రాజమౌళికి నచ్చని మహేష్ బాబు సినిమా ఏంటో తెలుసా?
టాలీవుడ్ ను పాన్ వరల్డ్ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి, ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ అడ్వెంచర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అయితే మహేష్ బాబు నటించిన సినిమాల్లో రాజమౌళికి నచ్చని సినిమా ఏదో మీకు తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి
తెలుగు సినిమా రంగంలో దర్శకధీరుడిగా పేరుగాంచిన డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి. ప్రతీ సినిమాను ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటూ వెళ్తున్నాడు రాజమౌళి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ కాదు టాలీవుడ్ అని వరల్డ్ సినిమా గుర్తించే పరిస్థితికి, తెలుగు పరిశ్రమను తీసుకువెళ్లాడు జక్కన్న. తెలుగు సినిమాకు ఆస్కార్ సాధించిన ఘనత కూడా ఆయనదే. సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన రాజమౌళి, ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి సినిమాలతో సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. ఇక ఆ రెండు భారీ సినిమాల తరువాత జక్కన్న ప్రస్తుతం టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
మహేష్ బాబుతో రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ
మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమాపై దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో, షూటింగ్ ను సూపర్ ఫాస్ట్ గా కొనసాగిస్తున్నారు. అయితే ఈసినిమాకు సబంధించిన ఏ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు రాజమౌళి. ఈక్రమంలో రాజమౌళి మహేష్ బాబు కు సబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతోంది.
ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తోన్న రాజమౌళికి మహేష్ నటించిన మూవీస్ లో నచ్చనిది ఏంటో తెలుసా? రీసెంట్ గా రాజమౌళి చేసిన ఆసక్తికర కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు కెరీర్‌లో వచ్చిన సినిమాల గురించి రాజమౌళి స్పందిస్తూ, అందులో ఒక సినిమా తనకు నచ్చదని చెప్పారట.
రాజమౌళికి నచ్చని మహేష్ బాబు సినిమా
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆయన కెరీర్ లో డిజాస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. కొన్నిసినిమాలు అయితే ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు కూడా. అయితే మహేష్ బాబు కెరీర్ బిగినింగ్ లో చేసిన కొన్ని మూవీస్ ఆడియన్స్ ను ఏమాత్రం మెప్పించలేకపోయాయి.
అందులో వంశీ మూవీ ఒకటి. ఈక్రమంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళికి కూడా మహేష్ బాబు సినిమాల్లో వంశీ సినిమానే అస్సలు నచ్చదట. 2000లో విడుదలైన ఈసినిమాలో మహేష్ బాబు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ జంటగా నటించారు. కాని ఈసినిమా విజయం సాధించలేకపోయింది. బి గోపాల్ డైరెక్ట్ చేసిన ఈసినిమాను పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు నిర్మించారు.
అయితే ఈసినిమాలో రాజమౌళికి ఏ అంశం నచ్చలేదో ఏమో తెలియదు. అసులు ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని సోషల్ మీడియాలో మాత్రం ఓ సందర్భంలో ఈ విషయం వైరల్ అయ్యింది. అంతే కాదు వంశీ సినిమా మహేష్ బాబు ప్లాప్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.
మహేష్ బాబు నమ్రతల ప్రేమకు గుర్తుగా నిలిచి సినిమా
వంశీ సినిమా డిజాస్టర్ అయ్యింది కాని.. ఈసినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలో ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే ఈసినిమాలో మహేష్ బాబు జోడీగా నటించింది ఆయన భార్య నమ్రతా శిరోద్కర్. వంశీ సినిమాలో కలిగిన పరిచయమే.. స్నేహం చిగురించి.. సినిమా షూటింగ్ అయిపోయే వరకూ అది ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్త కొన్నాళ్లకు పెళ్ళికి దారి తీసింది. మరి పెద్దలు ఈ పెళ్లికి ఒప్పుకున్నారో లేదో తెలియదు కాని, ముంబయ్ లో చాలా సింపుల్ గా మహేష్, నమ్రతల పెళ్లి జరిగింది. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సెలబ్రిటీ జంటగా వీరు నిలిచారు.
మహేష్ బాబుకు కూడా నచ్చని సినిమా
ఇక తొలిప్రేమకు చిహ్నంగా ఉన్నా సరే.. ఈసినిమా అంటే మహేష్ బాబుకు కూడా నచ్చదట. ఈ విషయాన్ని ఆయన కూడా పలు సందర్భాల్లో చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘వంశీ’ తనకు పెద్దగా నచ్చదని స్వయంగా వెల్లడించారు. సినిమా విడుదల సమయంలో విమర్శకుల ప్రశంసలు అందుకోలేకపోయినా, ఈ చిత్రం మాత్రం మహేష్, నమ్రత మధ్య బంధాన్ని బలపరిచింది.
ప్రస్తుతం రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ఒక అడ్వెంచర్ డ్రామా జానర్‌లో ఉంటుందని సమాచారం. ఇండియన్ సినిమా స్థాయిని మరింతగా పెంచే ఉద్దేశంతో రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా మహేష్ బాబు, పాన్ ఇండియా స్థాయిలో కొత్త గుర్తింపును సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న తొలి చిత్రం కావడంతో మహేష్ కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలవనుందని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు.