MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Anasuya : బట్టల గురించి మాట్లాడటం చేతకానితనం, మేము ఏం వేసుకోవాలో మీరే చెప్తారా? శివాజీపై అనసూయ మళ్లీ ఫైర్..

Anasuya : బట్టల గురించి మాట్లాడటం చేతకానితనం, మేము ఏం వేసుకోవాలో మీరే చెప్తారా? శివాజీపై అనసూయ మళ్లీ ఫైర్..

టాలీవుడ్ నటుడు శివాజీ రాజేసిన మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అనసూయ ఈ విషయంలో చాలా ఘాటుగా స్పందిస్తోంది. తాజాగా మరోసారి ఆమె శివాజీపై మండిపడింది. ఇంతకీ ఆమెఏమంటోందంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 25 2025, 07:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అనసూయ రుణం తీర్చుకుంటా
Image Credit : Anasuya

అనసూయ రుణం తీర్చుకుంటా

హీరోయిన్లు వేసుకునే బట్టలు నిండుగా ఉండాలి అని రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించగా.. అందులో కొందరు శివాజీని విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం ఆయనకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఈక్రమంలో స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రస్ అనసూయ శివాజీపై చేసిన ఘాటు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శివాజీపై అనసూయ మండిపడ్డారు. ఆతరువాత అనసూయ స్పందనపై శివాజీ మరోసారి స్పందించారు. వివాదంలోకి అనసూయ ఎందుకు వచ్చిందో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, అనసూయ రుణం తీర్చుకుంటానంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఘాటుగా స్పందించిన అనసూయ..
Image Credit : Instagram/Anasuya

ఘాటుగా స్పందించిన అనసూయ..

శివాజీ కామెంట్స్ తో మరోసారి అనసూయ స్పందించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. అనసూయ మాట్లాడుతూ.. నా శ్రేయోభిలాషులు కొందరు వీడియోలు షేర్‌ చేశారు.. వాటిని చూసిన తర్వాత కొన్ని విషయాలు గుర్తొచ్చాయి.. “అతి వినయం దూర్త లక్షణం” అనే మాటను నేను జీవితంలో నేర్చుకున్నాను నా ఇంట్లో పెద్దలు నాకు అదే నేర్పించారు. కొంతమంది అమ్మ, తల్లి అంటూ మాట్లాడేవారు చాలా డేంజర్‌.. రీసెంట్ గా కొన్ని వీడియోలు చూసినప్పుడు అదే అనిపించిందని'' అనసూయ అన్నారు.

35
విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు..
Image Credit : Instagram/@itsme_anasuya

విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు..

అనసూయ మాట్టాడుతూ.. నేను రీసెంట్ గా ఒక స్టోర్‌ లాంచ్‌కు వెళ్లినప్పుడు అక్కడ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు మాత్రమే స్పందించాను.. శివాజీకి ఆయన అభిప్రాయం ఉందని, నాకు నా అభిప్రాయం ఉందని, అందుకే నేను మాట్లాడాను.. ప్రెస్‌ మీట్‌లో విక్టిమ్‌ కార్డ్‌ ప్లే చేస్తున్నారు.. ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతున్నాయి.. అయినప్పటికీ కొందరు ఫేక్‌ ఫెమినిస్టులు అంటూ మాట్లాడుతున్నారు. ఫెమినిజం అంటే అందరూ సమానంగా ఉండాలనేదే అందులో ఫేక్ ఫెమినిజం ఉండదు.. అబ్బాయిలు కూడా ఫెమినిస్టులుగా ఉండొచ్చు. అని అనసూయ స్పంష్టం చేశారు.

45
చేతగానితనానికి నిదర్శనం
Image Credit : instagram/anasuya bharadwaj

చేతగానితనానికి నిదర్శనం

ఈ సందర్బంగా మరికొన్ని ఘాటు కామెంట్లు చేసిన అనసూయ.. '' ఆడవారి బట్టల గురించి మాట్లాడడం చేతగానితనానికి నిదర్శనం.. తమపై తమకు నియంత్రణ లేనప్పుడు ఇతరులపై ఆ నియంత్రణను రుద్దే ప్రయత్నం జరుగుతుంది. నేను కూడా హీరోయిన్‌నే, ఫీమేల్‌ లీడ్‌ క్యారెక్టర్స్‌ చేసిన అనుభవం ఉంది..“మీకు నేను బట్టలు ఎలా వేసుకోవాలో చెబుతున్నానా? మీరు మాత్రం మాకు ఎలా వేసుకోవాలో చెబుతున్నారు. మేము చిన్న పిల్లలం కాదు. చాలా వినమ్రతతో నా అభిప్రాయం చెపుతున్నా.. నేను కూడా ఒక మహిళేనని, గ్లామరస్‌గా ఉండాలనుకునే హక్కు నాకూ ఉంటుంది'' అని అనసూయ అన్నారు.

55
మీ నిజస్వరూపం అదే..
Image Credit : instagram/anasuya bharadwaj

మీ నిజస్వరూపం అదే..

అనసూయ మాట్లాడుతూ... కామెంట్లు చేసి సారీ చెప్పడం సరిపోదని, ఆ టోన్‌ లోనే మీ నిజస్వరూపం బయటకు కనిపిస్తోంది. నిజంగా ధైర్యం ఉంటే మగవాళ్ల ప్రవర్తనపై ప్రశ్నించాలి.. అంతే కానీ అది చేత కాక.. హీరోయిన్లపై ఎందుకు పడతారు. ఆడవాళ్లు అలా బట్టలు వేసుకోవద్దని ఎక్కడైనా రాసి ఉందా..? బట్టలు కాదు, క్యారెక్టరే ముఖ్యం.. అది ఉంటే సమస్యలు రావు అని అనసూయ స్పష్టం చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనసూయ భరద్వాజ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Recommended image2
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image3
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Related Stories
Recommended image1
1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు
Recommended image2
బిగ్ బాస్ తెలుగు 9 కోసం 15 కోట్లు పెంచిన నాగార్జున ? ఈ సీజన్ కి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved