MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు ,మణిశర్మ కు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది, తప్పు ఎవరిది? అసలేం జరిగింది?

మహేష్ బాబు ,మణిశర్మ కు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది, తప్పు ఎవరిది? అసలేం జరిగింది?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కు బ్లాక్ బస్టర్ ట్యూన్స్ ఇచ్చిన మ్యుూజిక్ డైరెక్టర్ మణిశర్మ.  వీరిద్దరి కాంబినేషనర్ లో వచ్చిన పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికీ  మ్యుూజిక్స్ లవర్స్ ప్లే లిస్ట్ లో మణిశర్మ చేసిన మహేష్ బాబు సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఖాలేజా , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల తరువాత వీరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రాలేదు. ఇద్దరిమధ్య గ్యాప్ వచ్చేసింది. దానికి కారణం ఏంటి? బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉన్న ఈ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం ఎవరు? ఈ విషయంలో మణిశర్మ కామెంట్ ఏంటి? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 12 2025, 12:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్లాప్ సినిమాలు కూడా లేకపోలేదు. అయితే మహేష్ సినిమాల్లో ప్లాప్ టాక్ వచ్చినా సరే మ్యూజిక్ మాత్రం సూపర్ హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి.

అట్ దా సేమ్ టైమ్ మ్యూజిక్ వల్ల హిట్ అయిన మహేష్ సినిమాలు కూడా ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్ బిగినింగ్ లో మంచి మ్యూజిక్ తో సూపర్ హిట్ సాంగ్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన దర్శకుడు మణిశర్మ. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ ఆల్ మోస్ట్ సూపర్ హిట్స్ అయ్యాయి. ఆసినిమాల పాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. 

Also Read :చిరంజీవి గాఢంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎందుకు పెళ్లి చేసుకోలేదు, నిజమెంత?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
mani sharma

mani sharma

మురారి, ఒక్కడు, అతడు, అర్జున్, ఖలేజా, పోకిరి.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వీరిద్దిరి కాంబోలో హిట్ సినిమాలు.. సూపర్ హిట్ పాటలు ఎన్నో. ఇప్పుడు మనం చెప్పుకున్న లిస్ట్ లో ఏ సినిమాలో పాట అయినా బాగాలేదు అన్నవారు లేరు. అన్ని పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి.

మరి ఇలాంటా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కు గ్యాప్ ఎందుకు వచ్చింది.ఖాలేజా తరువాత మహేష్ కు మ్యుజిక్  చేయలేదు మణిశర్మ. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు మాత్రం బాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సరిపెట్టారు. ఆతరువాత మహేష్ బాబు తో మణిశర్మకు చాలా గ్యాప్ వచ్చింది. వీరిద్దరు ఎక్కువ సినిమాలు చేయడం వల్ల మంచి ఫ్రెండ్స్ లా ఉండేవారు.

కాని రాను రాను.. ఇద్దరిమధ్య గ్యాప్ పెరిగింది. ఇక ఆతరువాత  కలిసి సినిమా చేసింది లేదు. మహేష్ బాబు సినిమాలకు మణిశర్మ ప్లేస్ లో దేవిశ్రీ ప్రసాద్ వచ్చి చేరాడు. దాంతో సూపర్ స్టార్ సినిమాల మ్యూజిక్ పాట్రన్ కంప్లీట్ గా మారిపోయింది. 

Also Read: 47 ఏళ్ల విజయ్ సేతుపతి తో 53 ఏళ్ళ హీరోయిన్ జంటగా సినిమా? ఎవరా నటి?

33

ఈ విషయంలో మణిశర్మ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఓ సందర్భంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ లో పాల్గొన్న మణిశర్మ.. మహేష్ బాబుతో గ్యాప్ గురించి కామెంట్ చేశాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు. ఎందుకు దూరం పెట్టారో కూడా తెలియదు. మా ఇద్దరి కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. మరి ఎక్కడ పొరపాటు జరిగింది అనేది నాకు తెలియదు అన్నారు.

మేబీ తప్పు నాదే అయ్యి ఉండొచ్చు.. అందుకే ఇలా జరిగి ఉండొచ్చు. కాని నేను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు కూడా ఏం జరిగిరిందో నాకు చెప్పలేదు. గ్యాప్ మాత్రం అలా కంటీన్యూ అవుతూ వచ్చింది అని కామెంట్ చేశారు. కానిఈ ఇంటర్వ్యూ తరువాత మహేష్ ఫ్యాన్స్ కూడా వీరిద్దరి కాంబోలో మళ్ళీ సినిమా కావాలని కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు మణిశర్మ కాంబో సూపర్ హిట్ అంటున్నారు. 

Also Read: 400 సినిమాలు, 3 పెళ్లిళ్లు, 6 గురు పిల్లలు, 100 కోట్ల ఆస్తి ఉన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?

Also Read: బ్రహ్మముడి కావ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కొత్తగా వచ్చి భారీగా వసూలు చేస్తున్న బుల్లితెర తార.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
మహేష్ బాబు ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved