హీరో విశాల్ సంచలన నిర్ణయం, మంచు విష్ణు కూడా ఫాలో అవుతాడా?
తమిళంలో స్టార్ హీరోగా ఉన్నాడు తెలుగు కుర్రాడు విశాల్. నటీనటుల సంఘానికి సెక్రటరీ ఉన్న విశాల్ అక్కడ సంచలన నిర్ణయం ఒకటి తీసుకున్నారు. మరి తెలుగులో కూడా మంచి విష్ణు దాన్ని ఫాలో అవుతారా?

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఉన్నాడు విశాల్. తెలుగు ఫ్యామిలీకి చెందిన ఈ హీరో తమిళ పరిశ్రమలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అంతే కాదు తమిళ నటీనటుల నడిగర్ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు హీరో విశాల్. గతంలో నిర్మాతల సంఘానికి కూడా విశాల్ అధ్యక్షుడిగా ఉన్నాడు.
విశాల్ సంచలన నిర్ణయం.
ఏ పదవిలో ఉన్నా కాని సంచలన నిర్ణయాలు తీసుకోవడంతో విశాల్ మార్క్ వేరుగా ఉంటుంది. ఈక్రమంలోనే నడిఘర్ సంగానికి సెక్రట్రీగా మరో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు స్టార్ హీరో. సినిమా విడుదల అయిన వెంటనే జరగుతున్న రివ్యూల ప్రభావం సినిమాలపై తీవ్రంగా పడుతోందని, దానిని ఎలాగైనా నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు విశాల్. దాని కోసం రాబోయే రోజుల్లో సినిమాలు విడుదలైన మూడు రోజుల తర్వాతే పబ్లిక్ రివ్యూలకు అనుమతించాలంటూ విశాల్ విజ్ఞప్తి చేశాడు.
తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న విశాల్, మీడియాతో మాట్లాడుతూ “సినిమా విడుదలైన వెంటనే ఓటిటీల ప్రభావంతో పాటు, అర్థరాత్రి నుంచే వచ్చేస్తున్న నెగటివ్ రివ్యూల వల్ల థియేటర్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. దాంతో పాటు పాజిటివ్ మౌత్ టాక్ ఉన్నా, ముందుగానే వచ్చిన రివ్యూలతో ప్రేక్షకులు సినిమా చూడటానికి భయపడుతున్నారు. ఆ సినిమా చూసిన తరువాత తమకు నచ్చుతుందో లేదో అన్న విపయం పక్కన పెట్టి.. రివ్యూలు చదివి సినిమాపై అభిప్రాయానికి వస్తున్నారు. దాంతో ఈనిర్ణయం తీసుకున్నాడు విశాల్ .
విశాల్ కు మద్దతుగా తమిళ ఇండస్ట్రీ
విశాల్ చేసిన ఈ సూచనను థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతలు, పంపిణీదారులు గుర్తించారు. అంతే కాదు ఈ విషయంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించాడు. “ఇది సినిమా పరిశ్రమను కాపాడేందుకే తీసుకున్న నిర్ణయం. మేము త్వరలో నిర్మాతలతో, పంపిణీదారులతో సమావేశమవుతాం” అని వారు స్పష్టం చేశారు. ఈ విషయంలో తమిళనాట పెద్ద ఎత్తున చర్చ జరగాల్సి ఉంది. ఇండస్ట్రీకి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి, పైరసీలాంటి వాటిని నివారించడంతో పాటు, సినిమాలపై జరిగే నెగెటీవ్ పబ్లిసిటీకి కూడా బ్రేక్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
టాలీవుడ్ పై ఎలాంటి ప్రభావం పడుతుంది.
విశాల్ తమిళ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని టాలీవుడ్ లో కూడా కొందరు సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో మా అధక్షడుగా ఉన్న మంచు కన్నప్ప సినిమా కోసం పరోక్షంగా అనుసరించినట్లు తెలుస్తోంది. ఆయన నటించిన ‘కన్నప్ప’ సినిమాకు విడుదలైన మొదటి మూడు రోజులపాటు ప్రముఖ రివ్యూయర్లు ఎవరూ స్పందించలేదు. ఫలితంగా సినిమా మొదటి వారం డీసెంట్ వసూళ్లను నమోదు చేసింది.
నెగెటీవ్ పబ్లిసిటీ వల్ల నష్టపోయిన సినిమాలు
కావాలని చేసే నెగెటీవ్ రివ్యూల వల్ల కొన్ని హిట్ సినిమాలకు కూడా నష్టం జరుగుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాపై ఇదే ప్రభావం పడిందని అంటున్నారు. సినిమా రిలీజ్ అయిన వెంటనే నెగెటీవ్ రివ్యూలు రావడంతో ప్రేక్షకులు ఈసినిమాకు కొంత దూరంగా ఉన్నారు అనే అభిప్రాయం ఉంది. కానీ ఆ సినిమా ఓటిటీలో వచ్చిన తర్వాత చాలామంది “ఇది అంత బాడ్ గా ఏం లేదు కదాా” అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఉదాహరణల నేపథ్యంలో విశాల్ సూచనకు బలం చేకూరుతుంది.
టాలీవుడ్ లో కూడా ఫాలో అవుతారా?
ఈ నిర్ణయం కేవలం తమిళ సినీ పరిశ్రమకే పరిమితం కాకుండా, టాలీవుడ్‌లోను కొనసాగుతుందా అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది. విశాల్ దారిలో మంచు విష్ణు కూడా మా (Movie Artist Association) అధ్యక్షుడిగా ఇటువంటి మోడల్‌ను అధికారికంగా అమలు చేస్తాడా అన్నదే ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్.
ఈ నిర్ణయం వల్ల రివ్యూల ప్రభావంతో ముందే మూసుకుపోతున్న సినిమాలకు ఊరట లభించే అవకాశం ఉంది. అయితే మీడియా స్వేచ్ఛను కూడా సమంగా పరిగణలోకి తీసుకుంటూ, దీనిపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

