సంపూర్ణేష్ బాబు ఎక్కడా..? ఇండస్ట్రీకి దూరం అయ్యాడా..? సినిమాలు ఎందుకు చేయడంలేదు..?
సంపూర్ణేష్ బాబు గుర్తున్నాడా... ఆయన గత కొంత కాలంగా ఇండస్ట్రీలో కనిపించడంలేదు.. కారణంఏంటి..? బర్నింగ్ స్టార్ కు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన ఎందుకు ఇండస్ట్రీలో కనిపించడంలేదు...?
Sampoornesh babu
ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు రావాలంటే వారసులై ఉంటే సరిపోదు... ఏదో ఒక డిఫరెంట్ టాలెంట్ ఉండాలి.. దానికి అదృష్టం తోడు అవ్వాలి. అలా అదృష్టం లేక స్టార్ వారసులు కూడా వెనబడుతున్నారు. కాని కొంత మంది మాత్రం ఓవర్ నైట్ స్టార్లు అవుతున్నారు. అదృష్టం గురించి నటుడు కోటా శ్రీనివాసరావు అన్నట్టు.. కొండంత టాలెంట్ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం ఉంటేనే ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్లుగా మారుతారు అని..ఈ కోవలోకే వస్తాడు కమెడీయన్ కమ్ హీరో సంపూర్ణేష్ బాబు.
Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్,
Sampoornesh babu
టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. స్టార్ కామెడీయన్లు కూడా ఉన్నారు. అయితే వారందరిలో తనలోకొత్తదనం చూపించాడు కాబట్టే..మంచి క్రేజ్ తెచ్చుకోగలిగాడు సంపూర్ణేష్ బాబు. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. హృదయకాలేయం సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు సంపూ. అంతే కాదు బర్నింగ్ స్టార్ అన్న బిరుదు కూడా సంపాధించుకున్నాడు సంపూర్ణేష్.
Also Read: రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్, డేంజర్ లో గేమ్ ఛేంజర్, రంగంలోకి మెగాస్టార్..?
Sampoornesh babu
అప్పట్లో వరుస సినిమాలు చేసిన సంపూ.. ఈమధ్య కాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సంపూర్ణేష్ బాబు సినిమాలకు దూరం కావడంతో ఈయన గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.సంపూర్ణేష్ బాబు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడం ఇష్టం లేక కొందరు ఆయనపై కుట్రలు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. లేదు ఆయనకు అనారోగ్య కారణాల వల్ల ఇంటికే పరిమితం అవుతున్నాడని మరో మాట వినిపిస్తుంది.
Also Read: ఎమ్మెస్ నారాయణను మోసం చేసిన ఫిల్మ్ ఇండస్ట్రీ, మరణం తరువాత తప్పని అవమానం.?
Sampoornesh babu
సంపూర్ణేష్ బాబు సినిమాలు చేయడం లేదు... అటు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కనిపించడం లేదు. దీంతో చాలామంది మీడియా మిత్రులు.. యూట్యబ్ ఛానల్స్ కొన్ని ఆయన్ను వెతకడం స్టార్ట్ చేశాయి. ఇక సంపూర్ణేష్ బాబు ఇండస్ట్రీని వదిలేయలేదు. ఆయన చివరిసారిగా మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో కనిపించారు. మరి ఇప్పుడు ఎందుకు ఫామ్ లో లేరు.
Also Read: ఇండియాలో చెత్త సినిమా, మరీ ఇంత డిజాస్టర్స్ రికార్డ్ సోంతం చేసుకున్న సినిమా ఇదే..?
సంపూకి ఆరోగ్యం బాగోలేదని.. ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అందుకే ఎలాంటి సినిమాలలో నటించలేదు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో అసలు ఏం జరుగుతుంది తన కెరీర్ లో.. అని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు కూడా వినిపించాయి. మార్టిన్ లూథర్ కింగ్ సినిమా తరువాత ఆయన మళ్లీ ఎక్కడ కనిపించడం లేదు.
అయితే ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. సంపూర్ణేష్ బాబు రెండు సినిమాలో నటించాడట. ఈ సినిమాలు రిలీజ్ కు కొంత సమయం ఉండటంతో ఖాళీగా ఉండడం ఇష్టం లేక.. తన సొంత ఊరిలో తన కుల వృత్తి అయిన గోల్డ్ వర్క్ ను చేసుకుంటున్నాడని తెలుస్తోంది.
ఇక తన కామెడీ పెర్ఫామెన్స్ లతో.. సినిమాల స్పూఫ్ లు.. హీరోలను ఇండైరెక్ట్ గా ఇమిటేట్ చేస్తూ.. బర్నింగ్ స్టార్ ఇమేజ్ ను సాధించాడు సంపూ. బిగ్ బాస్ లో అవకాశం వచ్చినా.. అక్కడ ఉండలేక బయటకు వచ్చేశాడు. అంతే కాదు ఇండస్ట్రీకి కాని... తెలుగు రాష్ట్రాలకు కాని ఏదైన ఉపద్రవం వస్తే.. వెంటనే తనవంతు ఉడతసాయంగా లక్షనో రెండు లక్షలో ప్రకటించడం ఆయనకు అలవాటు. ఇలా ప్రజట మనసుల్లో మంచి పేరు సంపాదించిన సంపూర్ణేష్ బాబు.. మళ్లీ బిజీ అవ్వాలి అంటున్నారు ఫ్యాన్స్.