MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి ని తిట్టినందుకు 13 కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్, ఎవరిని కొట్టాడో తెలుసా?

చిరంజీవి ని తిట్టినందుకు 13 కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్, ఎవరిని కొట్టాడో తెలుసా?

మెగా-అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చినట్టు కనిపించినా..చిరంజీవి, అల్లు అరవింద్ అనుబంధం మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరదు.  చిరంజీవి అంటే అరవింద్ కు ఎంత ప్రేమంటే.. మెగాస్టార్ ను తిట్టినందుకు ఓ వ్యక్తిని కుట్లు పడేలా కొట్టాడట స్టార్ ప్రొడ్యూసర్. 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 06 2026, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చిరంజీవి అల్లు అరవింద్ అనుబంధం..
Image Credit : facebook @chirufans

చిరంజీవి- అల్లు అరవింద్ అనుబంధం..

తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి–అల్లు కుటుంబం మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నిర్మాత అల్లు అరవింద్‌కు చిరంజీవి అంటే అపారమైన గౌరవం, అభిమానం. ఇప్పటికీ వీరి గురించి ఎన్ని వార్తలు వచ్చినా.. అదే అనుబంధం కొనసాగిస్తున్నారు . 

మెగాస్టార్ మీద ఈగ కూడా వాలనివ్వడు అరవింద్. ఎప్పుడూ చిరంజీవిని కనిపెట్టుకుని ఉండేవారట... ఈ క్రమంలోనే చిరంజీవి కోసం ఓ వ్యక్తితో అల్లు అరవింద్ ఫైటింగ్ చేశారనే విషయం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.

26
బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా స్టార్ గా ఎదిగిన చిరంజీవి..
Image Credit : facebook @chirufans

బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా స్టార్ గా ఎదిగిన చిరంజీవి..

ఎటువంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి, అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోగా మారారు. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకూ ఆయన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఆ సమయంలో చిరంజీవికి బలమైన అండగా నిలిచింది అల్లు ఫ్యామిలీ.

చిరంజీవి హీరోగా ఎదుగుతున్న దశలోనే ఆయన ఏదో సాధిస్తారని నమ్మిన వ్యక్తి అల్లు రామలింగయ్య. అదే నమ్మకంతో తన కూతురు సురేఖను చిరంజీవికి ఇచ్చి వివాహం చేశారు. కలెక్టర్ సంబంధాలు వచ్చినా.. చిరంజీవినే అల్లుడిగా ఎంపిక చేయడం.. మెగాస్టార్ పై  ఆయన నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకుంటారు. ఆ నమ్మకం నిజమైంది.

Related Articles

Related image1
4 వ తరగతి చదివిన ఏఎన్నార్.. ఇంగ్లీష్ అంత అద్భుతంగా ఎలా మాట్లాడేవారో తెలుసా? అక్కినేని చెప్పిన సీక్రెట్..
Related image2
రామ్ చరణ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన బాలకృష్ణ, కవల పిల్లలు పుట్టినందుకు ఏం ఇచ్చాడంటే?
36
చిరుని తిట్టాడని కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్
Image Credit : facebook @chirufans

చిరుని తిట్టాడని కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్

చిరంజీవి మీద ఈగవాలినా ఊరుకునేవారు కాదు అరవింద్. ఆయన్ను ఎవరైనా ఏమైనా అంటే కోపం వచ్చేదట. గతంలో చిరంజీవితో పాటు అల్లు రామలింగయ్య, శ్రీదేవి, రావు గోపాలరావు లాంటి స్టార్స్ కు డేట్స్ చూసే ఓ పెద్దమనిని ఉండేవారట. ఆయన చాలా సీనియర్ .. మంచివాడే కానీ మందు తాగితే మాత్రం పిచ్చి పిచ్చిగా వాగేవాడట. 

ఓ సారి సినిమా ప్రివ్యూ జరుగుతుంటే.. థియేట బయటకు వచ్చి.. చిరంజీవిని ఇష్టం వచ్చినట్టు అసబ్యంగా తిట్టాడట... గతంలో కూడా ఇలా తిట్టినా.. సర్ధి చెప్పి వదిలేశారట అరవింద్. కానీ థియేటర్ ముందుకు వచ్చి తిడుతుంటే.. చిరంజీవి వింటే అది పెద్ద ఇష్యు అవుతుంది అని అరవింద్ కు అనిపించింది. ఇక ఒకటి రెండు సార్లు చూసి.. మూడో సారి విని కోపం తట్టుకోలేకపోయాడట అరవింద్. 

వెంటనే తన వాచ్,కళ్లజోడు వెనక ఉన్నవ్యక్తికి ఇచ్చి..ఆ వక్తిని పక్కకు తీసుకెళ్ళి గట్టిగావాయించాడట. దాంతో అతినికి 10కి పైగా కుట్లు కూడా పడ్డాయట. ఇంకోసారి చిరంజీవి గురించి ఇలా మాట్లాడితే.. ట్రీట్మెంట్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది అని వార్నింగ్ కూడా ఇచ్చాడట అరవింద్. ఈ విషయాన్ని అల్లు అరవింద్ అలితో సరదాగా ప్రోగ్రామ్ లో వెల్లడించారు.

46
మెగా ఫ్యామిలీలోకి వారసుడి ఎంట్రీ
Image Credit : facebook @chirufans

మెగా ఫ్యామిలీలోకి వారసుడి ఎంట్రీ

చిరంజీవి- సురేఖ పెళ్లి జరిగి 45 ఏళ్లు అవుతున్నా ఈ మెగా దంపతులు ఎలాంటి వివాదాలు లేకుండా.. సంతోషకరమైన కుటుంబ జీవితం కొనసాగిస్తున్నారు. కుటుంబం, పిల్లలు, వ్యక్తిగత జీవితంలో సురేఖ ఇచ్చిన సహకారం మెగా ఫ్యామిలీ ఈ స్థాయికి రావడంలో కీలకంగా మారింది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ కొడుకులు, కూతుర్లు.. మనవరాళ్లు.. మనవడితో హ్యాపీగా ఉన్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ కు కవల పిల్లలు పుట్టడం. అందులో చిరంజీవి వారసుడు కూడా ఎంట్రీ ఇవ్వడంతో .. ఆ అనందం రెట్టింపు అయ్యింది.

56
మెగా - అల్లు ఎదుగుదలకు కారణమైన సినిమాలు?
Image Credit : our own

మెగా - అల్లు ఎదుగుదలకు కారణమైన సినిమాలు?

అల్లు కుటుంబం కారణంగా చిరంజీవికి అవకాశాలు వచ్చాయనే టాక్ ఉన్నప్పటికీ, చిరంజీవి స్టార్‌గా ఎదిగిన తర్వాత గీతా ఆర్ట్స్ స్థాయి అమాంతం పెరిగిందన్నది కూడా వాస్తవమే. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై చిరంజీవి హీరోగా వచ్చిన విజేత, శుభలేఖ, ఆరాధన, యమకింకరుడు, పసివాడి ప్రాణం, రౌడీ అల్లుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, అన్నయ్య, ఎస్పీ పరశురామ్, మాస్టర్, డాడీ వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. నిర్మాతగా అల్లు అరవింద్ ఈ స్థాయికి చేరుకోవడంలో ఈ సినిమాలు కీలక పాత్ర పోషించాయి.

66
రెండు కుటుంబాల మధ్య ఏం జరుగుతోంది..?
Image Credit : our own

రెండు కుటుంబాల మధ్య ఏం జరుగుతోంది..?

చిరంజీవి–అల్లు అరవింద్ బంధం బావ–బావమరిది సంబంధం కంటే ఎక్కువగా స్నేహ బంధంలా ఉంటుందని ఇండస్ట్రీలో చెబుతారు. సినిమాలు, వ్యక్తిగత విషయాల్లో చిరంజీవి అరవింద్ సూచనలు పాటించేవారని, అదే విధంగా చిరంజీవి నిర్ణయాలను కూడా అరవింద్ గౌరవించేవారని అంటుంటారు. చిరంజీవిపై ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే అరవింద్ సహించేవారు కాదని, ఒక సందర్భంలో అలాంటి వ్యక్తిని తీవ్రంగా హెచ్చరించిన ఘటన కూడా జరిగింది. 

ప్రస్తుతం అల్లు, మెగా కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న ప్రచారం ఉన్నప్పటికీ, కీలక సందర్భాల్లో పరస్పర గౌరవం కనిపిస్తూనే ఉంది. అల్లు అరవింద్ తల్లి మరణం, అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వంటి సందర్భాల్లో రెండు కుటుంబాలు కలిసినట్టు కనిపించాయి. మెగా ఫ్యామిలీలో ట్రబుల్ షూటర్‌గా, డామేజ్ కంట్రోలర్‌గా అల్లు అరవింద్ పాత్ర ఇప్పటికీ కీలకమే.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Record: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రష్మిక! పెళ్లి ఫోటో ఆసియాలోనే నంబర్ 1
Recommended image2
Kantara Secret: కాంతారకి మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా? గూస్‌ బంమ్స్ తెప్పించే విషయం చెప్పిన రిషబ్ శెట్టి
Recommended image3
Vijay Rashmika: దేశ వ్యాప్తంగా అన్నదానం, స్వీట్ల పంపిణి.. అభిమానులకు విజయ్‌ దేవరకొండ, రష్మిక సర్‌ప్రైజ్‌
Related Stories
Recommended image1
4 వ తరగతి చదివిన ఏఎన్నార్.. ఇంగ్లీష్ అంత అద్భుతంగా ఎలా మాట్లాడేవారో తెలుసా? అక్కినేని చెప్పిన సీక్రెట్..
Recommended image2
రామ్ చరణ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన బాలకృష్ణ, కవల పిల్లలు పుట్టినందుకు ఏం ఇచ్చాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved