MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Babu Mohan: బాబు మోహన్ మంత్రి అవ్వడం తట్టుకోలేకపోయిన కోట శ్రీనివాసరావు, అసెంబ్లీలో ఏం చేశాడో తెలుసా?

Babu Mohan: బాబు మోహన్ మంత్రి అవ్వడం తట్టుకోలేకపోయిన కోట శ్రీనివాసరావు, అసెంబ్లీలో ఏం చేశాడో తెలుసా?

Babu Mohan: టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లలో బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కాంబో ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఇద్దరూ స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వుల పంట పండేది. అటువంటిది రాజకీయాల్లోకి వెళ్లాక.. బాబు మోహన్‌ను చూసి కోట కుళ్లుకున్నారని మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 26 2026, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కోట   బాబు మోహన్ క్రేజీ కాంబినేషన్..
Image Credit : Kota Srinivasa Rao Facebook

కోట - బాబు మోహన్ క్రేజీ కాంబినేషన్..

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటులుగా తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు బాబూ మోహన్ - కోట శ్రీనివాసరావు కాంబో. ఈ ఇద్దరూ ఉన్నారంటే సినిమా హిట్ పడినట్టే.. తెరపై ఈ ఇద్దరు కమెడియన్ల కాంబినేషన్ సీన్లకు కిందపడి నవ్వేవారు ఆడియన్స్. 'మామగారు', 'యమలీల' లాంటి సినిమాల్లో బాబూ మోహన్, కోట శ్రీనివాసరావు కామెడీని ఇప్పటికీ మర్చిపోలేము. సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నంత వరకు వీరిద్దరి కాంబో చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కూడా చాలా ఇంటర్వ్యూల్లో సందడి చేసింది. రాజకీయాల్లో కూడా ఈ ఇద్దరూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో బాబు మోహన్ మాట్లాడుతూ.. కోటాతో ఉన్న అనుబంధం గురించి వెల్లడించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎదురైన అనుభవాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోట శ్రీనివాసరావుతో కాంబినేషన్, బాండింగ్
Image Credit : google

కోట శ్రీనివాసరావుతో కాంబినేషన్, బాండింగ్

తెలుగు వెండితెరపై కోట శ్రీనివాసరావు - బాబూ మోహన్ కాంబినేషన్ సుదీర్ఘకాలం పాటు ప్రేక్షకులను అలరించింది. విలనిజంతో పాటు హాస్యాన్ని పండించడంలో వీరిద్దరి టైమింగ్ అద్భుతంగా ఉండేది. ఇంటర్వ్యూలో బాబూ మోహన్ మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న నటన అనుబంధం కేవలం కెమెరా ముందే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా బలంగా ఉండేదని అన్నారు. సెట్స్‌లో ఇద్దరూ పోటీపడి నటించేవారని, ఒకరి నటనకు మరొకరు తగినట్లుగా సైగలు, డైలాగ్స్ జోడించి సన్నివేశాలను మరింత రక్తికట్టించేవారని గుర్తుచేసుకున్నారు.

35
మంత్రి అయిన తర్వాత కోట స్పందన
Image Credit : Shalimar Telugu & Hindi Movies/Youtube screen shot

మంత్రి అయిన తర్వాత కోట స్పందన

నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బాబూ మోహన్ రాజకీయాల్లోకి ప్రవేశించి శాసనసభ్యుడిగా, ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరో పార్టీ నుంచి కోట శ్రీనివాసరావు కూడా ఎమ్మెల్యేగా గెలిచి.. బాబు మోహన్‌తో పాటు అసెంబ్లీకి వెళ్లేవారు. ఓ సాధారణ నటుడు మంత్రి పదవి చేపట్టినప్పుడు తోటి నటుల ప్రతిస్పందన ఎలా ఉందో ఆయన సరదాగా వివరించారు. తాను మంత్రి అయిన తర్వాత కోట శ్రీనివాసరావు తనను చూసి కుళ్లుకునేవాడని బాబు మోహన్ సరదాగా అన్నారు. "ఎందుకురా మంత్రి పదవి.. హాయిగా ఎమ్మెల్యేగా ఉండకుండా" అని సలహా ఇచ్చేవాడట కోట. అంతేకాదు, తాను ఎలాగో మంత్రి కా లేనని తెలిసి.. బాబు మోహన్‌కు మంత్రి పదవి వచ్చినందుకు తట్టుకోలేకపోయాడట కోట శ్రీనివాసరావు.

45
కోటను ఏడిపించిన బాబు మోహన్..
Image Credit : Kota Srinivasa Rao facebook

కోటను ఏడిపించిన బాబు మోహన్..

బాబు మోహన్ మంత్రి అయినప్పటి నుంచి అసలు అసెంబ్లీకే రావడం మానేశాడట కోట. ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు పక్కపక్కనే కూర్చునే అవకాశం ఉండేది.. కానీ బాబు మోహన్ మంత్రి అయిన తర్వాత సీట్లు మారిపోతాయి.. హోదా కూడా మారిపోతుంది. ఈ విషయంలో కోటను బాబు మోహన్ సరదాగా ఆటపట్టించేవారట. "నేను మంత్రిని.. అక్కడ కూర్చుంటాను.. నువ్వు ఎమ్మెల్యేవి మాత్రమే.. ఇక్కడికి రాకూడదు" అని ఏడిపించేవాడట. హోదా మారినా తమ మధ్య ఉన్న స్నేహం, పాత అనుబంధం ఏమాత్రం తగ్గలేదని బాబూ మోహన్ స్పష్టం చేశారు.

55
బ్రహ్మానందంతో అనుబంధం..
Image Credit : our own

బ్రహ్మానందంతో అనుబంధం..

అప్పటి సినీ పరిశ్రమలో ఇతర ప్రముఖ నటులైన బ్రహ్మానందం వంటి కామిక్ దిగ్గజాలతో పనిచేసిన రోజులను కూడా బాబు మోహన్ గుర్తుచేసుకున్నారు. ప్రతి నటుడికీ ఒక ప్రత్యేక శైలి ఉంటుందని, ఎవరికి వారే పరిశ్రమలో తమ ఉనికిని కాపాడుకున్నారని అన్నారు. నటుల మధ్య పోటీ ఉన్నప్పటికీ, ప్రతిభ ఉన్నవారికి తప్పకుండా అవకాశాలు వచ్చేవని ఆయన అభిప్రాయపడ్డారు. బాబూ మోహన్ ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్న ఈ అనుభవాలు, ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Elimination: మూడో వారం ఎలిమినేషన్‌, వంశీ ఔట్‌..? ఆమె జస్ట్ లో మిస్‌ ?
Recommended image2
Ram Charan House: స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టుతో రామ్ చరణ్ లగ్జరీ ఇల్లు.. ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?
Recommended image3
KTR: చాలా ఏళ్ల త‌ర్వాత ఈరోజు థియేటర్‌కి వెళ్తున్నా.. వైర‌ల్ అవుతోన్న కేటీఆర్ ట్వీట్
Related Stories
Recommended image1
Auto Ram Prasad: బిగ్ బాస్ కే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆటో రామ్ ప్రసాద్, జబర్దస్త్ కమెడియన్ లో ఈ కోణం కూడా ఉందా?
Recommended image2
Savitri: జెమినీ గణేశన్ ఉండగానే సావిత్రి పక్కన కూర్చున్న ఏఎన్నార్, అన్నపూర్ణమ్మ చూసి ఏమన్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved