- Home
- Entertainment
- Jr NTR: తన ఫస్ట్ సినిమాలో ఎన్టీఆర్ కు నచ్చని విషయం ఏంటి? ఆ ఒక్క విషయంలో ఎందుకు అసంతృప్తితో ఉన్నాడు?
Jr NTR: తన ఫస్ట్ సినిమాలో ఎన్టీఆర్ కు నచ్చని విషయం ఏంటి? ఆ ఒక్క విషయంలో ఎందుకు అసంతృప్తితో ఉన్నాడు?
Jr NTR: ఎన్టీఆర్ ఫస్ట్ సినిమాలో తనకు నచ్చని విషయం ఏంటి? అదొక్కటి మార్చుకుని ఉంటే బాగుండు అని ఎదుకు అనుకున్నాడు. ఇంతకీ ఎన్టీఆర్ కాస్త అసంతృప్తికి గురైన విషయం ఏంటి? తారక్ స్వయంగా వెల్లడించిన విషయం?

నందమూరి నటవారసుడు....
నందమూరి నటవారసత్వం తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఎన్టీఆర్. రావడం వారసత్వంగా వచ్చినా.. ఎదగడం మాత్రం తన సొంత ట్యాలెంట్ తో ఎంతో కష్టపడి స్టార్డమ్ సాధించాడు. ఒక్కొమెట్టు ఎక్కుతూ.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా సత్తా చాటుతున్నాడు. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ రేంజ్ కు వెళ్లాడు ఎన్టీఆర్. ఎన్నో సార్లు ఎన్టీఆర్ తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఇంటర్వ్యూలలో పంచుకున్నారు.
అయితే ఆమధ్య జరిగిన ఓ కార్యక్రమంలో తారక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. తన ఫస్ట్ సినిమా అనుభవం, ఇప్పుడు ఆ సినిమాపై తన అభిప్రాయాలను, అలాగే ఇప్పటికీ సినిమా విడుదల సమయంలో ఉండే ఆందోళన గురించి ఆయన నిర్మొహమాటంగా మాట్లాడారు. ఇంతకీ ఎన్టీఆర్ చెప్పిన ఆశ్చర్చకరమైన విషయాలు ఏంటి?
తొలి సినిమా విషయంలో అసంతృప్తి...
తన తొలి సినిమా అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ సమయంలో తాను కొంచెం బొద్దుగా, లావుగా ఉండేవాడినని ఎన్టీఆర్ చెప్పారు. ఆ ఒక్క విషయంలో కొంచెం మార్పు ఉండి ఉంటే బాగుండేదేమోనని అనిపించేదని తెలిపారు. ఇంకొంచెం సన్నగా, కొంచెం బరువు తగ్గి ఆ సినిమాలు చేసి ఉంటే బాగుండేదా అని తనకు అనిపించిన సందర్భాలు ఉన్నాయని ఆయన సరదాగా పంచుకున్నారు. తన తొలి రోజుల లుక్ గురించి ఎటువంటి దాపరికం లేకుండా ఆయన చేసిన ఈ కామెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటాయి.
సినిమా రిలీజ్ సమయంలో నెర్వస్నెస్
సినిమా విడుదలయ్యే సమయంలో తనకు కలిగే ఎమోషన్స్ గురించి కూడా ఎన్టీఆర్ వివరించారు. ఇప్పటికీ తన సినిమా రిలీజ్ అవుతుందంటే నిద్ర పట్టదని, ఎంతో నెర్వస్‌గా ఉంటానని ఆయన చెప్పారు. ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా, కొత్త సినిమా విడుదలయ్యే ప్రతిసారీ ఆ ఉత్కంఠ, ఆందోళన తనలో అలాగే ఉంటాయని స్పష్టం చేశారు. సినిమా విడుదలకు ముందు ఉండే ఆ టెన్షన్ తనకు సహజంగానే ఉంటుందని ఆయన మాటల్లో కనిపిస్తుంది.
హిట్, ఫ్లాప్‌లను తీసుకునే విధానం
సినిమా ఫలితాలను తాను ఎలా స్వీకరిస్తారనే దానిపై కూడా ఎన్టీఆర్ స్పష్టత ఇచ్చారు. సినిమా ఫ్లాప్ అయినా లేదా హిట్ అయినా, దాని ప్రభావాన్ని తాను పెద్దగా ఎక్కువ రోజులు మనసులో ఉంచుకోనని తెలిపారు. ఎక్కువలో ఎక్కువ.. ఒక రోజు మాత్రమే ఆ ఫలితం గురించి ఆలోచిస్తానని, ఆ ఒక్క రోజు కంటే ఎక్కువ సమయం తాను దానిని తీసుకోనని చెప్పారు. విజయం వచ్చినా, పరాజయం ఎదురైనా ఒక రోజుకే పరిమితం చేసి, ఆ తర్వాత ముందుకు సాగడమే తన పద్ధతి అని ఆయన వెల్లడించారు.















