- Home
- Entertainment
- బిగ్ బాస్ తెలుగు 9 కోసం 15 కోట్లు పెంచిన నాగార్జున ? ఈ సీజన్ కి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు 9 కోసం 15 కోట్లు పెంచిన నాగార్జున ? ఈ సీజన్ కి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సక్సెస్ ఫుల్ గా ముగిసింది. కళ్యాణ్ పడాల విన్నర్ గా నిలిచాడు. కళ్యాణ్ తో పాటు, తనూజ, పవన్ కూడా బిగ్ బాస్ లోకి వచ్చి భారీగానే డబ్బు సంపాదించుకుని వెళ్లారు. మరి హోస్ట్ గా కింగ్ నాగార్జున ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా?

విజయవంతంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. గత కొన్ని సీజన్లుగా పెద్దగా స్పందన లేకపోయినా.. ఈసీజన్ కు మాత్రం భారీగా రెస్పాన్స్ వచ్చింది. స్టార్ సెలబ్రిటీలు ఎక్కువగా లేకపోయినా.. సామాన్యుల కోటాలో వచ్చిన కంటెస్టెంట్స్ కు ఎక్కువగ సపోర్ట్ ఇచ్చారు ఆడియన్స్. అంతే కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ గా కూడా సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల నిలిచాడు. టాప్ 3 లో ఇద్దరు కామనర్స్ ఉండగా.. రన్నర్ గా నిలిచిన తనూజ మాత్రం సెలబ్రిటీల కోటా నుంచి వచ్చింది. కాగా ఈసీజన్ సక్సెస్ అవ్వడంతో బిగ్ బాస్ టీమ్ సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. నెక్ట్స్ సీజన్ కు రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోవాలని చూస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 9 రెమ్యునరేషన్లు..
ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 లో రెమ్యునరేషన్లు చాలా స్పెషల్.. విన్నర్ కు సమానంగా రన్నర్ కూడా రెమ్యునరేషన్ సాధించినట్టు తెలుస్తోంది. టాప్ 3 గా ఉన్న డిమాన్ పవన్ కూడా తన రెమ్యునరేషన్ తో పాటు గా 15 లక్షల క్యాష్ ఫ్రైజ్ ను తీసుకుని వెళ్ళాడు.. ఈ మనీ కట్ అవ్వడంతో.. విన్నర్ ప్రైజ్ మనీ.. 50 లక్షల నుంచి 35 లక్షలకు తగ్గింది. ఇక తనూజ 40 లక్షల వరకూ రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం. ఇమ్మాన్యుూయేల్, సుమన్ శెట్టి కూడా 35 నుంచి 40 లక్షల వరకూ రెమ్యునరేషన్ గా అందుకున్నట్టు టాక్ వినిపించింది. ఇలా ఈసారి భారీ రెమ్యునరేషన్లు, విన్నర్ ప్రైజ్ మనీలో కోతపడటం కూడా జరిగింది. ఇక అందరి మాట సరే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ను సక్సెస్ ఫుల్ గా హోస్టింగ్ చేసిన నాగార్జున ఎంత తీసుకున్నాడో తెలుసా?
నాగార్జున రెమ్యునరేషన్..
బిగ్ బాస్ తెలుగు గత 6 సీజన్లుగా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు అక్కినేని నాగార్జున. సీజన్ 9 తో కలుపుకుని నాగార్జున 7 సీజన్లు సక్సెస్ ఫుల్ గా హోస్టింగ్ చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 9 కోసం అక్కినేని నాగార్జున ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో కోసం స్టార్ సెలబ్రిటీ అయిన నాగార్జున సుమారు మూడు నెలల సమయాన్ని వెచ్చించాల్సిందే. ఈ క్రమంలోనే హోస్టులకు భారీగా రెమ్యునరేషన్ లభిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 9వ సీజన్ కోసం అక్కినేని నాగార్జున సుమారు 35 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో ఆయన 20 కోట్ల వరకూ రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఆయన తన రెమ్యునరేషన్ ను 15 కోట్లు పెంచారని సమాచారం మాత్రమే. అధికారికంగా మాత్రం ఈ విషయం ఎవరు వెల్లడించలేదు.
బిగ్ బాస్ తెలుగు ఎప్పుడు మొదలయ్యింది..?
బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగుతో పాటు తమిళంలో కూడా 2017లో ప్రారంభమైంది. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత 2వ సీజన్ ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఇక మూడో సీజన్ నుంచి సీజన్ 9 వరకూ కింగ్ నాగార్జుననే హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. కాగా ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు.. వారి వారి స్థాయిని బట్టి.. వారానికి వేల నుంచి లక్షల రూపాయల వరకూ లభిస్తోంది. ఇక విన్నర్ గా టైటిల్ కప్పు గెలిచే వారికి 50 లక్షల ప్రైజ్ మనీ అధనంగా లభిస్తుంది. వాటితో పాటు కాస్ట్లీ గిప్ట్స్ కూడా అందుతాయి. ఇక హోస్ట్ గా ఉన్న సెలబ్రిటీకి కూడా వారి స్థాయిని బట్టి.. కోట్లలో రెమ్యునరేషన్ ఉంటుంది. .

