ఎమ్మెస్ నారాయణను మోసం చేసిన ఫిల్మ్ ఇండస్ట్రీ, మరణం తరువాత తప్పని అవమానం.?
దివంగత స్టార్ కామెడియన్ ఎమ్మెస్ నారాయణను ఫిల్మ్ ఇండస్ట్రీ మోసం చేసిందా..? మరణం తరువాత కూడా అన్యాయం చేసిందా..? ఎమ్మెస్ కు జరిగిన అవమానం ఏంటి..? ఆయన తనయుడు విక్రమ్ ఏమన్నారంటే..?
తెలుగువారు మర్చిపోలేని కమెడియన్ ఎమ్మెస్ నారాయణ.. కడుపుబ్బా నవ్వులు పంచుతూనే.. సడెన్ గా విషాదాన్నినింపి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు ఎమ్మెస్ నారాయణ. ఆయన మరణంతో ఎంతో గొప్ప కమెడియన్ ను టాలీవుడ్ కోల్పోయింది.
ఆయన మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులను కడుపు చెక్కలయ్యేలా నవ్వించే ధర్మవరపు సుబ్రహ్మణ్య, కొండవలస, ఏవీఎస్, వేణుమాధవ్, లక్ష్మీపతి, మల్లిఖార్జున రావు, ఇలా చాలా మంది స్టార్ కమెడియన్లు ఒకరి తరువాత మరొకరు వరుసగా కన్ను మూశారు.
దాంతో టాలీవుడ్ లో ఒక రకంగా కమెడియన్లకు కరువు వచ్చిందని చెప్పవచ్చు. అయితే అందరిమాట ఏమో కాని.. ఎమ్మెస్ నారాయణకు మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అన్యాయం జరిగిందంటున్నారు ఆయన తనయుడు విక్రమ్. కమెడియన్ గా కెరీర్ పీక్ లో ఉండగానే అనారోగ్యం వెంటాడింది ఎమ్మెస్ ను .. దాంతో 2015 లో ఆయన కన్నుమూశాడు. ఆయన చనిపోయిన తర్వాత కొడుకు విక్రమ్ నారాయణ ఎన్నో కష్టాలుపడ్డారట.
ఎమ్మెస్ బ్రతికుండగా.. తన తనయుడిని కూడా ఇండస్ట్రీలో నిలబెట్టాలని చూశారు. ఎమ్మెస్ స్వయంగా డైరెక్ట్ చేస్తూ.. విక్రమ్ ను హీరోగా పెట్టి.. కొడుకు సినిమాను తెరకెక్కించాడు. కాని ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఆతరువాత కూడా కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేశారు. కాని ఏవి వర్కౌట్ అవ్వలేదు. ఇక ఆతరువాత తండ్రి మరణం విక్రమ్ ను మరిన్ని కష్టాల్లొకి నెట్టింది. ఈ విషయాలను ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొని ఎంతో బాధపడ్డాడు విక్రమ్. ఎమ్మెస్ నారాయణను ఇండస్ట్రీలో చాలామంది మోసం చేశారట.
మరీ ముఖ్యంగా ఎమ్మెస్ చేసిన సినిమాల డబ్బులు కూడా ఇవ్వలేదట. ఈస్టార్ కమెడియన్ చనిపోయే ముందు 30 సినిమాలు చేశారట. అయితే ఈ సినిమాలకు ఆయనకు కంప్లీట్ గా డబ్బులు ఇవ్వలేదట. ఆయన చనిపోయాక ఈ సినిమాలన్ని రిలీజ్ అయ్యాయట. అయితే ఆ సినిమాలకు సంబంధించిన రెమ్యూనరేషన్స్ కోసం విక్రమ్ చాలా కష్టపడ్డాడట. స్టూడియోల చుట్టూ తిరిగి ఆయన తండ్రిగారికి రావాల్సిన రెమ్యూనరేషన్స్ ని దక్కించుకున్నాడట.
ఎంత కష్టపడినా కూడా వాటిలో 60 శాంతం కంటే ఎక్కువ రాబట్టలేకపోయారట. అలా తన తండ్రికి మోసం చేయాలని చూశారంటూ.. బాధపడ్డారు విక్రమ్. అంతే కాదు తన తండ్రి కష్టం వృధా పోకూడదు అనే ఉద్దేశ్యంతోనే.. ఆ డబ్బులు వసూలు చేశాను కాని.. డబ్బుపై ఆశతో కాదు అన్నారు విక్రమ్. ఇక ఎమ్మెస్ మరణం తరువాత విక్రమ్ కు అవకాశాలు రాలేదు. సినిమాలు చేద్దామనకున్నా.. ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు.
దాంతో తను చదివిన లా ను జీవనాధారం చేసుకుని.. ప్రాక్టీస్ చేస్తున్నాడట. విక్రమ్. తనకు ఇప్పటికీ సినిమాలు చేయాలని ఉంది. ఎవరైనా అవకాశం ఇస్తే.. ఏ పాత్రకైనా నేను రెడీ అంటున్నాడు విక్రమ్. ఇక టాలీవుడ్ లో లెజండరీ కమెడియన్స్ లిస్ట్ తీస్తే అందులో ఏం ఎస్ నారాయణ పేరు కచ్చితంగా ఉంటుంది. ఎమ్మెస్ కామెడీ టైమింగ్ మూములుగా ఉండదు.
ఒక లెక్చరర్ అయ్యుండి.. సినిమాల వైపు ఆకర్షితుడై.. నాటకాలు ఆడటం ప్రారంభించాడు ఎమ్మెస్. గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత నాటకాలకు స్క్రిప్ట్స్ ని అందిస్తూ, అలా సినీ రంగంలోకి రచయితగా అడుగుపెట్టి, 1994 వ సంవత్సరం లో మోహన్ బాబు హీరో గా నటించిన ‘ఏం ధర్మరాజు MA’ చిత్రం తో తొలిసారి నటుడిగా వెండితెర మీద కనిపించాడు. ఆ సినిమాలో ఆయన పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం తో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.