MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Gossips
  • రామ్ చరణ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన బాలకృష్ణ, కవల పిల్లలు పుట్టినందుకు ఏం ఇచ్చాడంటే?

రామ్ చరణ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన బాలకృష్ణ, కవల పిల్లలు పుట్టినందుకు ఏం ఇచ్చాడంటే?

రీసెంట్ గా కవల పిల్లలకు జన్మనిచ్చారు రామ్ చరణ్, ఉపాసన. మెగా అభిమానులతో పాటు.. ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు వారిని విష్ చేస్తున్నారు. ఈక్రమంలో నందమూరి నట సింహం బాలయ్యబాబు కూడా రామ్ చరణ్ కోసం స్సెషల్ గిఫ్ట్ పంపించాడట. ఇంతకీ ఏంటది?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 05 2026, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కవల పిల్లలకు తండ్రైన రామ్ చరణ్..
Image Credit : Ram charan Konidela/Instagram

కవల పిల్లలకు తండ్రైన రామ్ చరణ్..

మెగా ఫ్యామిలీలో ఇప్పటి వరకూ ఆడపిల్లలే పుడుతూ వచ్చారు. మా ఇంట్లో అందరు మహాలక్ష్ములే ఉన్నారని మెగాస్టార్ సంబరపడిపోతుంటారు. కానీ ఒక్క వారసుడు కావాలని చిరంజీవి పలు సందర్భాల్లో తన కోరిక వెల్లడించారు. ఇక ఎట్టకేలకు ఆయన ఆశ నెరవేరింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు రీసెంట్ గా కవలపిల్లలు పుట్టగా.. అందులో ఒకరు మగపిల్లాడు, ఒక ఆడపిల్ల పుట్టారు. చరణ్ దంపతులకు రెండేళ్ల క్రితం ఒక ఆడపిల్ల పుట్టగా.. ఆమెకు క్లింకారా అని నామకరణం కూడా చేశారు. ఇక మెగా వారసుడి రాకతో ఇటు ఫ్యామిలీలో, అటు అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

25
రామ్ చరణ్ కు శుభాకాంక్షల వెల్లువ..
Image Credit : Unstoppable

రామ్ చరణ్ కు శుభాకాంక్షల వెల్లువ..

కవల పిల్లలు పుట్టడంతో రామ్ చరణ్ కు వరుసగా శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ఇటు అభిమానులు, అటు ఇండస్ట్రీ స్నేహితులు.. అందరు వరుసగా మెగా హీరోను విష్ చేశారు చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే సోషల్ మీడియాలో చరణ్ ను విష్ చేశారు. పర్సనల్ గా కూడా ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో నందమూరి నట సింహం బాలకృష్ణ కూడా రామ్ చరణ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. స్పెషల్ గిఫ్ట్ పంపించాడట. ఇంతకీ ఆయన ప్రత్యేకంగా ఏం భహుమతి పంపించాడటంటే.?

Related Articles

Related image1
బాలకృష్ణ తన భార్యతో ఏ విషయంలో తిట్లు తింటాడో తెలుసా? బాలయ్య చెప్పిన టాప్ సీక్రెట్?
Related image2
అల్లు అర్జున్ కి షాక్.. నెట్‌ఫ్లిక్స్‌లో ధురంధర్ దుమారం, పుష్ప 2, యానిమల్ సినిమాలను దాటి నెం.1 స్థానం
35
రామ్ చరణ్ కు బాలయ్య స్పెషల్ గిఫ్ట్. .
Image Credit : our own

రామ్ చరణ్ కు బాలయ్య స్పెషల్ గిఫ్ట్. .

రామ్ చరణ్ కి కవల పిల్లలు పుట్టిన సందర్భంగా బాలయ్య ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఓ పూల బొకేను పంపించాడట. దానితో పాటు తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ఫోటో, ప్రసాదం కూడా పంపించాడట. అంతే కాదు పిల్లలకు స్పెషల్ గా టాయ్స్ కూడా పంపించినట్టు టాలీవుడ్ లో టాక్ గట్టిగానడుస్తోంది. ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కానీ.. ఈ విషయంపై మెగా, నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. బాలయ్య కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారట రామ్ చరణ్ అభిమానులు.

45
చిరు బాలయ్య కోల్డ్ వార్.. ?
Image Credit : Asianet News

చిరు బాలయ్య కోల్డ్ వార్.. ?

బాలకృష్ణ, చిరంజీవి మధ్య బాక్సాఫీస్ వార్ జరుతుంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. సినిమాల విషయంలోనే కాదు వ్యక్తిగతంగా కూడా కూడా ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్డ్ నడుస్తుంటుంది. లాస్ట్ ఇయర్ బాలయ్య అసెంబ్లీలో చేసిన కామెంట్స్ రచ్చ రచ్చ అయ్యాయి. చిరంజీవి ని అవమానించాడని.. మెగా అభిమానులు రెచ్చిపోయారు. ఈ ఇద్దరు ఎక్కడైనా కలిస్తే మాత్రం చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటుంటారు. చిరంజీవి తో బాలయ్య రిలేషన్ ఎలా ఉన్నా... రామ్ చరణ్ తో మాత్రం బాలయ్య కు మంచి స్నేహం ఉంది. వీరు కలిసినప్పుడల్లా కడుపుబ్బా నవ్వుకుంటుంటారు. బాలయ్య పట్ల రామ్ చరణ్ చూపించే గౌరవం.. బాలయ్య రామ్ చరణ్ పట్ల చూపించే ప్రేమ అందరికి తెలుసు?

55
మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం..
Image Credit : Asianet News

మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం..

రామ్ చరణ్ కు మొదటి సంతానం కలిగిన టైమ్ లోనే.. ఆర్ఆర్ఆర్ ప్రపంచ స్థాయిలో అవార్డులు సాధించింది. ఆస్కార్ కూడా వచ్చింది. అంతే కాదు చరణ్ కు ఎన్నో గౌరవాలు కూడా దక్కాయి.. ఇక రీసెంట్ గా కవలలు పుట్టిన టైమ్ లోనే మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. పిల్లల రాకతో చిరంజీవి ఫ్యామిలీలో అన్నీ శుభాలే జరుగుతున్నాయి. వరుసగా రెండు ఫెయిల్యూర్స్ చూసిన రామ్ చరణ్ కు పెద్ది సినిమాతో హిట్ పడుతుందో లేదో చూడాలి. పెద్ది సినిమాపై రామ్ చరణ్ తో పాటు అభిమాను కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Kona Venkat: పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చినా కాదన్న కోన వెంకట్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు
Recommended image2
Vijay - Rashmika: విజయ్-రష్మిక పెళ్లి ఖర్చు ఇన్ని కోట్లా.? వెడ్డింగ్ లెక్కలు తెలిస్తే కళ్లు తేలేస్తారు
Recommended image3
Shakeela: ఓ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో పడుకున్న షకీలా.! అలా చేస్తాడని అస్సలు అనుకోలేదట: షకీలా
Related Stories
Recommended image1
బాలకృష్ణ తన భార్యతో ఏ విషయంలో తిట్లు తింటాడో తెలుసా? బాలయ్య చెప్పిన టాప్ సీక్రెట్?
Recommended image2
అల్లు అర్జున్ కి షాక్.. నెట్‌ఫ్లిక్స్‌లో ధురంధర్ దుమారం, పుష్ప 2, యానిమల్ సినిమాలను దాటి నెం.1 స్థానం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved