MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • 4 వ తరగతి చదివిన ఏఎన్నార్.. ఇంగ్లీష్ అంత అద్భుతంగా ఎలా మాట్లాడేవారో తెలుసా? అక్కినేని చెప్పిన సీక్రెట్..

4 వ తరగతి చదివిన ఏఎన్నార్.. ఇంగ్లీష్ అంత అద్భుతంగా ఎలా మాట్లాడేవారో తెలుసా? అక్కినేని చెప్పిన సీక్రెట్..

తెలుగు సినిపరిశ్రమ పెద్దదిక్కుల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరావు. అందరు హీరోల్లా ఆయన పెద్దగా చదువుకోలేదు. 4వ తరగతి మాత్రమే చదివిన ఏఎన్నార్.. ఇంగ్లీష్ మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడేవారు. అది ఎలా సాధ్యం అయ్యింది. ఏఎన్నార్ చెప్పిన నిజం ఏంటి?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 05 2026, 07:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు ఇండస్ట్రీని నడిపించిన పెద్ద..
Image Credit : Asianet News

తెలుగు ఇండస్ట్రీని నడిపించిన పెద్ద..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్నార్ రెండు కళ్లు మాదిరిగా ఉన్నారు. టాలీవుడ్ కీర్తిని పెంచారు. ఇండస్ట్రీని నిలబెట్టారు. తెలుగుపరిశ్రమలో ఆతరం హీరోల నుంచి.. ఈ తరం హీరోల వరకూ అంతో ఇంతో చదువుకున్నవారే. చదవు లేకున్నా.. స్టార్ గా ఎదిగి జాతీయ స్థాయిలో హవా చూపించింది మాత్రం ఒక్క అక్కినేని నాగేశ్వరావు మాత్రమే.

 ఎన్టీఆర్ కూడా గ్రాడ్యూయేషన్ చేశారు. ఏఎన్నార్ మాత్రం 4వ తరగతి వరకే చదువు ఆపేశారు. నాటకాలు వేసేవారు. ఆయన తల్లి కూడా ఏదో ఆసరాగా ఉంటుందని నాటకాలకు పంపించారట. స్కూలింగ్ కూడా కంప్లీట్ చేయని అక్కినేని ఇంత అద్భుతంగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడేవారో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అక్కినేనికి ఎన్నో అవమానాలు..
Image Credit : Facebook/Allu Arjun

అక్కినేనికి ఎన్నో అవమానాలు..

హీరోగా పాపులర్ అయిన తరువాత అక్కినేని చాలా అవమానాలు ఫేస్ చేశాడు. ఆయనకు తెలుగుతో పాటు తమిళంలో, శ్రీలంకలో కూడా అభిమానులు ఉండేవారు. విదేశాల నుంచి పిలుపులు వచ్చేవి. అక్కడ తెలుగులో మాట్లాడితే వారికి అర్ధం అయ్యేది కాదు. ఏఎన్నార్ కు ఇంగ్లీష్ రాదు. ఓసారి ఇంగ్లీష్ ను తెలుగులో రాయించుకుని మాట్లాడితే అందరు నవ్వారట. 

అవమానంగా మాట్లాడటంతో పాటు.. ఒక రకంగా చూసేవారట. దాంతో ఈ పాపులారిటీ ఎందుకు వచ్చింది నాకు.. ఇది రావడం వల్లే కదా.. ఇన్ని అవమానాలు అని బాధపడ్డారట ఏఎన్నారు. ఆ అవమానాలే పట్టుదలను పెంచి.. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే కసిని పెంచాయి అని.. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఏఎన్నార్ అన్నారు.

Related Articles

Related image1
బాలకృష్ణ తన భార్యతో ఏ విషయంలో తిట్లు తింటాడో తెలుసా? బాలయ్య చెప్పిన టాప్ సీక్రెట్?
Related image2
రామ్ చరణ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన బాలకృష్ణ, కవల పిల్లలు పుట్టినందుకు ఏం ఇచ్చాడంటే?
36
ఏఎన్నార్ ఏమన్నారంటే..?
Image Credit : IMDB

ఏఎన్నార్ ఏమన్నారంటే..?

హై స్కూల్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఫోర్త్ క్లాస్, వరకే చదివిన మీరు ఇంగ్లీష్ విషయం వచ్చేటప్పడికి అపారమైన పరిజ్ఞానం, ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలిగే శక్తి ఎట్లా సాధించుకోగలిగారు? అని అక్కినేని నాగేశ్వరావుకు ప్రశ్న ఎదురయ్యింది. అప్పుడు ఏఎన్నార్ మాట్లాడుతూ.. '' ఇదంతా ఒక బాధతో, ఛాలెంజ్ తో వచ్చింది అండి, ఐ హ్యాడ్ సో మెని ఇన్సల్ట్స్ ఇన్ మై లైఫ్, ఇంగ్లీష్ రాకపోవటం వల్ల ఒకటికి కాదు ఎన్నో అవమానాలు పడ్డాను. 

నాకు ఇంగ్లీష్ రాదు. తెలుగులో రాసిన ఇంగ్లీష్ ను ట్రాన్స్లేట్ చేసి ఇవ్వమ్మనా.. ఒకతను ట్రాన్స్లేట్ చేశాడు. కానీ ఆ ఫ్లో మిస్ అయ్యింది. నేను చవింది విని అక్కడ ఉన్నవారు నవ్వారు. ఇన్సల్ట్ చేశారు. దాంతో నాకు ఇంగ్లీష్ రాదు అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కదా, దానికి ఈ అవమానం కూడా తోడైంది. బాధ ఎక్కువైపోయింది.. ఏడ్చేశాను. 

వై ఈస్ దిస్ పాపులారిటీ, పాపులారిటీ రావటం మూలంగానే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళకి తెలిసిన భాషలో నేను మాట్లాడలేను. మరీ నాకు తెలిసిన భాష వాళ్లకు రాదు, వాళ్ళకి తెలియదు, అర్థంకాదు. అప్పట్నుంచే నాలో పట్టుదల పెరిగింది. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న తపన పెరిగింది.'' అని అన్నారు అక్కినేని.

46
నాగేశ్వరావుకు అద్భుతమైన సలహా ఇచ్చింది ఎవరు?
Image Credit : our own

నాగేశ్వరావుకు అద్భుతమైన సలహా ఇచ్చింది ఎవరు?

నాగేశ్వరావు మాట్లాడుతూ.. ఇంగ్లీష్ రావట్లేదని నేను బాధపడుతుంటే.. ఒకసారి బీఎన్ రెడ్డి గారు నాతో అన్నారు... నాగేశ్వరావు యూ హెవ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్... నీకెంతో భావిష్యత్తు ఉంది, నీవు మంచి యాక్టర్ అవుతున్నావు అయినప్పుడూ చాలా ఇబ్బంది పడతావు, నీకు ఇంగ్లీష్ రావడం లేదు. అందుకని ఒక పని చేయ్. టీచర్ ని పెట్టుకో అన్నారు. 

కానీ టీచర్ ని పెడతానికి నాకు టైమ్ లేదు.. ఉదయం వెళ్తే.. నైట్ అవుతుంది.. గ్యాప్ లేకుండా పనిచేస్తున్నాను.. కుదరదేమో అన్నాను. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. నువ్వు ఒక పని చేయి.. హిందూ పేపర్ కొను, ముందు కొన్నాళ్లు హెడింగ్స్ చదువు అన్నారు.

 ఖాళీగా ఉన్నప్పుడు ఓ 15 నిమిషాలు ఆ పనిచేయి… తరువాత సబ్ హెడ్డింగ్స్ చదువు.. ఆతరువాత రెండు మూడు లైన్స్ చదువు.. పక్కన ఉన్నవారితో చిన్న చిన్న పదాలు మాట్లాడు.. ఇంగ్లీష్ సినిమాలు చూడు.. అలా ఇంగ్లీష్ ను చాలా వరకూ నేర్చుకోవచ్చు అని సలహా ఇచ్చారు. నేను కూడా అదే ఫాలో అయ్యాను అని ఏఎన్నారో అన్నారు.

56
అమెరికాలో అక్కినేని ఇంగ్లీష్ స్పీచ్..
Image Credit : our own

అమెరికాలో అక్కినేని ఇంగ్లీష్ స్పీచ్..

ఏఎన్నార్ మాట్లాడుతూ.. "1964లో నాకు అమెరికా ప్రభుత్వం నుండి ఆహ్వానం వచ్చింది. నేను, శివాజీ గణేశన్ మంచి మిత్రులం, ఒరేయ్, ఒరేయ్ అని పిలుచుకుంటూ ఉంటాం. అంత దగ్గర మిత్రులం మేము. వాడు గతంలో అమెరికాకు ఇలాంటి పనిమీదే వెళ్లి వచ్చాడు. నాకు కూడా పిలుపు రాగానే నేను వాడిని అడిగాను. ఎలా నువ్వు అమెరికాలో మేనేజ్ చేసావురా అని.

ఇక వాడు ఒక ట్రాన్స్ లేటర్ ను తీసుకెళ్లాడు. ఆ విషయాన్నే నాకు చెప్పాడు. కానీ నాకు అలా తీసుకెళ్లడం నచ్చలేదు. ఎలాగైతే అలాగ అయ్యింది.. నేను మాత్రం ఆ పనిచేయకూడదు అనుకున్నాను. అమెరికా వెళ్లిన తరువాత అక్కడ ఓ అమెరికన్ కుటుంబంతో మాకు లంచ్ ఏర్పాటు చేశారు. నేను వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది దగ్గరుండి గమనించేవాడిని. 

ఆ తరువాత మేము మిచిగాన్ యూనివర్సిటీకి వెళ్ళాం. అక్కడ థియేటర్, టీవీ, నాటకాలు ఇలా వాటి గురించి మాట్లాడాలి. మాకు ఒక ట్రాన్స్ లేటర్ వున్నారు, కానీ నాకెందుకో.. ఇంగ్లీష్ లోనే మాట్లాడాలని అనిపించింది... ఏం ఆలోచించకుండా.. నాకు వచ్చిన ఇంగ్లీష్ లో మాట్లాడాను. నేను మాట్లాడాక అందరూ చప్పట్లు కొట్టి, బాగా మాట్లాడావ్ అని చెప్పారు. అది నా మొదటి ఇంగ్లీష్ స్పీచ్," అని నాగేశ్వర రావు చెప్పుకొచ్చారు.

66
ఎన్నో విదేశీ పర్యటనలు..
Image Credit : our own

ఎన్నో విదేశీ పర్యటనలు..

అమెరికా పర్యటన తరువాత ఏఎన్నార్ లో కాన్ఫిడెంట్ పెరిగిపోయింది.. పూర్తిగా ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చేసింది. ఆ పర్యటన వలన నేను ఎంతో నేర్చుకున్నాను అని నాగేశ్వర రావు స్వయంగా చెప్పారు. ఆతరువాత కాలంలో అక్కినేని ఒక్క అమెరికానే కాదు, అనేక దేశాలు పర్యటించారు. ఎన్నో దేశాల ప్రభుత్వాల ఆహ్వానం మేరకు నాగేశ్వర రావు చాలా సభల్లో పాల్గొన్నారు. అంతే కాదు చివరి శ్వాసవరకూ నటిస్తూనే ఉన్న నాగేశ్వారావు.. 2014 జనవరిలో క్యాన్సర్ తో కన్నుమూశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
బాలకృష్ణ తన భార్యతో ఏ విషయంలో తిట్లు తింటాడో తెలుసా? బాలయ్య చెప్పిన టాప్ సీక్రెట్?
Recommended image2
రామ్ చరణ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన బాలకృష్ణ, కవల పిల్లలు పుట్టినందుకు ఏం ఇచ్చాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved