- Home
- Entertainment
- Ram Charan House: స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టుతో రామ్ చరణ్ లగ్జరీ ఇల్లు.. ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?
Ram Charan House: స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టుతో రామ్ చరణ్ లగ్జరీ ఇల్లు.. ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?
Ram Charan House: రామ్ చరణ్, ఉపాసన కొణిదెల హైదరాబాద్ ఇల్లు కేవలం ఒక సెలబ్రిటీ మాన్షన్ మాత్రమే కాదు. పచ్చదనం, ఆధునిక హంగులు, సంప్రదాయం ఉట్టిపడేలా ఈ ఇంటిని చాలా అందంగా, తమ అభిరుచికి తగ్గట్టుగా తీర్చిదిద్దుకున్నారు.

జూబ్లీహిల్స్‌లో విశాలమైన ఇల్లు
హైదరాబాద్‌లోని ఖరీదైన జూబ్లీహిల్స్ ఏరియాలో ఉన్న రామ్ చరణ్, ఉపాసన ఇల్లు సిటీలోనే మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ ఇళ్లలో ఒకటి. అయితే రామ్ చరణ్ ఉంటున్న ఈ ఇల్లు చిరంజీవిది. మెగాస్టార్ ఏకైక వారసుడైన రామ్ చరణ్.. ఆయనతోనే కలిసి ఉంటున్నాడు. ఉమ్మడి కుటుంబంగా మెగా ఫ్యామిలీ ఉంటున్న ఈ ప్రాపర్టీ సుమారు 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని, దీని విలువ దాదాపు రూ.30 కోట్లు ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం దీని విలువ ఇంకా ఎక్కువే ఉంటుంది. ప్రస్తుత మార్కెట్ వాల్యూపై కచ్చితమైన సమాచారం లేదు.
పచ్చదనం మధ్య మోడ్రన్ ప్యాలెస్
ఈ ఇంటిని చూడగానే ముందుగా ఆకట్టుకునేది వైట్ కలర్ ఎక్స్‌టీరియర్, గ్లాస్ డిజైన్స్, విశాలమైన గార్డెన్. హైదరాబాద్ మధ్యలో ఉన్నప్పటికీ, అందమైన మొక్కలు, తీగలతో ఈ ఇల్లు అచ్చం రిసార్ట్‌ను తలపిస్తుంది. ఫ్యామిలీతో ప్రశాంతంగా గడిపేందుకు బయట ఒక చక్కటి సిట్-అవుట్ ఏరియాను కూడా ఏర్పాటు చేశారు.
సంప్రదాయం, ఆధునికత కలయిక
ఈ మాన్షన్ లోపల సౌత్ ఇండియన్ ట్రెడిషన్స్, మోడ్రన్ డిజైన్ల కలయిక కనిపిస్తుంది. లివింగ్ రూమ్‌లో కుషన్ సీటింగ్, పెద్ద కిటికీలు, బ్లాక్ అండ్ వైట్ ఫ్లోరింగ్ ఆకట్టుకుంటాయి. యాంటిక్ డెకర్ పీసెస్ ఇంటికి వింటేజ్ లుక్ ఇస్తాయి. హైదరాబాద్ హెరిటేజ్ ఉట్టిపడేలా ఈ డిజైన్ చేశారని చెబుతారు.
ఫ్యామిలీకి ఇష్టమైన డైనింగ్ ఏరియా
ఈ ఇంట్లో అందరికీ బాగా గుర్తిండిపోయే ప్లేస్ పెద్ద డైనింగ్ ఏరియా. అందమైన షాండ్లియర్ కింద ఉన్న పెద్ద డైనింగ్ టేబుల్ దగ్గర ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తారు. పండుగల సమయంలో ఇంటిని అలంకరించడం, టేబుల్ సెట్ చేయడం తనకు ఎంత ఇష్టమో ఉపాసన చాలాసార్లు చెప్పారు. ఇది ఈ ఇంటికి మరింత పర్సనల్ టచ్ ఇస్తుంది.
పూజ కోసం ప్రత్యేక గది
ఈ ఇంట్లో దేవుడి కోసం ఒక ప్రత్యేకమైన పూజా గది ఉంది. పాతకాలం నాటి రాతి కట్టడాల శైలిలో ఈ పూజా గదిని డిజైన్ చేశారని గతంలో వార్తలు వచ్చాయి. ఇది ఈ మోడ్రన్ ఇంటికి మరింత ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.
బయట కూడా లగ్జరీ ఫెసిలిటీస్
ఈ ప్రాపర్టీలో స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్టు లాంటి లగ్జరీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అందమైన గార్డెన్స్, విశాలమైన అవుట్‌డోర్ ఏరియాలతో ఈ మాన్షన్ కేవలం సిటీలోని ఇల్లులా కాకుండా ఒక ప్రైవేట్ రిట్రీట్‌లా అనిపిస్తుంది.
కుటుంబం కోసం డిజైన్ చేసిన ఇల్లు
రామ్ చరణ్, ఉపాసనల ఇల్లు కేవలం లగ్జరీ మాత్రమే కాదు, ఒక ఆత్మీయతను పంచుతుంది. కేవలం ఆడంబరాలకు పోకుండా పచ్చదనం, సంప్రదాయం, ఫ్యామిలీ స్పేస్, మోడ్రన్ కంఫర్ట్స్‌ను ఈ ఇంట్లో అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు. ఉపాసన అప్పుడప్పుడూ షేర్ చేసే ఫోటోలు, టాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ ఫ్యామిలీ ప్రైవేట్ లైఫ్‌ను మనకు చూపిస్తాయి.

