల్ హాసన్ కూడా ఉన్నారు. ఇంతకీ వీరి కాంబోలో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా?

తెలుగు సినిమా గర్వపడేలా చేసిన దర్శకుడు..
టాలీవుడ్ లో తన ప్రస్థానం స్టార్ట్ చేసి.. ఇండియన్ సినిమా గర్వపడేలా చేసిన దర్శకుడు రాజమౌళి. టాలీవుడ్ ను హాలీవుడ్ స్థాయిలోనిలబెట్టిన ఎస్.ఎస్. రాజమౌళి.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. ఈ స్థాయికి చేరకున్నాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న అగ్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు రాజమౌళి. ఒకప్పుడు మన టాలీవుడ్ ను చిన్న చూపు చూసినవారికి.. పెద్ద సమాధానం చెప్పాడు జక్కన్న. ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయడానికి పెద్ద పెద్ద హీరోలంతా పోటీపడుతున్నారు.. కానీ..ఒకప్పుడు జక్కన్న ఇచ్చిన ఆఫర్ను రిజెక్ట్ చేసిన హీరోలు ఉన్నారు. ఈ స్టార్ డైరెక్టర్ తో సినిమా మిస్ అయిన వారిలో సూర్య, కమల్ హాసన్ లాంటి స్టార్స్ ఉన్నారు.
సెలక్టివ్ గా సినిమాలు చేస్తోన్న రాజమౌళి..
టీవీ సీరియల్ తో , చిన్న సినిమాలతో తన కెరీర్‌ను మొదలుపెట్టిన రాజమౌళి, క్రమంగా తన స్టైల్, విజన్‌తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో వారణాసి సినిమాతో పాన్ వరల్డ్ ను టచ్ చేయబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రాజమౌళి విజన్ కు.. జేమ్స్ కామరూన్ లాంటి హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా సపోర్ట్ చేయడం విశేషం. రాజమౌళితో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న స్టార్ హీరోలు, స్టార్ నటులంతా పోటీపడుతుంటారు. కానీ జక్కన్న మాత్రం తనకు నచ్చిన కథలు, తనకు సరిపోయే హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ చాలా సెలెక్టివ్‌గా ముందుకు సాగుతున్నారు.
కమల్ హాసన్ తో మిస్సైన సినిమా..?
ఈ క్రమంలో రాజమౌళి గతంలో చాలామంది స్టార్ హీరోలకు ఆఫర్ ఇచ్చాడు. కానీ వారు ఆ అవకాశాలను వదులుకున్నారు. బాహుబలి లాంటి కథలను సూర్యతో రూపొందించాలని అనుకున్నాడు జక్కన్న. కానీ అది కుదరలేదు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్‌తో కూడా రాజమౌళి సినిమా చేయాలని ప్రయత్నించాడట. అది కూడా 20 ఏళ్ల క్రితమే ఈ పనిచేశాడట జక్కన్న. 2005వ సంవత్సరంలో కమల్ హాసన్‌కు తగ్గట్టుగా ఒక డిఫరెంట్ స్టోరీని రాసుకుని.. కమల్ కు వివరించాడట. ఆ కథలో డ్యాన్స్‌తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్‌కు విపరీతమైన స్కోప్ ఉండడంతో, కమల్ హాసన్ అయితే ఆ పాత్రకు సరిపోతారని రాజమౌళి భావించారని సమాచారం.
రాజమౌళి ఆఫర్ కు కమల్ సమాధానం..
కమల్ హాసన్ తో తెలుగు, తమిళం రెండుభాషల్లో వర్కౌట్ అయ్యేలా ఓ ప్లాన్ ను రెడీ చేసుకున్నాడట రాజమౌళి. అయితే అప్పటికే కమల్ హాసన్ చాలా బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలు చేస్తున్నాడు. దాంతో ఈ సినిమా కోసం కోంత కాలం ఆగాల్సి ఉంటుందని రాజమౌళితో అన్నాడట. తన వద్ద డేట్స్ లేకపోవడంతో కమల్ హాసన్ ఈసినిమాను హోల్డ్ లో పెట్టాడు. ఇక చేసేది లేక రాజమౌళి ఆ స్క్రిప్ట్‌ను పక్కన పెట్టి మరో సినిమా మీద వర్క్ చేయడం ప్రారంభించారు. ఆతరువాత కాలంలో అసలు ఈ సినిమాపై ఎటువంటి కదలిక రాలేదు. ఇలా వీరిద్దరి కాంబో మిస్ అయినట్టు తెలుస్తోంది. ఒకవేళ అప్పట్లో ఈ కాంబినేషన్ సెట్ అయి ఉంటే, ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసేదని అభిమానులు అంటున్నారు.

