MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT Patriotic Movies: గూస్‌బంప్స్ గ్యారంటీ.. స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఓటీటీలో రచ్చ చేస్తున్న టాప్ సినిమాలు

OTT Patriotic Movies: గూస్‌బంప్స్ గ్యారంటీ.. స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఓటీటీలో రచ్చ చేస్తున్న టాప్ సినిమాలు

OTT Patriotic Movies: రక్తం మరిగేలా చేసే దేశభక్తి సినిమాలు చాలానే వచ్చాయి. అప్పటి పోరాటాలను కళ్లముందుచ్చాయి. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓటీటీలో చూడాల్సిన టాప్ దేశభక్తి సినిమాలు, సిరీస్‌ల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 14 2026, 12:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
స్వాతంత్య్ర దినోత్సవం 2026: ఈ స్పెషల్ ఓటీటీ మూవీస్ అస్సలు మిస్ అవ్వకండి
Image Credit : Chatgpt

స్వాతంత్య్ర దినోత్సవం 2026: ఈ స్పెషల్ ఓటీటీ మూవీస్ అస్సలు మిస్ అవ్వకండి

భారతదేశం తన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి చాలా గ్రాండ్‌గా సిద్ధమవుతోంది. 1947 లో బ్రిటీష్ పాలన ముగిసి, మన దేశం ఒక స్వతంత్ర రాజ్యంగా ఎదిగిన ఆ గొప్ప రోజును మనం ప్రతి ఏటా ఘనంగా స్మరించుకుంటాం. వేడుకలు చేసుకుంటాం. మన దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాలను, ధైర్యాన్ని గుర్తుచేసుకోవడానికి ఇది సరైన సమయం.

ఈ ఆగస్టు 15న మీ ఇంటి వద్దే ఉంటూ దేశభక్తి భావనను నింపే కొన్ని అద్భుతమైన సినిమాలను, వెబ్ సిరీస్‌లను మీరు ఓటీటీలలో చూడవచ్చు. కొన్ని బెస్ట్ పేట్రియాటిక్ మూవీస్ లిస్ట్ మీ కోసం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ధురంధర్ అండ్ ధురంధర్ పార్ట్ 2
Image Credit : Instagram@saraarjunn

ధురంధర్ అండ్ ధురంధర్ పార్ట్ 2

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ధురంధర్'. కరాచీలోని ఒక ఉగ్రవాద నెట్‌వర్క్‌లోకి ప్రవేశించే ఒక భారతీయ గూఢచారి కథ ఆధారంగా ఈ చిత్రం నడుస్తుంది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించారు. దీనితో పాటు దీని సీక్వెల్ అయిన ధురంధర్: ది రివేంజ్ కూడా మీరు చూడవచ్చు. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్నాయి.

Related Articles

Related image1
Vishwanath And Sons Twitter Review: థియేటర్లలో కన్నీళ్లు పెట్టిస్తున్న సూర్య.. విశ్వనాథ్ అండ్ సన్స్ పబ్లిక్ టాక్
Related image2
Viral Post: నాకు మొగుడు కావాలంటే ఈ 11 రూల్స్ పాస్ అవ్వాల్సిందే.. షాకింగ్ వైరల్ పోస్ట్ !
36
ఆపరేషన్ సఫేద్ సాగర్
Image Credit : X/NetflixIndia

ఆపరేషన్ సఫేద్ సాగర్

నెట్‌ఫ్లిక్స్ లో ఇటీవల విడుదలైన సిరీస్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్'. ఇది 1999 నాటి కార్గిల్ యుద్ధం ఆధారంగా తెరకెక్కింది. అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో భారత వైమానిక దళం నిర్వహించిన కంబాట్ మిషన్ పేరునే ఈ సిరీస్‌కి పెట్టారు. అత్యంత ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులలో హిమాలయ పర్వత శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో మన ఆర్మీకి తోడుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంత గొప్ప పాత్ర పోషించిందో ఇందులో చూపించారు. దీనిని మీరు నెట్‌ఫ్లిక్స్ లో చూడవచ్చు.

46
సామ్ బహదూర్ అండ్ భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా
Image Credit : our own

సామ్ బహదూర్ అండ్ భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా

'సామ్ బహదూర్' అనేది భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా జీవితం ఆధారంగా వచ్చిన బయోపిక్ వార్ డ్రామా. మేఘనా గుల్జార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో జీవించారు. ఫాతిమా సనా షేక్, సాన్యా మల్హోత్రా, నీరజ్ కాబీ ఇతర పాత్రల్లో నటించారు.

మరొక సినిమా 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'. ఇందులో అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా, సంజయ్ దత్ ముఖ్య పాత్రల్లో నటించారు. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ చిత్రం, భారత వైమానిక దళం వీరత్వాన్ని చాటి చెబుతుంది. 300 మంది స్థానిక మహిళల సహాయంతో ల్యాండింగ్ స్ట్రిప్‌ను ఎలా పునర్నిర్మించారో ఇందులో చూపించారు. ఈ సినిమా హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది.

56
రంగ్ దే బసంతి, ది ఘాజీ ఎటాక్
Image Credit : our own

రంగ్ దే బసంతి, ది ఘాజీ ఎటాక్

'రంగ్ దే బసంతి' అనేది కొంతమంది కాలేజీ ఫ్రెండ్స్ కథ. అమీర్ ఖాన్, సిద్ధార్థ్ తదితరులు ఇందులో నటించారు. ఒక డాక్యుమెంటరీలో స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలను పోషించిన తర్వాత, వారు దేశం కోసం ఏదైనా చేయాలని ప్రేరణ పొందుతారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో అవినీతిపై ఎలా పోరాడారనేది ఈ చిత్ర కథ. ఇది హాట్‌స్టార్ లో ఉంది.

అలాగే 1971 భారత్-పాక్ యుద్ధంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన 'ది ఘాజీ ఎటాక్' సినిమా భారత సబ్‌మరైన్ S21, పాకిస్తాన్ సబ్‌మరైన్ PNS ఘాజీ మధ్య జరిగిన నౌకాదళ పోరాటాన్ని చూపిస్తుంది. రాణా దగ్గుబాటి, కేకే మేనన్, అతుల్ కులకర్ణి నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఉంది.

66
ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, రాజీ
Image Credit : amazon prime

ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, రాజీ

2016 ఉరి దాడికి సమాధానంగా భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' రూపొందింది. మేజర్ విహాన్ షేర్గిల్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతంగా నటించారు. యామీ గౌతమ్, పరేష్ రావల్ కూడా ఇందులో ఉన్నారు.

ఇక 'రాజీ' సినిమాలో ఆలియా భట్, విక్కీ కౌశల్ జంటగా నటించారు. పాకిస్తాన్‌లో గూఢచారిగా పనిచేయడానికి వెళ్లిన సెహమత్ (ఆలియా) దేశం కోసం చేసిన త్యాగాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. ఈ చిత్రాన్ని మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లలో వీక్షించవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
స్వాతంత్య్ర దినోత్సవం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
బాలీవుడ్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Vishwanath and Sons Review: విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ రివ్యూ, సూర్య తెలుగు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Vishwanath And Sons Twitter Review: థియేటర్లలో కన్నీళ్లు పెట్టిస్తున్న సూర్య.. విశ్వనాథ్ అండ్ సన్స్ పబ్లిక్ టాక్
Recommended image3
Yash Car: 8055 లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? టాక్సిక్ హవాలో యశ్ కారు నంబర్ ప్లేట్ వైరల్..
Related Stories
Recommended image1
Vishwanath And Sons Twitter Review: థియేటర్లలో కన్నీళ్లు పెట్టిస్తున్న సూర్య.. విశ్వనాథ్ అండ్ సన్స్ పబ్లిక్ టాక్
Recommended image2
Viral Post: నాకు మొగుడు కావాలంటే ఈ 11 రూల్స్ పాస్ అవ్వాల్సిందే.. షాకింగ్ వైరల్ పోస్ట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved