MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss 10 Elimination: మూడో వారం ఎలిమినేషన్‌, ఆ కంటెస్టెంట్‌ ఔట్‌.. ఆమె జస్ట్ లో మిస్‌

Bigg Boss 10 Elimination: మూడో వారం ఎలిమినేషన్‌, ఆ కంటెస్టెంట్‌ ఔట్‌.. ఆమె జస్ట్ లో మిస్‌

Bigg Boss 10 Elimination: బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ మూడో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన ఆసక్తికరంగా మారింది. ఉత్కంఠ నెలకొంది. వర్షిణి ఎలిమినేషన్‌ అన్నారు. కానీ అనూహ్యంగా ఆ మేల్‌ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అవుతున్నాడట.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 26 2026, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్‌ బాస్‌ తెలుగు 10 మూడో వారం ఎలిమినేషన్‌
Image Credit : Asianet News

బిగ్‌ బాస్‌ తెలుగు 10 మూడో వారం ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ మూడో వారం కూడా ముగింపుకి చేరుకుంది. ప్రస్తుతం వీకెండ్‌కి సంబంధించిన షూటింగ్‌ జరుగుతుంది. నాగార్జున ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్లతో మాట్లాడుతున్నారు. తప్పులు చేసిన వారిని ఆడుకుంటున్నారు. వారిపై ఫైర్‌ అవుతున్నారు. అదే సమయంలో ఇక అందరి చూపు ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేదాని మీదనే ఉంది. మరి ఈ వారం ఎవరు హౌజ్‌ని వీడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే లీకేజీ సమాచారం ప్రకారం ఈ సారి మేల్‌ కంటెస్టెంట్‌ హౌజ్‌ని వీడబోతున్నాడట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బిగ్‌ బాస్‌ తెలుగు 10 నామినేషన్‌లో ఉన్నది వీరే
Image Credit : Youtube/@starmaa

బిగ్‌ బాస్‌ తెలుగు 10 నామినేషన్‌లో ఉన్నది వీరే

మూడో వారం బిగ్‌ బాస్‌ తెలుగు 10 నామినేషన్‌లో త్రిగుణ్‌, సుధీర్‌ రెడ్డి, అమన్‌, చరణ్‌, వంశీ, షాలిని, వర్షిణి, సింగర్‌ ఝాన్సీ ఉన్నారు. ఓటింగ్‌ ప్రకారం త్రిగుణ్‌ టాప్‌లో ఉన్నారట. గత రెండు వారాల్లో బాటమ్‌లో ఉన్న సుధీర్‌ రెడ్డి ఈ సారి పుంజుకున్నాడు. టాప్‌ 2లోకి వచ్చాడట. అలాగే అమన్‌, చరణ్‌లు కూడా టాప్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బాటమ్‌లో మాత్రం వంశీ, షాలిని, వర్షిణి, ఝాన్సీ ఉన్నట్టుగా అనధికారిక ఓటింగ్‌ చెబుతుంది. మరి అధికారికంగా బిగ్‌ బాస్‌ నిర్వాహకులు నిర్వహించిన ఓటింగ్‌ ఎలా ఉందనేది క్లారిటీ లేదు. కానీ లేటెస్ట్ గా తెలుస్తోన్న సమాచారం ప్రకారం బాటమ్‌లో చిన్న మార్పులు ఉన్నట్టు తెలుస్తోంది.

34
టెంపర్‌ వంశీ ఎలిమినేట్‌
Image Credit : X/@Starmaa

టెంపర్‌ వంశీ ఎలిమినేట్‌

బాటమ్‌లో సింగర్‌ ఝాన్సీ ఉందని, ఆమె ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉంటుందని భావించారు. అలాగే వర్షిణికి ఛాన్స్ ఉందన్నారు. కానీ అనూహ్యంగా టెంపర్‌ వంశీ బాటమ్‌లోకి వచ్చాడట. మూడో వారం హౌజ్‌ని వీడేది టెంపర్‌ వంశీనే అని సమాచారం. వంశీ, వర్షిణి మధ్యనే పోటీ ఉందని, ఈ క్రమంలో వర్షిణి జస్ట్ లో మిస్‌ అయ్యిందని, వంశీ ఎలిమినేట్‌ అవుతున్నాడని అంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వంశీ ఎలిమినేట్‌ అయినట్టు పోస్టులు పెడుతున్నారు. లీక్‌ సమాచారం మేరకు కూడా ఆయనే అని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

44
సెలబ్రిటీ కంటెస్టెంట్లే టార్గెట్‌ గా ఎలిమినేషన్‌
Image Credit : instagram/@temper_vamsi

సెలబ్రిటీ కంటెస్టెంట్లే టార్గెట్‌ గా ఎలిమినేషన్‌

మొదటి వారం చైత్ర రాయ్‌ ఎలిమినేట్‌ అయ్యింది. సెలబ్రిటీ కంటెస్టెంట్ హౌజ్‌ని వీడారు. రెండో వారం కృష్ణుడు ఎలిమినేట్‌ అయ్యాడు. ఇప్పుడు మూడో వారం కూడా సెలబ్రిటీ కంటెస్టెంటే ఎలిమినేట్‌ అవుతున్నారు. ఇదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే వీరంతా హౌజ్‌లో కంటెంట్‌ ఇవ్వలేకపోయిన వాళ్లే. అందుకే వీరికి ఓట్లు పడటం లేదని, బిగ్‌ బాస్‌ నిర్వాహకులు కూడా ఇలాంటి కంటెంట్‌ ఇవ్వలేని వారిని హౌజ్‌ నుంచి పంపించే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా మూడో వారం వంశీ హౌజ్‌ని వీడబోతున్నాడని తెలుస్తోంది. మరి ఇందులో మార్పు ఏమైనా ఉంటుందా అనేది ఈ రాత్రికి క్లారిటీ రానుంది. ఇప్పటికైతే వంశీనే ఎలిమినేట్‌ అని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan House: స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టుతో రామ్ చరణ్ లగ్జరీ ఇల్లు.. ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?
Recommended image2
KTR: చాలా ఏళ్ల త‌ర్వాత ఈరోజు థియేటర్‌కి వెళ్తున్నా.. వైర‌ల్ అవుతోన్న కేటీఆర్ ట్వీట్
Recommended image3
Same Concept Movies: ఒకే కాన్సెప్ట్ తో అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, నాని సినిమాలు.. నేచురల్‌ స్టార్‌ రికార్డు సృష్టిస్తాడా?
Related Stories
Recommended image1
Krishnudu: బిగ్‌ బాస్‌ తెలుగు 10 విన్నర్‌ అతనే, తేల్చేసిన కృష్ణుడు.. అతనే ట్రోల్‌ చేయించడంటూ సంచలన కామెంట్‌
Recommended image2
Same Concept Movies: ఒకే కాన్సెప్ట్ తో అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, నాని సినిమాలు.. నేచురల్‌ స్టార్‌ రికార్డు సృష్టిస్తాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved