MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాపీ చేసే దర్శకులకే ప్రాధాన్యత, త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ కామెంట్స్.. హరిహర వీరమల్లుపై పరోక్షంగా సెటైర్లు

కాపీ చేసే దర్శకులకే ప్రాధాన్యత, త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ కామెంట్స్.. హరిహర వీరమల్లుపై పరోక్షంగా సెటైర్లు

గతంలో హీరోయిన్ గా రాణించిన పూనమ్ కౌర్ ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది. అయితే ఆమె తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 03 2025, 07:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తున్న పూనమ్ కౌర్
Image Credit : Instagram

త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తున్న పూనమ్ కౌర్

నటి పూనమ్ కౌర్ గురించి పరిచయం అవసరం లేదు. గతంలో హీరోయిన్ గా రాణించిన పూనమ్ కౌర్ ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది. అయితే ఆమె తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. అందుకు కారణం పూనమ్ కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై వరుస ట్వీట్లు చేస్తూ విమర్శలు గుప్పించడమే. కానీ ఆమె విమర్శలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడూ ఎక్కడా స్పందించలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హరిహర వీరమల్లుపై సెటైర్లు
Image Credit : Instagram

హరిహర వీరమల్లుపై సెటైర్లు

కొన్నేళ్లుగా పూనమ్ కౌర్ ఇలా త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా పూనమ్ కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, అదే విధంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాలపై పరోక్షంగా సెటైర్లు వేస్తూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Related Articles

Related image1
రాసిపెట్టుకోండి రంగస్థలం, RRR ని మించేలా 'పెద్ది' .. గేమ్ ఛేంజర్ వివాదం నేపథ్యంలో రామ్ చరణ్ కామెంట్స్ వైరల్
Related image2
అడ్వాన్స్ అందిన తర్వాత కూడా రాజశేఖర్, మోహన్ బాబు చేజారిన సూపర్ హిట్ మల్టీస్టారర్.. ఆ మూవీ ఎవరు చేశారంటే
35
అలాంటి వారికే సక్సెస్, గుర్తింపు
Image Credit : X

అలాంటి వారికే సక్సెస్, గుర్తింపు

పూనమ్ కౌర్ తన ట్విట్టర్ అకౌంట్ లో.. దర్శకుడు క్రిష్ ఒరిజినల్ కంటెంట్, బలమైన స్క్రిప్ట్ లు కలిగి ఉన్న దర్శకుడు. కానీ అలాంటి దర్శకుడికి సరైన గుర్తింపు లభించడం లేదు. పిఆర్ స్టంట్స్ చేస్తూ అనేక కాపీ రైట్ వివాదాల్లో చిక్కుకున్న దర్శకుడికి మాత్రం గుర్తింపు, విజయాలు దక్కుతున్నాయి అంటూ పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనమ్ కౌర్ సెటైర్లు వేసింది.

45
ట్రైలర్ ఫైనల్ కట్ వీక్షించిన పవన్
Image Credit : Instagram

ట్రైలర్ ఫైనల్ కట్ వీక్షించిన పవన్

పూనమ్ కౌర్ ఈ ట్విట్ చేయడానికి కారణం హరిహర వీరమల్లు మూవీనే అని నెటిజన్లు భావిస్తున్నారు. సరిగ్గా హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కి ముందు పూనమ్ కౌర్ ఈ ట్వీట్ చేయడం విశేషం. హరిహర వీరమల్లు చిత్రానికి దర్శకుడు కృష్ణ జాగర్లమూడి. కొంత భాగం షూటింగ్ తర్వాత క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఏ ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు.

55
హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ తో త్రివిక్రమ్
Image Credit : Instagram

హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ తో త్రివిక్రమ్

హరిహర వీరమల్లు ట్రైలర్ నేడు గురువారం రోజు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ట్రైలర్ ఫైనల్ కట్ రెడీ అయిన తర్వాత చిత్ర యూనిట్, అదే విధంగా తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి వీక్షించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే పూనమ్ ట్వీట్ చేసింది. ఈ చిత్ర దర్శకుడైన క్రిష్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా, త్రివిక్రమ్ కి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఉద్దేశంతో పూనమ్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Lenin Trailer Review: సాలిడ్‌ కంటెంట్‌తో వస్తోన్న అఖిల్‌, ఫస్ట్ హిట్‌ పక్కా.. ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Akhil Raj: అమ్మను తిడితే ఊరుకోవాలా? డెలివరీ బాయ్ వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో..
Recommended image3
Yash Next Movie: టాక్సిక్‌ని పక్కన పెట్టిన యశ్‌.. నెక్ట్స్ మూవీ ఇదే, స్టోరీ లీక్.. సెన్సేషనల్‌ హీరోయిన్‌
Related Stories
Recommended image1
రాసిపెట్టుకోండి రంగస్థలం, RRR ని మించేలా 'పెద్ది' .. గేమ్ ఛేంజర్ వివాదం నేపథ్యంలో రామ్ చరణ్ కామెంట్స్ వైరల్
Recommended image2
అడ్వాన్స్ అందిన తర్వాత కూడా రాజశేఖర్, మోహన్ బాబు చేజారిన సూపర్ హిట్ మల్టీస్టారర్.. ఆ మూవీ ఎవరు చేశారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved