MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vishwanath And Sons Twitter Review: థియేటర్లలో కన్నీళ్లు పెట్టిస్తున్న సూర్య.. విశ్వనాథ్ అండ్ సన్స్ పబ్లిక్ టాక్

Vishwanath And Sons Twitter Review: థియేటర్లలో కన్నీళ్లు పెట్టిస్తున్న సూర్య.. విశ్వనాథ్ అండ్ సన్స్ పబ్లిక్ టాక్

Vishwanath And Sons Twitter Review : సూర్య, మమితా బైజులు నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' థియేటర్లలోకి వచ్చేసింది. మొదటి భాగం ఫన్, క్లైమాక్స్ ఎమోషనల్ అంటూ ఎక్స్ లో ఆడియన్స్ పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. సూర్య ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 14 2026, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూర్య, మమితా బైజు మ్యాజిక్.. థియేటర్లలో అదరగొడుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్
Image Credit : X/Suriya_offl

సూర్య, మమితా బైజు మ్యాజిక్.. థియేటర్లలో అదరగొడుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్

వర్సటైల్ యాక్టర్ సూర్య, గ్లామరస్ బ్యూటీ మమితా బైజు కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే థియేటర్లలోకి అడుగుపెట్టింది. ఇక ప్రీమియర్స్, మార్నింగ్ షో చూసిన జనాలు ఎక్స్ (ట్విట్టర్) లో తమ రివ్యూలను షేర్ చేసుకుంటున్నారు. ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమాకు ఎక్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఫ్యామిలీ డ్రామా, హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో వెంకీ అట్లూరి మళ్లీ తన మార్క్ చూపించారని ఆడియన్స్ చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్రీజీ అండ్ ఎంజాయబుల్ ఫస్ట్ హాఫ్.. సూర్య నటన నెక్స్ట్ లెవెల్
Image Credit : Asianet News

బ్రీజీ అండ్ ఎంజాయబుల్ ఫస్ట్ హాఫ్.. సూర్య నటన నెక్స్ట్ లెవెల్

సినిమా ఫస్ట్ హాఫ్ చాలా కూల్‌గా, ఫన్‌గా సాగిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా స్టార్ట్ అయిన మొదటి 20 నిమిషాలు కథ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా, ఆ తర్వాత మంచి పేస్ అందుకుంది. హాస్పిటల్ సీక్వెన్స్, ట్రిప్ కామెడీ, హోటల్ ఫైట్ సీన్లకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఇందులో సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య ప్రాణం పోశారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

గజినీలోని సంజయ్ రామస్వామి పాత్ర ఎంత ఐకానిక్‌గా ఉందో, ఈ సంజయ్ విశ్వనాథ్ రోల్ కూడా అంతే రేంజ్‌లో ఉందంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ పాత్రను సూర్య దాటేసారని కొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రాధిక, మమితా బైజు, సూర్య మధ్య ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా నేచురల్‌గా వర్కవుట్ అయ్యాయి. మమితా బైజు లుక్స్ ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండి క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని చెబుతున్నారు.

Related Articles

Related image1
Maoists Fashion Show: వారెవ్వా అదరగొట్టారు.. నిన్నటిదాకా తుపాకీ పట్టిన చేతులతోనే ఇప్పుడు ఫ్యాషన్ షో !
Related image2
Viral Post: నాకు మొగుడు కావాలంటే ఈ 11 రూల్స్ పాస్ అవ్వాల్సిందే.. షాకింగ్ వైరల్ పోస్ట్ !
35
వెంకీ అట్లూరి ఎమోషనల్ మేజిక్.. క్లాసిక్ సినిమాల రేంజ్ సెంటిమెంట్
Image Credit : Asianet News

వెంకీ అట్లూరి ఎమోషనల్ మేజిక్.. క్లాసిక్ సినిమాల రేంజ్ సెంటిమెంట్

'లక్కీ భాస్కర్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ వెంకీ అట్లూరి మళ్లీ బలమైన కథతో వచ్చారని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సెకండ్ హాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ పీక్స్‌లో ఉందని రివ్యూస్ వస్తున్నాయి. మన టాలీవుడ్ క్లాసిక్ హిట్స్ అయిన అలా వైకుంఠపురములో, అత్తారింటికి దారేది, బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని ఎమోషన్స్ ఈ సినిమాలో మళ్లీ చూశామని ఆడియన్స్ ఫీలవుతున్నారు. ఆ ఎమోషన్స్‌ను వెంకీ అట్లూరి తనదైన కొత్త ట్రీట్‌మెంట్‌తో చాలా ఫ్రెష్‌గా స్క్రీన్ మీద చూపించారు. ఆయన రాసిన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్‌గా నిలిచాయి.

45
కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ ప్రొడక్షన్
Image Credit : Asianet News

కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ ప్రొడక్షన్

ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నోచ్‌గా ఉన్నాయని ఎక్స్ యూజర్లు ప్రశంసిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ చిత్రాన్ని చాలా రిచ్‌గా, గ్రాండ్‌గా నిర్మించారు. సినిమాకు అతిపెద్ద బలం ఇందులో ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్. చాలా సన్నివేశాలు హృదయాలను తాకేలా, కళ్ల వెంట నీళ్లు తెప్పించేలా ఉన్నాయని ఆడియన్స్ పోస్ట్లు పెడుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ బ్లాక్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన మోస్ట్ శాటిస్‌ఫైయింగ్ ఎండింగ్స్‌లో ఇదొకటి అని కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది మంచి రేటింగ్ ఇస్తూ, కుటుంబంతో కలిసి చూడదగ్గ క్లీన్ ఎమోషనల్ డ్రామా అని చెబుతున్నారు.

55
ఒక కాన్సెప్ట్.. ఎమోషనల్ జర్నీ
Image Credit : stockPhoto

ఒక కాన్సెప్ట్.. ఎమోషనల్ జర్నీ

ఒలింపిక్స్ షూటర్ అయిన హీరో తన బిడ్డకు జన్మనిచ్చిన సర్రోగెట్ మదర్‌తో ఏర్పడే ఎమోషనల్ బాండింగ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. పాపకు ఒంట్లో బాగోలేనప్పుడు వారిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. డబ్బింగ్, లిప్ సింక్ విషయంలో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, ఓవరాల్‌గా 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఒక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఎమోషనల్ రైడ్ అని ఆడియన్స్ ఫైనల్ వర్డిక్ట్ ఇస్తున్నారు. సూర్య ఆరా, మమితా బైజు క్యూట్‌నెస్, వెంకీ అట్లూరి ఎమోషన్స్ కలసి ఈ సినిమాను ఈ వారానికి బెస్ట్ ఫ్యామిలీ వాచ్‌గా మార్చేశాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సినిమా సమీక్షలు
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Patriotic Movies: గూస్‌బంప్స్ గ్యారంటీ.. స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఓటీటీలో రచ్చ చేస్తున్న టాప్ సినిమాలు
Recommended image2
Vishwanath and Sons Review: విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ రివ్యూ, సూర్య తెలుగు సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Yash Car: 8055 లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? టాక్సిక్ హవాలో యశ్ కారు నంబర్ ప్లేట్ వైరల్..
Related Stories
Recommended image1
Maoists Fashion Show: వారెవ్వా అదరగొట్టారు.. నిన్నటిదాకా తుపాకీ పట్టిన చేతులతోనే ఇప్పుడు ఫ్యాషన్ షో !
Recommended image2
Viral Post: నాకు మొగుడు కావాలంటే ఈ 11 రూల్స్ పాస్ అవ్వాల్సిందే.. షాకింగ్ వైరల్ పోస్ట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved