MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: ఆ కుర్రాడి కోసం తన సినిమా షూటింగ్ నే ఆపేసిన చిరంజీవి..ఇప్పుడు అతడే మెగాస్టార్ కి పోటీగా దిగాడు

Chiranjeevi: ఆ కుర్రాడి కోసం తన సినిమా షూటింగ్ నే ఆపేసిన చిరంజీవి..ఇప్పుడు అతడే మెగాస్టార్ కి పోటీగా దిగాడు

చిరంజీవి తన సినిమాలో ఓ కుర్ర హీరోకి ఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. కానీ ఆ హీరో షూటింగ్ కి రాకపోవడంతో పెద్ద రచ్చ జరిగింది. ఇంతకీ ఆ హీరో ఎవరు ? ఆ సంఘటన ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 07 2026, 07:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి సినిమాలు 
Image Credit : Youtube/Aditya Music

చిరంజీవి సినిమాలు 

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎందరో హీరోలు, నటీనటులకు ఆదర్శంగా నిలిచారు. సక్సెస్ సాధించాలి, నటుడిగా ఎదగాలి అంటే బ్యాగ్రౌండ్ అవసరం లేదు అని నిరూపించిన నటుడు చిరంజీవి. ఏడు పదుల వయసులో కూడా చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకున్న వారిలో యువ హీరో శర్వానంద్ ఒకరు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్న హీరో 
Image Credit : Youtube/ Aditya Music

చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్న హీరో 

శర్వానంద్, రాంచరణ్ ఇద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు. దీనితో బాల్యంలో శర్వానంద్ చిరంజీవి ఇంటికి వెళ్లేవారట. ఓ కార్యక్రమంలో శర్వానంద్ మాట్లాడుతూ.. నేను నటుడిని కావాలి అని అనుకున్నప్పుడు చిరంజీవి గారి బ్లెస్సింగ్ తీసుకుని నా తొలి సినిమాకు వెళ్ళాను. ఆయన నాకు ఒకటే చెప్పారు. నువ్వు నటుడివి అయ్యాక డైరెక్టర్ నుంచి లైట్ బాయ్ వరకు అందరినీ సమానంగా చూడు అని చిరంజీవి గారు చెప్పారు. 

35
పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారు 
Image Credit : social media

పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారు 

ఒకటి రెండు సినిమాల్లో నటించిన తర్వాత చిరంజీవి గారు నన్ను గుర్తు పెట్టుకుని శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో ఓ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ మూవీలో శర్వానంద్ కి ఛాన్స్ ఇవ్వండి అని చిత్ర యూనిట్ కి ఆయన చెప్పారు. చిరంజీవి గారు చెప్పారు కదా వాళ్లే ఫోన్ చేస్తారు అని అనుకున్నా. కానీ 2 నెలల వరకు నాకు ఫోన్ రాలేదు. 

45
శర్వానంద్ పై చిరంజీవి కోపం 
Image Credit : our own

శర్వానంద్ పై చిరంజీవి కోపం 

దీనితో ఆ ఛాన్స్ పోయింది ఏమో అనుకున్నా. రాంచరణ్ కి కూడా చెప్పాలని అనిపించలేదు. కానీ రెండు నెలల తర్వాత కాల్ వచ్చింది. నీపై చిరంజీవి గారు కోపంగా ఉన్నారు. ఒకసారి రా అని పిలిచారు. నేను వెళ్ళాను చిరంజీవి గారు నా మీద ఎందుకు కోపంగా ఉన్నారో నాకు అర్థం కాలేదు. నేను ఛాన్స్ ఇచ్చినా ఎందుకు రాలేదు అని అడిగారు. నాకు ఎవరూ ఫోన్ చేయలేదు, పిలవలేదు అని చెప్పా. 

55
షూటింగ్ ఆపేసిన మెగాస్టార్ 
Image Credit : X/@Shine_Screens

షూటింగ్ ఆపేసిన మెగాస్టార్ 

దీనితో వెంటనే చిరంజీవి గారు షూటింగ్ ఆపేశారు. నేను ఈ అబ్బాయికి ఛాన్స్ ఇమ్మని చెప్పాను కదా. మీరు ఎందుకు కాల్ చేయలేదు అని చిత్ర యూనిట్ మొత్తాన్ని చివాట్లు పెట్టారు. జరుగుతున్న షూటింగ్ వాయిదా వేసి మరుసటి రోజు నేను నటించాల్సిన సన్నివేశాల షూటింగ్ పెట్టించారు. అది మెగాస్టార్ చిరంజీవి అంటే.. అంటూ శర్వానంద్ ప్రశంసలు కురిపించారు. శంకర్ దాదా ఎంబిబిఎస్ తర్వాత శర్వానంద్ నెమ్మదిగా హీరోగా ఎదిగారు. ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాకి పోటీగా తన సినిమాని దించే స్థాయికి చేరుకున్నారు. సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో పాటు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి కూడా రిలీజై విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix: ఓటీటీలో చిరంజీవి సంచలన పాడ్ కాస్ట్, ఇది కూతురి ప్లాన్.. సినిమాలు, రాజకీయాల్లో తెరవెనుక ఏం జరిగింది
Recommended image2
Bigg Boss Telugu 10: ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వే.. రోహిత్ పై రెచ్చిపోయిన త్రిగుణ్
Recommended image3
Taapsee Marriage: 13 ఏళ్ల సీక్రెట్ రిలేషన్‌షిప్‌పై నోరువిప్పిన తాప్సీ..నా పార్ట్నర్ ని నేనే ఎంచుకున్నా
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవికి ఏమాత్రం ఇష్టం లేదు, అయినా కూడా ఆ మూవీలో నటించిన పవన్.. రిజల్ట్ ఏమైందో తెలుసా ?
Recommended image2
స్టార్ డైరెక్టర్ తండ్రికి అవమానం, సిగరెట్ తాగాడని జబర్దస్త్ కమెడియన్ కెరీర్ నాశనం చేశారుగా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved