MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijay Rashmika: దేశ వ్యాప్తంగా అన్నదానం, స్వీట్ల పంపిణి.. అభిమానులకు విజయ్‌ దేవరకొండ, రష్మిక సర్‌ప్రైజ్‌

Vijay Rashmika: దేశ వ్యాప్తంగా అన్నదానం, స్వీట్ల పంపిణి.. అభిమానులకు విజయ్‌ దేవరకొండ, రష్మిక సర్‌ప్రైజ్‌

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ఇటీవలే మ్యారేజ్‌ చేసుకున్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అభిమానులకు, ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. స్వీట్లు, అన్నదానం చేస్తున్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 01 2026, 08:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజులను తలపించేలా విజయ్‌ రష్మిక మ్యారేజ్‌
Image Credit : Asianet News

రాజులను తలపించేలా విజయ్‌ రష్మిక మ్యారేజ్‌

హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక మందన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ గురువారమే రాజస్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. రాజుల వివాహాన్ని తలపించేలా ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అతి కొద్ది మంది బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. మ్యారేజ్‌కి సంబంధించిన ఫోటోలను ఈ ఇద్దరు సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. వీరికి పెళ్లి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కొత్త పెళ్లి జంట ఇటీవలే హైదరాబాద్‌కి చేరుకున్నారు.

25
అభిమానులకు, ప్రజలకు విజయ్‌, రష్మిక రిటర్న్ గిఫ్ట్
Image Credit : Asianet News

అభిమానులకు, ప్రజలకు విజయ్‌, రష్మిక రిటర్న్ గిఫ్ట్

ఇప్పుడు రిసెప్షన్‌కి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. అలాగే విజయ్‌, రష్మిక బంధుమిత్రులు, స్నేహితులు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో దేశ ప్రజలకు విజయ్‌ దేవరకొండ, రష్మిక(విరోషి) జంట సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. వారి ప్రేమకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. స్వీట్లు పంచుతున్నారు.

Related Articles

Related image1
Samantha: నాగచైతన్య నుంచి విడిపోవడానికి సమంత ఎన్నికోట్ల భరణం తీసుకుందో తెలుసా? ఆమె గట్స్ కి సెల్యూట్‌ చేయాల్సిందే
Related image2
Renu Desai: రాత్రికి రేటెంతా అని అడుగుతున్నారు, ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ రేణు దేశాయ్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
35
దేశ వ్యాప్తంగా అన్నదానం చేస్తున్న రష్మిక విజయ్‌ జంట
Image Credit : Asianet News

దేశ వ్యాప్తంగా అన్నదానం చేస్తున్న రష్మిక విజయ్‌ జంట

నేడు మార్చి 1(ఆదివారం) ఈ అన్నదానం, స్వీట్ల పంపిణి చేస్తున్నట్టు తెలిపారు విజయ్‌, రష్మిక. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా తమ కృతజ్ఞతని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్వీట్ల రూపంలో తమ ప్రేమని పంచుతున్నట్టు తెలిపారు. స్వీట్లు, అన్నదానం పంపిణి చేసే లొకేషన్లు, టెంపుల్స్ వివరాలు వెల్లడించారు. ఇందులో తాము వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందించిన దేశ ప్రజలకు కృతజ్ఞత తెలిపారు.

45
స్వీట్లు పంపిణి, అన్నదానం చేసే ప్రాంతాలు ఇవే
Image Credit : Asianet News

స్వీట్లు పంపిణి, అన్నదానం చేసే ప్రాంతాలు ఇవే

వారిపై తమ ప్రేమను చూపించేందుకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని దేవాలయాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ చేస్తున్నట్లు విరోష్ ప్రకటించారు. ఈ రోజు తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, బిహార్ లోని పలు నగరాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ చేయనున్నారు. అన్నదానం టెంపుల్స్ లో నిర్వహిస్తున్నారు. ఆ వివరాలకు సంబంధించిన లిస్ట్ ని ఇందులో చూడొచ్చు.

❤️ pic.twitter.com/7193UPPhBh

— Vijay Deverakonda (@TheDeverakonda) February 28, 2026

55
`గీత గోవిందం`తో ప్రారంభమైన విజయ్‌, రష్మిక జర్నీ
Image Credit : Instagram

`గీత గోవిందం`తో ప్రారంభమైన విజయ్‌, రష్మిక జర్నీ

ఈ ప్రకటనలో విరోష్ స్పందిస్తూ , మా జీవిత ప్రయాణంలో ఈ దేశ ప్రజలందరూ ఒక భాగమే. మా వివాహం సందర్భంగా మీరంతా చూపించిన ప్రేమకు, అందించిన ఆశీస్సులకు కృతజ్ఞతలు. ఈ సంతోషమైన సందర్భాన్ని మీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు మీ అందరికీ స్వీట్స్ పంపిస్తున్నాము. వివిధ నగరాల్లోని దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీ ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలి` అని కోరుకున్నారు. విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న `గీత గోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రాల్లో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఏడేళ్ల ప్రేమ అనంతరం ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు `రణబాలి`లో ఈ ఇద్దరు కలిసి నటిస్తుండటం విశేషం. అయితే ఇలా ఓ సెలబ్రిటీ జంట ఈ విధంగా ప్రజలకు, అభిమానులకు స్వీట్లు పంచడం, అన్నదానం చేయడం చాలా అరుదు. ఈ విషయంలో విరోషి జంట గొప్ప హృదయానికి ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Renu Desai: రాత్రికి రేటెంతా అని అడుగుతున్నారు, ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ రేణు దేశాయ్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Recommended image2
నిర్మాతలది మామూలు ధైర్యం కాదు, మెగా హీరో మూవీ క్లైమాక్స్ కోసం 20 కోట్ల బడ్జెట్.. మహాభారతాన్ని తలపించేలా
Recommended image3
Toxic Movie: యశ్‌తో కియారా రొమాంటిక్ ఫోజు.. ఫన్నీ కామెంట్లతో ఆడుకుంటున్న నెటిజన్లు
Related Stories
Recommended image1
Samantha: నాగచైతన్య నుంచి విడిపోవడానికి సమంత ఎన్నికోట్ల భరణం తీసుకుందో తెలుసా? ఆమె గట్స్ కి సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Renu Desai: రాత్రికి రేటెంతా అని అడుగుతున్నారు, ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ రేణు దేశాయ్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved