MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Krishna : మీ చావు మీరు చావండని.. ఫోన్ లో కృష్ణను ఎన్టీఆర్ ఎందుకు తిట్టాడో తెలుసా? ఆ సినిమా వెనుక అంత పెద్ద కథ ఉందా?

Krishna : మీ చావు మీరు చావండని.. ఫోన్ లో కృష్ణను ఎన్టీఆర్ ఎందుకు తిట్టాడో తెలుసా? ఆ సినిమా వెనుక అంత పెద్ద కథ ఉందా?

ఓ సినిమా విషయంలో ఎన్టీఆర్ కు ఫోన్ చేయగా.. మీ చావు మీరు చావండి.. నాకు చెప్పొద్దు అని కృష్ణతో ఎందుకు అన్నారో తెలుసా? ఇంతకీ ఇద్దరి మధ్య గొడవలకు  కారణం అయిన మూవీ ఏంటి? పోటీలో ఎవరు గెలిచారు. 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 23 2026, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఎన్టీఆర్ కృష్ణ మధ్య పోటీ..
Image Credit : stockPhoto

ఎన్టీఆర్ - కృష్ణ మధ్య పోటీ..

ఒకప్పుడు పాత తరం హీరోలు ఎంత క్లోజ్ గా ఉండేవారో.. అంతకంటే ఎక్కువగా వివాదాలు కూడా నడిచేవి. ఇండస్ట్రీకి రెండు కళ్లుగా ఉన్న ఎన్టీఆర్ ఏఎన్నార్ ల మధ్య విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్లే కాదు.. ఎన్టీఆర్ కృష్ణ, ఏఎన్నార్ కృష్ణ, శోభన్ బాబు కృష్ణ, ఎన్టీఆర్, శోభన్ బాబు లాంటి హీరోల మధ్య కూడా ఈ వివాదాలు తప్పలేదు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణ మధ్య ఎక్కువగా అభిప్రాయ భేదాలు వచ్చేవి. ఇద్దరి మధ్య పోటీ తత్వం ఎక్కువగా ఉండేది. బాక్సాఫీస్ పోరుతో పాటు పర్సనల్ గా కూడా చాలా గొడవలు జరిగాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఎన్టీఆర్ వద్దన్న పని చేసి చూపించిన కృష్ణ
Image Credit : stockPhoto

ఎన్టీఆర్ వద్దన్న పని చేసి చూపించిన కృష్ణ

ఎన్ని ఉన్నా.. కలిసినప్పుడు మాత్రం స్టార్స్ చాలా ప్రేమగా మాట్లాడుకునేవారు. సినిమాల విషయంలో వీరిద్దరి మధ్య చాలా సార్లు వాగ్వాదాలు జరిగాయి. ఎన్టీఆర్ వద్దన్న ప్రతీ పని చేసి చూపించారు కృష్ణ.. దాంతో వీరి మధ్య గ్యాప్ మరింతగా పెరిగిపోయింది. ఎన్టీఆర్ కు పోటీగా సినిమాలు చేయడమే కాదు.. ఏకంగా పెద్దాయన మీదనే సెటైరికల్ గా రెండు సినిమాలు చేశారు కృష్ణ. అప్పట్లో వీరి వైరం సంచలనాలకు కారణం అయ్యింది. ఇక కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ మాటలు వినకుండా చేసిన సినిమాలు సక్సెస్ సాధిస్తే.. మరికొన్ని సందర్భాల్లో మాత్రం కృష్ణ పెద్దాయన మాట వినకుండా చేతులు కాల్చుకున్న సందర్భాలు ఉన్నాయి.

Related Articles

Related image1
Raaka To Varanasi 2027లో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసే సినిమాలు ఇవే!
Related image2
ఎన్టీ రామారావు ను చూసి భయంతో డైలాగ్ మర్చిపోయిన స్టార్ కమెడియన్, డైరెక్టర్ తో చీవాట్లు తిన్నది ఎవరు?
37
ఎన్టీ రామారావు కెరీర్ లో సంచలనాల సినిమా..
Image Credit : Asianet News

ఎన్టీ రామారావు కెరీర్ లో సంచలనాల సినిమా..

నందమూరి తారక రామారావు కెరీర్ లో సంచలనం సృష్టించిన సినిమాల్లో దానవీరశూరకర్ణ కూడా ఒకటి. ఈసినిమాలో మూడు పాత్రల్లో నటించడంతో పాటు దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్ గా మల్టీ టాలెంట్ చూపించారు ఎన్టీఆర్. ఈసినిమా చరిత్ర సృష్టించడంతో పాటు.. బాక్సాపీస్ దగ్గర భారీ లాభాలు కూడా తీసుకువచ్చింది. ఇప్పటి వరకూ ఇలాంటి సినిమాను తెరకెక్కించే సాహసం ఎవరు చేయలేకపోయారు. అయితే ఈసినిమా టైమ్ లోనే కృష్ణ కురుక్షేత్రం టైటిల్ తో అదే కాన్సెప్ట్ ను తెరకెక్కించారు. ఎన్టీఆర్ కు పోటీగానే ఈసినిమా చేస్తున్నారని ప్రచారం జరిగింది.

47
కృష్ణను పిలిచి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్..
Image Credit : facebook.com/ghattamanenisuperstar

కృష్ణను పిలిచి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్..

ఎన్టీఆర్ కూడా కృష్ణను పిలిపించుకుని.. నేను దానవీరశూరకర్ణ చేస్తున్నాను.. అదే సబ్జెక్ట్ తో నువ్వు కురుక్షేత్రం చేస్తే ఎలానడుస్తుంది అని ప్రశ్నించారట. ఇక ఈ విషయంలో అసలు నిజాలను ఓ సందర్భంలో వెల్లడించారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన మాట్లాడుతూ.. ''నిర్మాత ఆంజనేయులు గారు నాదగ్గరకు వచ్చి కురుక్షేత్రం సబ్జెక్ట్ ఉంది చేద్దాం అన్నాడు. కృష్ణుడిగా శోభన్ బాబు చేస్తాడు.. ఆయన కూడా ఒకే అన్నాడు. నువ్వు అర్జునుడి పాత్ర చేయి అన్నాడు. నేను సరే అన్నాను. 

57
ఏంటి బ్రదర్ ఇలా చేశారు..?
Image Credit : Asianet News

ఏంటి బ్రదర్ ఇలా చేశారు..?

అప్పుడే రామారావుగారు దానవీరశూర కర్ణ చేస్తున్నాడు. నన్ను పిలిచి నేను దానవీరశూరకర్ణ చేస్తున్నాను.. నువ్వు కురుక్షేత్రం చేస్తే ఎలా నడుస్తుంది అని అడిగారు. నేనేం చేయడంలేదండి.. నిర్మాత ఆంజనేయులు..నన్ను అడిగారు నేను నటిస్తున్నాను అంతే అని చెప్పాను''.

67
మీ చావు మీరు చావండన్న పెద్దాయన..
Image Credit : Superstar Krishna\Twitter

మీ చావు మీరు చావండన్న పెద్దాయన..

కృష్ణ మాట్లాడుతూ.. '' కురుక్షేత్రం మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.. మధ్యలో శోభన్ బాబు  కాస్త వెనకడుగు వేశాడు. ఇక నిర్మాత కూడా  అప్పటికే 10 లక్షలు ఖర్చు పెట్టి .. ఇక నావల్ల కాదు అని చేతులెత్తేశాడు. అప్పుడు నేను రామారావు గారికి ఫోన్ చేసి.. ఇలా అని చెప్పాను. అంతా విన్నాక.. మీ చావు మీరు చావండి.. అని రామారావు వెంటనే ఫోన్ పెట్టేశాడు. ఇక చేసేది లేక నేనే ఆ సినిమాను టేక్ అప్ చేసి పూర్తి చేశాను. తెలుగులో దానవీరశూరకర్ణ సినిమాకు పోటీ ఇవ్వలేకపోయింది. కానీ టెక్నికల్ గా కురుక్షేత్రం సినిమా చాలా స్ట్రాంగ్.

77
ఇతర భాషల్లో భారీ స్పందన సాధించిన కురుక్షేత్రం...
Image Credit : Asianet News

ఇతర భాషల్లో భారీ స్పందన సాధించిన కురుక్షేత్రం...

దానవీరశూరకర్ణ సినిమా టెక్నికల్ గా చాలా వీక్.. కానీ మా సినిమాలో దుర్యోధనుడిగా కైకల సత్యనారాయణ నటించారు.. దానవీరశూరకర్ణలో రామారావు ఆ పాత్ర వేయడంతో.. ఆయన నటన మీద.. కైకాల తేలిపోయారు. దాంతో తెలుగులో ఈసినిమా పెద్దగా ఆడలేదు. కానీ మిగతా భాషల్లో మాత్రం అద్భుతాలు చేసింది. బెంగళూరులో ఈసినిమా శతదినోత్సవం చేసుకుంటే.. దానవీరశూర కర్ణమాత్రం రెండు వారాలు కూడా ఆడలేదు. హిందీలో, తమిళ్ లో డబ్ చేస్తూ.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
కృష్ణ ఘట్టమనేని
నందమూరి తారక రామారావు
శోభన్ బాబు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ?
Recommended image2
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image3
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Related Stories
Recommended image1
Raaka To Varanasi 2027లో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసే సినిమాలు ఇవే!
Recommended image2
ఎన్టీ రామారావు ను చూసి భయంతో డైలాగ్ మర్చిపోయిన స్టార్ కమెడియన్, డైరెక్టర్ తో చీవాట్లు తిన్నది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved