MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Sravanthi Chokarapu: స్రవంతి చొక్కారపు భర్త ఎవరు? ఏం చేస్తారు? రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు?

Sravanthi Chokarapu: స్రవంతి చొక్కారపు భర్త ఎవరు? ఏం చేస్తారు? రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు?

Sravanthi Chokarapu: యాంకర్ స్రవంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు.. సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటిన ఈ బ్యూటీ, బిగ్ బాస్ లో కూడా సందడి చేసింది. ఇంతకీ స్రవంతి భర్త ఏం చేస్తాడో తెలుసా? ఆమె రెండు పెళ్లిళ్ల సీక్రేట్ ఏంటి?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 24 2026, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బుల్లితెరపై దూసుకుపోతున్న స్టార్ యాంకర్..
Image Credit : sravanthi Chokarapu/Instagram

బుల్లితెరపై దూసుకుపోతున్న స్టార్ యాంకర్..

స్రవంతి చొక్కారపు సక్సెస్ ఫుల్ యాంకర్ దూసుకుపోతోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ టైమ్ లోనే తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. నటిగా మారాలన్న పట్టుదలతో ఎక్కడో కదిరి నుంచి హైదరాబాద్ చేరిన స్రవంతి.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఎదిగింది. పెళ్లి తరువాత ఫిల్మ్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన ఆమె.. ఆర్ధిక కష్టాల వల్ల మళ్ళీ ఇండస్ట్రీ వైపు నడిచింది. అయితే ఈసారి నటిగా కాకుండా యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. బుల్లితెరపై స్టార్ గా మారింది. ప్రస్తుతం చిన్న సినిమాల ఈవెంట్లు, టెలివిజన్ షోలతో సీనియర్ యాంకర్స్ కు పోటీ ఇస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కలిసొచ్చిన బిగ్ బాస్ పాపులారిటీ
Image Credit : sravanthi Chokarapu/Instagram

కలిసొచ్చిన బిగ్ బాస్ పాపులారిటీ

యాంకర్ గా స్టార్ డమ్ చూసిన స్రవంతి.. బిగ్ బాస్ షో వల్ల మరింత పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ ఓటీటీ లో సందడి చేసిన స్రవంతి.. తన గ్లామర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. కానీ గేమ్ పరంగా సత్తా చాటలేకపోయింది. హౌస్ లో అఖిల్ కు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ.. తన గేమ్ ను మర్చిపోయింది. ఈ విషయంలో విమర్శలు కూడా ఫేస్ చేసింది. బిగ్ బాస్ లోకి వెళ్లిన తరువాతే స్రవంతి పర్సనల్ లైఫ్ కు సబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. తన ప్రేమ పెళ్లి లో జరిగిన ట్విస్టుల గురించి ఈ షోలోనే స్రవంతి కొన్ని విషయాలను వెల్లడించింది.

Related Articles

Related image1
Allu Arjun Remuneration : రాకా కోసం అల్లు అర్జున్, దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Related image2
Krishna : మీ చావు మీరు చావండని.. ఫోన్ లో కృష్ణను ఎన్టీఆర్ ఎందుకు తిట్టాడో తెలుసా? ఆ సినిమా వెనుక అంత పెద్ద కథ ఉందా?
35
స్రవంతి భర్త ఎవరు? ఏం చేస్తుంటాడు?
Image Credit : sravanthi Chokarapu/Instagram

స్రవంతి భర్త ఎవరు? ఏం చేస్తుంటాడు?

యాంకర్ స్రవంతి భర్త పేరు ప్రశాంత్. ఆమె ఇండస్ట్రీకి రాకముందే ఇద్దరు ప్రేమించుకున్నారు. నటిగా స్రవంతి ఎదురుగుతున్న టైమ్ లోనే వీరి పెళ్లి జరిగింది. అత్తింటివారికి ఇష్టం లేకపోవడంతో కెరీర్ ను పక్కన పెట్టి.. సినిమాలకు దూరం అయ్యింది స్రవంతి. ఆమె భర్త ప్రశాంత్ పెళ్లికి ముందు బిజినెస్ చేసేవారు. కానీ తన స్నేహితులను అతిగా నమ్మడంతో.. వారి చేతులో మోసపోయి, డబ్బు పోగోట్టుకున్నాడు. 

అదే టైమ్ లో స్రవంతి ఇంట్లో వీరిగురించి తెలియడం, పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. ఆర్ధిక కష్టాలు చుట్టు ముట్టడంతో ప్రశాంత్ ప్రైవేటు జాబ్ లో జాయిన్ అయ్యాడు. స్రవంతి కూడా ఓ జూవ్వెల్లరీ షాప్ లో సేల్స్ గర్ల్ గా చేరింది. కానీ అనారోగ్య కారణాల వల్ల ఆమె తన జాబ్ ను వదిలేసింది. అలా బిజినెస్ లో నష్టపోయిన ప్రశాంత్ కొన్నాళ్లు ప్రైవేట్ జాబ్ చేసుకున్నట్టు సమాచారం.

45
స్రవంతి రెండు పెళ్లిళ్ల సంగతేంటి..?
Image Credit : sravanthi Chokarapu/Instagram

స్రవంతి రెండు పెళ్లిళ్ల సంగతేంటి..?

భర్త ప్రోత్సాహంతో యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది స్రవంతి... వరుసగా అవకాశాలు అందుకుని బుల్లితెరపై స్టార్ గా ఎదిగింది. స్రవంతిలో చలాకీతనం, ఆకట్టుకునే స్మైల్, గలగలా మాట్లాడే తత్వం.. యాంకర్ గా ఆమె ఎదుగుదలకు బాగా ఉపయోగపడ్డాయి. ఇక బిగ్ బాస్ లో ఉండగాస్రవంతి రెండు పెళ్లిళ్లు చేసుకుందన్న ప్రచారం జరిగింది. అప్పుడు ఆమె భర్త ప్రశాంత్ ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ వీడియో కూడా రిలీజ్ చేశాడు. 

''ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో బయటకు వచ్చి మేము పెళ్ళిచేసుకున్నాము. పెళ్లి తరువాత స్రవంతిని హాస్టల్ లో ఉంచాను. ఆతరువాత పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నాము. అలా రెండు సార్లు పెళ్లి చేసుకున్నాము కానీ.. స్రవంతికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి అనడంలో నిజం లేదు.'' అని ప్రశాంత్ క్లారిటీ ఇచ్చాడు.

55
పవన్ కళ్యాణ్ కు వీరాభిమానులు..
Image Credit : our own

పవన్ కళ్యాణ్ కు వీరాభిమానులు..

యాంకర్ స్రవంతి.. ఆమె భర్త ప్రశాంత్ ఇద్దరు పవన్ కళ్యాణ్ కు వీరాభిమానులు.. వారి అభిమానం ఏ స్థాయికి వెళ్లిందంటే...? ఏకంగా తమ కుమారుడికి అకీరా నందన్ అని పేరు పెట్టేశారు. పవన్ కళ్యాణ్ కొడుకు పేరును తమ కొడుకుని పెట్టడంతో పాటు.. స్రవంతి రన్ చేస్తోన్న బోటిక్ కు కూడా అదే పేరు పెట్టారు. ఈ ఇద్దరు పవన్ పై తమ అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు. ప్రస్తుతం ఈ జంట చిన్న చిన్న బిజినెస్ లు చేసకుంటూ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. స్రవంతి ఓ వైపు యాంకర్ గా బిజీగా ఉంటూ.. మరో వైపు బొటిక్ కూడా సక్సెస్ ఫుల్ గా నడిపిస్తుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్న సమంత.. రాజ్ నిడిమోరు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే?
Recommended image2
Bigg Boss 10: బిగ్ బాస్ కి ‘కామనర్స్’ అంటే అంత చులకనా? అప్పుడు శ్రీజ, ఇప్పుడు చరణ్..
Recommended image3
Mandaadi Movie Review: మండాడి మూవీ రివ్యూ.. సూరి హీరోగా సుహాస్‌ విలన్‌గా చేసిన మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Allu Arjun Remuneration : రాకా కోసం అల్లు అర్జున్, దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Recommended image2
Krishna : మీ చావు మీరు చావండని.. ఫోన్ లో కృష్ణను ఎన్టీఆర్ ఎందుకు తిట్టాడో తెలుసా? ఆ సినిమా వెనుక అంత పెద్ద కథ ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved