MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Maoists Fashion Show: వారెవ్వా అదరగొట్టారు.. నిన్నటిదాకా తుపాకీ పట్టిన చేతులతోనే ఇప్పుడు ఫ్యాషన్ షో !

Maoists Fashion Show: వారెవ్వా అదరగొట్టారు.. నిన్నటిదాకా తుపాకీ పట్టిన చేతులతోనే ఇప్పుడు ఫ్యాషన్ షో !

Former Maoists Fashion Show: బస్తర్ అడవుల్లో తుపాకులు చేపట్టిన మాజీ మహిళా మావోయిస్టులు జాతీయ చేనేత దినోత్సవం రోజున రాయ్‌పూర్‌లో రంగురంగుల కోసా సిల్క్ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 14 2026, 07:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తుపాకుల నీడ నుంచి వెలుగుల ర్యాంప్ వైపు
Image Credit : X/ujjwalldeepak

తుపాకుల నీడ నుంచి వెలుగుల ర్యాంప్ వైపు

ఒకప్పుడు బస్తర్ అడవులు అంటేనే ఎదురుకాల్పులు, తుపాకుల మోతలు, మావోయిస్టుల అంబూష్‌లే గుర్తుకువచ్చేవి. కానీ ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయ్‌పూర్‌లోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆడిటోరియంలో దృశ్యం పూర్తిగా మారిపోయింది.

నిన్నటి వరకు ఆకుపచ్చ యూనిఫామ్ వేసుకుని భుజాన తుపాకులు మోసిన మాజీ మహిళా మావోయిస్టులు, ఇప్పుడు బస్తర్ సంప్రదాయ చేనేత, కోసా సిల్క్ దుస్తులు ధరించి రంగురంగుల వెలుగుల్లో ర్యాంప్ వాక్ చేశారు. స్వదేశీ ఫ్యాషన్ షోలో భాగంగా జరిగిన ఈ ఈవెంట్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వారం రోజుల్లోనే మైండ్ బ్లాకింగ్ మేకోవర్
Image Credit : X/mygovindia

వారం రోజుల్లోనే మైండ్ బ్లాకింగ్ మేకోవర్

బస్తర్ లోని పునరావాస కేంద్రాల నుంచి వచ్చిన ఈ మహిళలకు రాయ్‌పూర్‌లో ప్రత్యేకంగా వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. ముంబైకి చెందిన ఒక ప్రొఫెషనల్ మోడలింగ్ ట్రెయినర్ వీరికి ర్యాంప్‌పై ఎలా నడవాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, కాన్ఫిడెన్స్‌తో ఎలా ప్రెజెంట్ చేయాలనే విషయాలపై శిక్షణ ఇచ్చారు.

పాల్గొన్న వారిలో మాద్వి మల్లే అనే మహిళ మాట్లాడుతూ.. ప్రారంభంలో భయపడ్డాననీ, కానీ ప్రాక్టీస్ చేశాక కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పారు. ఇంత పెద్ద క్రౌడ్ ముందు ర్యాంప్ వాక్ చేస్తానని కలలు కూడా కనలేదని పూనం దేవీ సంతోషం వ్యక్తం చేశారు. వీరిలో చాలామందికి రాయ్‌పూర్ నగరాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ కూడా పాల్గొని వారితో ముచ్చటించారు.

35
లోంగుబాటు అనేది కేవలం ఆరంభం మాత్రమే
Image Credit : X/mygovindia

లోంగుబాటు అనేది కేవలం ఆరంభం మాత్రమే

మావోయిస్టు బాట వీడిన వారికి లోంగుబాటు అనేది సివిలియన్ లైఫ్‌లోకి రావడానికి పడే మొదటి అడుగు మాత్రమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతా బలగాల ఆపరేషన్లతో పాటు లోంగుబాటు, పునరావాసం, వృత్తి విద్యా శిక్షణ, ఆర్థిక సహాయం అందిస్తూ వారిని సమాజంలోకి కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

రాయ్‌పూర్ ఫ్యాషన్ షో అనేది ఈ రీ-ఇంటిగ్రేషన్ ప్రసారంలో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రాణాలమీదికి తెచ్చే అడవి పోరాటాల నుంచి బయటపడి, తమ సొంత ప్రాంతపు చేనేత సంస్కృతికి ప్రతినిధులుగా మారడం వీరి జీవితాల్లో వచ్చిన పెద్ద మార్పుకు నిదర్శనం.

45
రెడ్ కారిడార్ తగ్గుముఖం.. బస్తర్ కథ మారే సమయం
Image Credit : X/mygovindia

రెడ్ కారిడార్ తగ్గుముఖం.. బస్తర్ కథ మారే సమయం

1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరీలో మొదలైన నక్సలైట్ ఉద్యమం, దట్టమైన అడవులు ఉండే బస్తర్ ప్రాంతాన్ని తమకు సేఫ్ జోన్‌గా మార్చుకుంది. 2010లో దంతెవాడలో 76 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన దాడి ఈ హింసాత్మక పోరాటంలో అత్యంత ఘోరమైనది. అయితే గడిచిన పదేళ్లలో, ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో ఎల్డబ్ల్యూఈ హింస తీవ్రంగా తగ్గింది.

కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం, 2010లో 1,936గా ఉన్న హింసాత్మక సంఘటనలు 2025 నాటికి 234కి పడిపోయాయి. అంటే ఏకంగా 88 శాతం తగ్గుదల నమోదైంది. నక్సల్ రహిత భారత్‌ సాధించాలనే లక్ష్యంలో భాగంగా చాలామంది మావోయిస్టులు రాజ్యాంగంపై ప్రమాణం చేసి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు.

55
మోడలింగ్ కాదు.. మారిన జీవితానికి ప్రతీక
Image Credit : X/mygovindia

మోడలింగ్ కాదు.. మారిన జీవితానికి ప్రతీక

ఈ ఫ్యాషన్ షోతో మావోయిస్టుల పునరావాస సమస్యలన్నీ పూర్తిగా తీరిపోయాయని చెప్పలేం. అలాగని వీరంతా రాత్రికి రాత్రే ప్రొఫెషనల్ మోడళ్లుగా మారిపోయారని కూడా కాదు. కానీ, ప్రచారానికి దూరంగా ఉన్న బస్తర్ గిరిజన సంస్కృతిని, చేనేత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికి ఇదొక గొప్ప అవకాశంగా మారింది.

దశాబ్దాలుగా హింస, కాల్పులు, ఎన్‌కౌంటర్ల వార్తలతో వార్తల్లో నిలిచిన బస్తర్, ఇప్పుడు కళలు, క్రీడలు, పర్యాటకం, అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది. తుపాకుల నీడ నుంచి మోడలింగ్ ర్యాంప్ వైపు సాగిన ఈ ప్రయాణం.. హింస ముగిశాక కొత్త జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక నిదర్శనం.

View this post on Instagram

A post shared by MyGov, Government of India (@mygovindia)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Giri Babu: 40 రూపాయల రూమ్ రెంట్, స్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తూ.. గిరిబాబుతో కలిసున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Paradise Movie Review: ప్యారడైజ్‌ మూవీ రివ్యూ.. నాని విశ్వరూపం ఓకే.. కానీ అసలు సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Varshini: నరేష్ ని పొట్టోడు అనొద్దు, అది కూడా సమస్యే అతడికి.. ఆడదానితో ఆడి గెలిచి ఏం రచ్చ చేస్తున్నారో చూడు
Related Stories
Recommended image1
Independence Day: 1947 vs 2026.. ఉద్యోగాల వేట ఎలా మారింది? ఏఐ దెబ్బకు ఏ ఉద్యోగాలు పోతున్నాయి?
Recommended image2
Konaseema: కేరళ కాదు గురూ.. మన ఏపీలోని ఈ రివర్ ప్యారడైజ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved