MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • ఫంకీ ట్రైలర్ రివ్యూ, త్రివిక్రమ్ ని అడిగితే ఏమన్నాడో తెలుసా.. నవ్వుల మోత, విశ్వక్ సేన్ కి భారీ హిట్ లోడింగ్ ?

ఫంకీ ట్రైలర్ రివ్యూ, త్రివిక్రమ్ ని అడిగితే ఏమన్నాడో తెలుసా.. నవ్వుల మోత, విశ్వక్ సేన్ కి భారీ హిట్ లోడింగ్ ?

విశ్వక్ సేన్, డైరెక్టర్ అనుదీప్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫంకీ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ లో విశేషాలు ఏంటి, డైరెక్టర్ అనుదీప్ నవ్వులు పూయించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారా అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 07 2026, 08:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విశ్వక్ సేన్ ఫంకీ ట్రైలర్
Image Credit : Asianet News

విశ్వక్ సేన్ ఫంకీ ట్రైలర్

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం 'ఫంకీ'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్‌ కథానాయిక.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫిబ్రవరి 13న రిలీజ్
Image Credit : Asianet News

ఫిబ్రవరి 13న రిలీజ్

ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగు పెట్టనున్న 'ఫంకీ' చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, ‘ధీరే ధీరే’, ‘రట్టాటటావ్’ పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది.

Related Articles

Related image1
మహేష్ బాబు నేచురల్ పెర్ఫార్మెన్స్ కి కృష్ణంరాజు ఫిదా, అది డైరెక్టర్ చేసిన మ్యాజిక్ అంటూ ప్రశంసలు
Related image2
Chiranjeevi: ఆ కుర్రాడి కోసం తన సినిమా షూటింగ్ నే ఆపేసిన చిరంజీవి..ఇప్పుడు అతడే మెగాస్టార్ కి పోటీగా దిగాడు
35
ట్రైలర్ ఎలా ఉందంటే
Image Credit : Asianet News

ట్రైలర్ ఎలా ఉందంటే

'ఫంకీ' ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. కె.వి. అనుదీప్ శైలి కామెడీతో నవ్వులు పూయించింది. ప్రతి ఫ్రేమ్‌లో వినోదం ఉట్టిపడేలా రూపొందించిన ఈ ట్రైలర్, థియేటర్లలో నవ్వుల తుఫాన్ చూడబోతున్నామనే హామీ ఇచ్చింది. విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కలిసి తెరపై చురుకుగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరి.. చిత్రానికి కొత్త ఉత్సాహాన్ని, మరింత అందాన్ని జోడించింది. ప్రధాన తారాగణంతో పాటు ఇతర పాత్రలు కూడా నవ్వులు పూయిస్తూ 'ఫంకీ'ని పూర్తి స్థాయి వినోదభరిత చిత్రంగా మలిచాయి. మొత్తానికి ట్రైలర్ తో 'ఫంకీ' సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

45
విశ్వక్ సేన్ కామెంట్స్
Image Credit : Asianet News

విశ్వక్ సేన్ కామెంట్స్

ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "మీ అందరినీ కలిసి దాదాపు సంవత్సరం అవుతుంది. ఒక మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతోనే ఈ విరామం తీసుకోవడం జరిగింది. ఫంకీ సినిమా రెండు గంటల పది నిమిషాల పాటు మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటుంది. ఫోన్ పెట్టుకోవాలనే ఆలోచనే రాదు. ప్రతి సన్నివేశం చూస్తూ నవ్వుకుంటారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్ కి రండి. కడుపుబ్బా నవ్వుకుంటారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో కలుద్దాం." అన్నారు.

కథానాయిక కయాదు లోహర్‌ మాట్లాడుతూ.. "మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు. ట్రైలర్ చూశారు కదా ఎంత కామెడీగా ఉందో. సినిమా దీనికి వంద రెట్లు ఉంటుంది. అనుదీప్ గారి ట్రేడ్ మార్క్ కామెడీ చూస్తారు. నాకు ఈ అవకాశమిచ్చిన నాగవంశీ గారికి ధన్యవాదాలు. ఫిబ్రవరి 13న విడుదలవుతున్న మా ఫంకీ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను." అన్నారు.

55
పంచ్ లు బాగా పేలాయి
Image Credit : Asianet News

పంచ్ లు బాగా పేలాయి

దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ.."ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫిబ్రవరి 13న థియేటర్ కి రండి. ఫంకీ సినిమా మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది." అన్నారు. సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.."ట్రైలర్ మీ అందరికీ నచ్చింది కదా. పంచ్ లు బాగా పేలాయి కదా. సినిమా అంతా ఇలాగే ఉంటుంది. ప్రతి సన్నివేశం మిమ్మల్ని నవ్విస్తుంది. కామెడీ కోసం థియేటర్ కి రండి. దర్శకుడు అనుదీప్ మిమ్మల్ని అసలు నిరాశపరిచాడు. జాతిరత్నాలుతో ఎలా ఆకట్టుకున్నాడో ఫంకీతో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటాడు. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఫంకీ సినిమా కచ్చితంగా నవ్విస్తుంది." అన్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. కాలు కదిపే పాటలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ధీరే ధీరే’, ‘రట్టాటటావ్’ పాటలతో ఆ విషయాన్ని రుజువు చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీతనానికి, విజయవంతమైన చిత్రాలకు పేరుగాంచిన నిర్మాణ సంస్థల నుంచి వస్తున్న సినిమా కావడంతో 'ఫంకీ'పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా 'ఫంకీ' చిత్రం ప్రేక్షకులకు నవ్వుల విందుని అందిస్తుందని చిత్ర బృందం హామీ ఇచ్చింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
మహేష్ బాబు నేచురల్ పెర్ఫార్మెన్స్ కి కృష్ణంరాజు ఫిదా, అది డైరెక్టర్ చేసిన మ్యాజిక్ అంటూ ప్రశంసలు
Recommended image2
Chiranjeevi: ఆ కుర్రాడి కోసం తన సినిమా షూటింగ్ నే ఆపేసిన చిరంజీవి..ఇప్పుడు అతడే మెగాస్టార్ కి పోటీగా దిగాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved