- Home
- Entertainment
- Neethu Master Remuneration: 6 వారాలకు నీతూ మాస్టర్ అందుకు పారితోషికం ఎంతో తెలుసా? ఇంత తక్కువా?
Neethu Master Remuneration: 6 వారాలకు నీతూ మాస్టర్ అందుకు పారితోషికం ఎంతో తెలుసా? ఇంత తక్కువా?
నీతూ నటరాజ్ మాస్టర్.. 11వ వారంలో బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆరు వారాల్లో హౌజ్‌ని వీడింది. మరి ఆరు వారాలకు ఆమె ఎంత పారితోషికం తీసుకుందనేది చూస్తే.

11 వ వారం నీతూ మాస్టర్ ఎలిమినేట్
బిగ్ బాస్ తెలుగు 10.. వైల్డ్ కార్డ్ ద్వారా స్ట్రాంగ్ కంటెస్టెంట్లని దించుతుంటారు. కానీ గత సీజన్ మాదిరిగానే ఈ సీజన్ కూడా వీక్ కంటెస్టెంట్లని దించారు. ఒక్క శివ తప్ప మిగిలిన వారు ఎవరూ సరైన కంటెంట్ ఇవ్వడంలో, గేమ్స్ ఆడటంలో, ఎంటర్టైన్ చేయడంలో వెనకబడ్డారు. దీంతో వరుసగా ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పటికే అపూర్వ, శ్వేత నాయుడు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు 11వ వారంలో నీతూ మాస్టర్ హౌజ్‌ని వీడారు. ఇంకా రామకృష్ణ, శివ కుమార్ ఉన్నారు. రామకృష్ణ కూడా ఈ వారమో, వచ్చే వారమో బయటకు వస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
నీతూ నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ పారితోషికం
ఇక 11వ వారంలో ఎలిమినేట్ అయిన నీతూ మాస్టర్ పారితోషికం ఎంత? బిగ్ బాస్ షోలో ఉన్నందుకు ఆమెకి ఎంత ఇచ్చారు? అనేది చూస్తే, వైల్డ్ కార్డ్ ద్వారా ఐదో వారంలో బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నీతూ నటరాజ్ మాస్టర్. ఆమెకి వారానికి లక్షన్నర పారితోషికంగా నిర్ణయించారట. ఆరు వారాలకు దాదాపు తొమ్మిది లక్షలు అందుకోబోతున్నట్టు సమాచారం. అయితే సెలబ్రిటీ కోటాలో హౌజ్‌లోకి అడుగుపెట్టింది నీతూ మాస్టర్. ఆమెకి పారితోషికం ఎక్కువగానే ఉంటుందని సమాచారం. దాదాపు పదిహేను లక్షల వరకు అందుకునే అవకాశం ఉందని మరో సోర్స్ ద్వారా తెలుస్తోంది. ఏదేమైనా నీతూ నటరాజ్ మాస్టర్‌కి తక్కువ పారితోషికమే అందిందని చెప్పొచ్చు.
నీతూ ఎలిమినేషన్‌కి కారణం ఇదే
ఇదిలా ఉంటే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన నీతూ మాస్టర్.. ప్రారంభంలో సందడి చేసింది. ఫైరింగ్‌తో కనిపించింది. పాత కంటెస్టెంట్లని ఆడుకుంది. నామినేషన్లో తన సత్తా చాటింది. కానీ ఆ తర్వాత ఆ స్థాయిలో మెప్పించలేకపోయిందనే టాక్ ఉంది. డల్ అయ్యిందని, ఆటల్లో పోరాడే క్రమంలో ఓటమి చెందినప్పుడు కన్నీళ్లు పెట్టుకుందని, ఆ ఫైరింగ్ కనిపించలేదనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఊహించినట్టుగానే ఆమె ఎలిమినేషన్ అయ్యింది. ఆమె నుంచి ఇలాంటి డల్ పర్ఫెర్మెన్స్ ని ఎవరూ ఊహించలేదు. అందుకే తక్కువ ఓట్లు పడినట్టు సమాచారం. అయితే ఈ సారి కేవలం ఆడియెన్స్ ఓట్ల నుంచి ఎలిమినేట్ చేయడమే కాదు, బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరు డల్‌గా ఉన్నారనేదాన్ని బట్టి కూడా ఎలిమినేట్ చేస్తున్నట్టు సమాచారం.















