MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Vishwanath and Sons Review: విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ రివ్యూ, సూర్య తెలుగు సినిమా ఎలా ఉందంటే?

Vishwanath and Sons Review: విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ రివ్యూ, సూర్య తెలుగు సినిమా ఎలా ఉందంటే?

సూర్య చేసిన తెలుగు సినిమా `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్`. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి సినిమా ఆకట్టుకుందా? సూర్యకి మరో హిట్‌ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

4 Min read
Author : Aithagoni Raju
Published : Aug 14 2026, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ రివ్యూ
Image Credit : Asianet News

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ రివ్యూ

సూర్య చివరగా `కరుప్పు` చిత్రంతో విజయాన్ని అదుకున్నారు. చాలా రోజుల తర్వాత బ్లాక్‌ బస్టర్ అందుకొని కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు. ఇప్పుడు ఆయన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో తెలుగు సినిమా `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` చేశారు. ఇందులో మమితా బైజు హీరోయిన్‌గా నటించగా, రాధిక శరత్‌ కుమార్‌, రవీనా టండన్‌ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చ్యూర్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(ఆగస్ట్ 14)న తెలుగు, తమిళంలో విడుదలైంది. మరి సూర్య తెలుగు మూవీ ఆకట్టుకుందా? ఆయనకు మరో హిట్‌ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ కథ
Image Credit : Asianet News

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ కథ

సంజయ్‌ విశ్వనాథ్‌(సూర్య) బిగ్‌ కార్పొరేట్‌ టైకూన్‌. చిన్నప్పట్నుంచి ఫిస్టల్‌ క్రీడలో రాణించాలనుకుంటాడు. నలభై ఏళ్ల వయసులో ఛాంపియన్‌గా నిలుస్తాడు. దీంతో ఆయనేంటో అందరికి తెలుస్తుంది. అదే సమయంలో దేశంలో ఎవరైనా మ్యానేజ్‌ చేయగల మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ డ్‌ పర్సన్‌ కూడా. అయితే నలభై దాటినా కూడా పెళ్లి చేసుకోడు. దానికి కారణం తన నాన్న అమ్మ నిర్మలమ్మ(రాధికా శరత్‌ కుమార్‌) ని కాకుండా నటి అంజలి(రవీనా టండన్‌)ని పెళ్లి చేసుకుంటాడు. దీంతో తమని దూరం పెట్టడంతో సంజయ్‌ బాధపడతాడు. తండ్రిని, అంజలి ఫ్యామిలీని హేట్‌ చేస్తాడు. అమ్మనే సర్వస్వంగా బతుకుతాడు. అయితే జీవితంలో అన్నీ సాధించిన తనకు పెళ్లి చేయాలని అమ్మ కోరుకుంటుంది. కానీ సంజయ్‌ నో చెబుతాడు. కానీ అమ్మ కోరిక మేరకు సరోగసి ద్వారా అబ్బాయికి తండ్రి అవుతాడు. అతను చిన్నప్పుడే బోన్‌ మ్యారోకి సంబంధించిన లోపంతో బాధపడతాడు. దానికి తన సరోగసి మదర్‌ కావాల్సి వస్తుంది. ఆమెనే మ్యాడీ(మమితా బైజు). డబ్బు కోసం ఆ పని చేస్తుంది. తనకు ఎవరూ లేరు. ఇప్పుడు సంజయ్‌ రిక్వెస్ట్ మేరకు ఆమె బోన్‌ మ్యారో రీప్లేస్‌మెంట్‌కి ఓకే చెబుతుంది. దీనికోసం సంజయ్‌ ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో సంజయ్‌కి ఆమె పడిపోతుంది. కానీ సంజయ్‌ స్ట్రిక్ట్ గా ఉంటాడు. అగ్రిమెంట్‌కే కట్టుబడి ఉంటాడు. అగ్రిమెంట్ టైమ్‌ అయిపోవడంతో తాను వెళ్లిపోవడానికి నో చెబుతుంది. ఈ కేసు కోర్ట్ కి వెళ్తుంది. కొడుకు అభయ్‌ని బాగా చూసుకుంటేనే అబ్బాయిని తండ్రికి ఇవ్వడం జరుగుతుందని, లేదంటే అమ్మకే ఇవ్వాల్సి వస్తుందని కోర్ట్ చెబుతుంది. మరి కొడుకు కోసం సంజయ్‌ ఏం చేశాడు? నిర్మలమ్మకి మ్యాడీ ఎలా దగ్గరయ్యింది? తాను అసహ్యించుకున్న పిన్ని ఇంటికి సంజయ్‌ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? తన లైఫ్‌ లో చోటు చేసుకున్న సంఘటనేంటి? చివరికి మ్యాడీకి సంజయ్‌ ఓకే చెప్పాడా? విడిపోయారా? ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా కథ.

Related Articles

Related image1
Agadha Review: అగధ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఎంఎస్‌ రాజు డైరెక్టర్‌గా సక్సెస్‌ అయ్యాడా? కామాక్షికి హిట్‌ పడిందా?
Related image2
Kamakshi Bhaskarla: ఇప్పటికీ కారు లేదు, బైక్‌ మీదనే తిరుగుతున్న హీరోయిన్‌.. క్రేజీ ఫిలాసఫీ
36
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ విశ్లేషణ
Image Credit : Asianet News

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ విశ్లేషణ

సూర్య ఫ్యామిలీ చిత్రాలు చేసి చాలా కాలం అవుతుంది. వెంకీ అట్లూరి ఇలాంటి మంచి క్లీన్‌ ఫ్యామిలీ చిత్రాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఆయుధంగా మలుచుకుని సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు, హిట్‌ కొడుతున్నారు. ఇప్పుడు `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` కూడా అలాంటిదే. సినిమా ఓవరాల్‌గా చూస్తే పవన్‌ కళ్యాణ్‌ `అత్తారింటికి దారేది` స్టయిల్‌ కనిపిస్తుంది. కథా నేపథ్యం వేరైనా ఆ ఫ్లేవర్‌ కనిపిస్తుంది. అంతే గ్రాండియర్‌గా ఉంటుంది. హీరో బ్యాక్‌ గ్రౌండ్‌ కూడా అదే స్థాయిలో ఉంటుంది. కన్‌ క్లూజన్‌ కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. రిచ్‌ ఫ్యామిలీ అయినా, పేదరికంలో ఉన్నా ఫ్యామిలీ ఎమోషన్స్ మాత్రం సేమ్‌. అదే ఈ మూవీ ద్వారా చెప్పే ప్రయత్నం, చూపించే ప్రయత్నం చేశారు. ప్రారంభంలో సూర్య ఎంట్రీ, ఆయన తాలుకూ పాత్రని ఎస్టాబ్లిష్‌మెంట్‌కి ప్రయారిటీ ఇచ్చారు. ఒక అరగంటసేపు సోసోగానే సాగుతుంది. సరోగసి ద్వారా బాబుకి జన్మనివ్వడం, మమితా బైజు ఎంట్రీ తర్వాత సినిమా అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆమె ఎంట్రీతో పూర్తిగా ఫన్‌ వైపు వెళ్తుంది. అదే సమయంలో ఎమోషన్స్ ప్రధానంగా సాగుతుంది. కొడుకు పెళ్లి చూడాలని, మనవడిని ఎత్తుకోవాలని తల్లి పడే ఆరాటం, పిల్లల విషయంలో ఉండే ఎమోషన్స్ మెయిన్‌గా తీసుకెళ్లారు. ఆయా ఎమోషన్స్ కట్టిపడేస్తాయి. సినిమా కొంత ఫన్నీగా, మరికొంత ఎమోషనల్‌గా రన్‌ అవుతుంది. ఫన్‌ అండ్‌ ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌ అని చెప్పొచ్చు. డౌన్‌ అవుతున్న సమయంలో ఏదైనా ఫన్‌ మూమెంట్‌నిగానీ, ఎమోషన్స్ ని గాని జోడించి ఆకట్టుకున్నారు. సూర్య, రాధికా శరత్‌కుమార్‌ ల మధ్య సీన్లు గుండెని హత్తుకుంటాయి. అలాగే మమితా బైజు చేత అత్తమ్మ అని రాధికా శరత్‌ కుమార్‌ పిలిపించుకునే సీన్లు కూడా ఎమోషనల్‌గా ఉంటాయి. మమితా అగ్రిమెంట్‌ అయిపోయాక వెళ్లిపోయే సీన్లు గుండెని బరువెక్కిస్తాయి. అంతలోనే ఆమె ఇంటి ముందు ధర్నా చేయడం ఫన్నీగా ఉంటుంది. ఇక రాధికా శరత్‌ కుమార్‌ పాత్రలోని సాడ్‌ కన్నీళ్లు పెట్టిస్తుంది. గుండెని పిండేస్తుంది. ఆ తర్వాత దూరమైన ఫ్యామిలీని దగ్గర చేసుకోవడం, ఈగోని పక్కన పెట్టి ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వాలని, కూర్చొని, కలిసి మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా సెట్‌ అవుతుందని చెప్పిన సందేశం బాగుంది. సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య ఏజ్‌ గ్యాప్‌, డ్రీమ్‌ ఫ్యాక్టర్స్ కూడా ఆలోచింప చేస్తాయి. ఈగోతో అలసిపోయాక అసలు బంధాల విలువ తెలుస్తుందని చెప్పిన మాట ఆలోచింప చేస్తుంది. ఇలా వెంకీ అట్లూరీ సినిమాని క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీసుకెళ్లారు. సంపన్న ఫ్యామిలీ నుంచి, పేద వారి వరకు అందరికి కనెక్ట్ అయ్యేలా ఈ మూవీని రూపొందించడం విశేషం. కథగా గొప్పగా ఏం లేదు, కానీ స్క్రీన్‌ప్లే తో మ్యాజిక్‌ చేశాడు వెంకీ అట్లూరి. అయితే సినిమా చాలా చోట్ల స్లో ఫీలింగ్‌ ఉంటుంది. రొటీన్‌ ఫీలింగ్‌ తెప్పిస్తుంది. ఎంత సేపు అక్కడే తిరుగుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. కొన్ని సీన్లు అంతగా పండలేదు. అనవసరం అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా అంతగా పండలేదు. కానీ సూర్య ఫారెన్‌ ట్రిప్‌ సీన్లు మాత్రం ఆద్యంతం నవ్విస్తాయి. మమితా బైజు పాత్రలో పూర్తిగా కామెడీ ఉంటుంది. ఆ తర్వాత ఎమోషనల్‌గా పిండేస్తుంది.

46
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీలో నటీనటులు ఎలా చేశారంటే?
Image Credit : Asianet News

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీలో నటీనటులు ఎలా చేశారంటే?

సంజయ్‌ విశ్వనాథ్‌ పాత్రలో సూర్య ఒదిగిపోయాడు. యాప్ట్ గా నిలిచాడు. ఆ పాత్రలో ఆయన్ని తప్ప మరెవ్వరినీ చూడలేం అనేంత బాగా నటించి మెప్పించాడు. పాత్రలో జీవించాడు. బిజినెస్‌ టైకూన్‌గా, ఈగోయిస్ట్ గా, ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇచ్చే వ్యక్తిగా, రియాలిటీ, నిజాయితీ పరుడిగా బాగా చేశాడు. వాహ్‌ అనిపించాడు. ఇక మ్యాడీ పాత్రలో మమితా బైజు ఇరగదీసింది. ఆద్యంతం నవ్విస్తూనే గుండెని బరువెక్కించింది. అమ్మ నిర్మలమ్మగా రాధికా శరత్‌ కుమార్‌ సైతం అంతే బాగా చేసింది. ఆమె పాత్ర ఉన్నంత సేపు అలరిస్తుంది. ఆతర్వాత కన్నీళ్లు పెట్టిస్తుంది. రవీనా టండన్‌ రోల్‌ సైతం హుందాగా ఉంది. సెకండాఫ్‌ ఎండింగ్‌లో ఆమె తనవైపు తీసుకెళ్లింది. ఇక మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

56
విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

జీవీ ప్రకాష్‌ కుమార్‌ మ్యూజిక్‌ బాగుంది. బీజీఎం బాగుంది. పాటలు ఆకట్టుకుంటాయి. ఆర్‌ఆర్‌ తో పిండేశారు. నిమిష్‌ రవి కెమెరా వర్క్ అదిరిపోయింది. ప్రతి ఫ్రేమ్‌ కలర్‌పుల్‌గా రిచ్‌గా ఉంది. కనువిందుగా ఉంది. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ పరంగా కొంత వర్క్ చేయాలి. స్పీడ్‌ చేయాల్సి ఉంది. నాగవంశీ నిర్మాణ విలువలకు కొదవ లేదు. రిచ్‌గా, గ్రాండియర్‌గా తీశారు. దర్శకుడ వెంకీ అట్లూరి ఎంచుకున్న కథ బాగుంది. స్క్రీన్‌ప్లే సినిమాకి ప్రాణమని చెప్పొచ్చు. డైలాగ్‌లు కూడా అంతే బాగున్నాయి. టైట్‌గా రాసుకున్నారు. కొంత స్లో, రొటీన్‌ సీన్లు, ఊహించే సన్నివేశాలు మైనస్‌గా చెప్పొచ్చు. కాకపోతే ఫ్యామిలీకి కావాల్సిన అంశాలు జోడించాడు. కుటుంబ విలువలు, ఇంట్లో ఉండే ఈగోలు, ఫన్‌, యాక్షన్‌ మేళవింపుగా రూపొందించారు. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు.

66
ఫైనల్‌గా
Image Credit : Asianet News

ఫైనల్‌గా

ఫన్‌ అండ్‌ ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌ లా సాగే క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ విశ్వనాథ్‌ అండ్‌ సన్స్.

రేటింగ్‌ : 3

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తమిళ సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Vishwanath And Sons Twitter Review: థియేటర్లలో కన్నీళ్లు పెట్టిస్తున్న సూర్య.. విశ్వనాథ్ అండ్ సన్స్ పబ్లిక్ టాక్
Recommended image2
Agadha Review: అగధ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఎంఎస్‌ రాజు డైరెక్టర్‌గా సక్సెస్‌ అయ్యాడా? కామాక్షికి హిట్‌ పడిందా?
Recommended image3
Hema Hemeelu Review: శోభన్ బాబుకి బుద్ది చెప్పాలని ఏఎన్నార్ ను రంగంలోకి దింపిన కృష్ణ , హేమా హేమీలు రివ్యూ..
Related Stories
Recommended image1
Agadha Review: అగధ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఎంఎస్‌ రాజు డైరెక్టర్‌గా సక్సెస్‌ అయ్యాడా? కామాక్షికి హిట్‌ పడిందా?
Recommended image2
Kamakshi Bhaskarla: ఇప్పటికీ కారు లేదు, బైక్‌ మీదనే తిరుగుతున్న హీరోయిన్‌.. క్రేజీ ఫిలాసఫీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved