- Home
- Entertainment
- గేమ్ ఛేంజర్ లాంటి అనుభవం చిరంజీవికి కూడా తప్పలేదు..మెగాస్టార్ టైం, కష్టం మొత్తం వృథా చేసిన మూవీ ఏంటో తెలుసా
గేమ్ ఛేంజర్ లాంటి అనుభవం చిరంజీవికి కూడా తప్పలేదు..మెగాస్టార్ టైం, కష్టం మొత్తం వృథా చేసిన మూవీ ఏంటో తెలుసా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించిన వివాదం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి అనుభవమే ఓ చిత్రంతో ఎదురైంది.

గేమ్ ఛేంజర్ మూవీ వివాదం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించిన వివాదం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. దిల్ రాజు సోదరుడు నిర్మాత శిరీష్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.గేమ్ ఛేంజర్ మూవీ ఫ్లాప్ తర్వాత తాము ఎలా ఉన్నామో తెలుసుకునేందుకు రామ్ చరణ్ కానీ శంకర్ కానీ కనీసం ఫోన్ చేయలేదు అంటూ శిరీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
చరణ్ ఫ్యాన్స్ ఫైర్
ఆయన చేసిన వ్యాఖ్యలు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీనితో శిరీష్ రెడ్డి దిగివచ్చి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. నిర్మాణ సంస్థ కంట్రోల్ లేకుండా, భారీ చిత్రాన్ని గాలికి వదిలేశారు. అలాంటప్పుడు ఆ చిత్రం ఫ్లాప్ కి హీరో ఎలా కారణమవుతారు అంటూ రామ్ చరణ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్ర పరాజయానికి కారణం శంకర్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కారణమని అంటున్నారు. రామ్ చరణ్ మాత్రం ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా చిత్రం తర్వాత ఈ మూవీ కోసం తన నాలుగేళ్ల విలువైన సమయాన్ని వృథా చేసుకున్నారని ఫ్యాన్స్ అంటున్నారు.
చిరంజీవికి కూడా తప్పలేదు
రామ్ చరణ్ ఈ మూవీతో ఎంత కష్టపడ్డప్పటికీ ఫలితం దక్కలేదు. పైగా ఈ చిత్రం అనేక వివాదాలు కారణమవుతోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి అనుభవమే ఓ చిత్రంతో ఎదురైంది. ఏళ్ల తరబడి చిరంజీవి ఆ చిత్రం కోసం కష్టపడ్డప్పటికీ సరైన ఫలితం దక్కలేదు. ఆ మూవీ మరేదో కాదు.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో, శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన అంజి చిత్రం.
అంజి చిత్రానికి ఆరేళ్ళ సమయం
అంజి చిత్ర షూటింగ్ వివిధ సమస్యల కారణంగా ఆలస్యం అవుతూ ఆరేళ్లపాటు కొనసాగింది. చిరంజీవితో భారీ స్థాయిలో గ్రాఫిక్స్ ఉండే సినిమా చేయాలని శ్యాంప్రసాద్ రెడ్డి అనుకున్నారు. ఆయన కోరిక మేరకు కోడి రామకృష్ణ అంజి కథ రెడీ చేశారు. కానీ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ అంత సులభంగా పూర్తి కాలేదు. అనేక సమస్యల మధ్య ఆరేళ్ల సమయం పట్టింది. మూవీలో క్లైమాక్స్ సన్నివేశాల కోసం చిరంజీవి దాదాపు రెండేళ్ల పాటు ఒకే చొక్కా ఒకే తరహా కాస్ట్యూమ్స్ ధరించారట.
నిరాశ పరిచిన అంజి
అంత కష్టపడ్డప్పటికీ ఈ మూవీ అంచనాలను ని అందుకో లేకపోయింది. ఈ మూవీలో నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. నాగబాబు కీలక పాత్రలో నటించారు. టిల్లు ఆనంద్ విలన్ గా నటించారు.