- Home
- Entertainment
- అడ్వాన్స్ అందిన తర్వాత కూడా రాజశేఖర్, మోహన్ బాబు చేజారిన సూపర్ హిట్ మల్టీస్టారర్.. ఆ మూవీ ఎవరు చేశారంటే
అడ్వాన్స్ అందిన తర్వాత కూడా రాజశేఖర్, మోహన్ బాబు చేజారిన సూపర్ హిట్ మల్టీస్టారర్.. ఆ మూవీ ఎవరు చేశారంటే
గతంలో యాంగ్రీ హీరో రాజశేఖర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించాల్సింది. కానీ ఆ చిత్రం వారి చేజారింది. ఈ విషయాన్ని దర్శకుడు మోహన్ రాజా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.

గతంలో టాలీవుడ్ లో అనేక మల్టీస్టారర్ చిత్రాలు వచ్చేవి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి అగ్ర హీరోలు అనేక మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. వీరి హయాం తర్వాత మల్టీస్టారర్ చిత్రాలు నెమ్మదిగా తగ్గుతూ వచ్చాయి. గతంలో యాంగ్రీ హీరో రాజశేఖర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించాల్సింది.
కానీ ఆ చిత్రం వారి చేజారింది. ఈ విషయాన్ని దర్శకుడు మోహన్ రాజా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే 'హనుమాన్ జంక్షన్'. ఎడిటర్, నిర్మాత అయిన మోహన్ తనయుడే ఈ మోహన్ రాజా. మలయాళం లో సూపర్ హిట్ అయిన తెంకాసిపట్టణం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. ఎడిటర్ మోహన్ ఈ చిత్రానికి నిర్మాత. తన కొడుకు మోహన్ రాజాని దర్శకుడుగా పరిచయం చేయాలనుకున్నారు.
ముందుగా మోహన్ రాజా ఈ చిత్ర కథని రాజశేఖర్, మోహన్ బాబుకి వినిపించారు. వీళ్ళిద్దరూ స్టార్ హీరోలు. అయితే తన కొడుకు తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇంత పెద్ద హీరోలని హ్యాండిల్ చేయగలడా అనే అనుమానం ఎడిటర్ మోహన్ కి కలిగిందట. అప్పటికే రాజశేఖర్, మోహన్ బాబు ఇద్దరికీ అడ్వాన్స్ ఇచ్చేసి ఉన్నారు.
అయినప్పటికీ వాళ్ళిద్దరితో ఈ చిత్రం వద్దని ఎడిటర్ మోహన్ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఎవరైతే బాగుంటుంది అని ఆలోచిస్తుండగా చివరికి జగపతిబాబు, అర్జున్ ఇద్దరూ ఈ చిత్రానికి పర్ఫెక్ట్ ఛాయిస్ అని భావించారు. మరో హీరో పాత్రలో వేణుని ఎంచుకున్నారు. ఆ విధంగా జగపతిబాబు, అర్జున్, వేణు కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో వేణు, ఎల్బీ శ్రీరామ్ ఇద్దరూ చేసిన ఆవు కామెడీ సన్నివేశం ఈ చిత్రానికే హైలైట్ గా నిలిచింది.
2001లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో స్నేహ, లయ, విజయలక్ష్మి హీరోయిన్లుగా నటించారు. ఆ విధంగా రాజశేఖర్, మోహన్ బాబు చేయాల్సిన హనుమాన్ జంక్షన్ చిత్రం జగపతిబాబు, అర్జున్ చేతుల్లోకి వెళ్లింది.