జుట్టు పట్టి కొట్టుకున్న స్టార్ హీరోయిన్లు, జయసుధ ను కొట్టిన నటి ఎవరో తెలుసా?
ఆనాటి అందాల హీరోయిన్ల మధ్య సహజంగానే పోటీ వాతవరణ ఉండేది. కాని ఎవరు ఎదురు పడి మాటలు అనుకునేంత శత్రుత్వం ఎవరికీ ఉండేది కాదు.కానీ ఓ సందర్భంలో జయసుధతో ఓ హీరోయిన్ రియల్ గా ఫైటింగ్ చేసిందట, జుట్టుపట్టుకుని బీచ్ లో కొట్టుకున్నాట. ఇంతకీ ఎవార తార? కారణం ఏంటి?

జయసుధ వెల్లడించిన అసలు నిజం
టాలీవుడ్‌లో ఒకప్పుడు అచ్చతెలుగు హీరోయిన్ల హవా ఎంతగా నడిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సావిత్రి, శారద, జమున, విజయనిర్మల నుంచి జయసుధ, జయచిత్ర, రంభ, రాశీ, లయ వరకు ఎంతో మంది టాప్ హీరోయిన్లు తెలుగు, తమిళ, మలయాళ పరిశ్రమలను ఏలారు. ఈ క్రమంలో హీరోయిన్ల మధ్య సహజంగానే పోటీ వాతావరణం ఉండేది. కాని అది సినిమాల వరకే పరిమితం అయ్యేది.
కొన్ని కొన్ని సందర్భాల్లో హీరోయిన్ల మధ్య మనస్పర్ధలు, గొడవలు సాధారణంగానే జరుగుతుండేవి. కాని అవి పబ్లిక్ గా గొడవపడే స్థాయికి వచ్చిన సందర్బాలు చాలా తక్కువ. ఇటువంటి ఓ సంఘటన గురించి ఆకాలం హీరోయిన్, సహజనటిగా గుర్తింపు పొందిన జయసుధ, ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన కెరీర్‌కు సంబంధించి ఆమె బయటపెట్టిన ఆ ఆసక్తికర విషయం తెగ వైరల్ అయ్యింది.
జుట్టు పట్టుకుని కొట్టుకున్న స్టార్ హీరోయిన్లు
ఇంతకీ జయసుధ వెల్లడించిన విషయం ఏంటంటే.. అప్పట్లో ఓ హీరోయిన్ తనతో రియల్ గా ఫైటింగ్ చేసిందట. షూటింగ్ స్పాట్ లో జయసుధతో పాటు మరో హీరోయిన్ కొట్టుకునే సన్నివేశం ఉంది. కాని ఇద్దరి మధ్య జరిగిన చిన్న సంఘర్షణ నిజంగానే దెబ్బలాడే పరిస్థితి తీసుకువచ్చిందట.
దాంతో ఇద్దరు నిజంగానే కొట్టుకోవడం స్టార్ట్ చేశారట. మరీ ముఖ్యంగా జుట్లు పట్టుకుని కొట్టుకున్న ఆ సంఘటన గురించి జయప్రదం కార్యక్రమంలో జయసుధ వెల్లడించారు. జయసుధతో ఫైటింగ్ చేసిన ఆ హీరోయిన్ ఎవరో కాదు జయచిత్ర.
జయసుధ చెప్పిన ఈ ఫైటింగ్ సీన్ కటకటాల రుద్రయ్య సినిమా షూటింగ్ టైమ్ జరిగింది. ఆ సమయంలో జయసుధకు జయచిత్రతో గట్టిగా గొడవ జరిగిందట. చెన్నై బీచ్‌లో ఓ ఫైట్ సీన్‌ను చిత్రీకరిస్తుండగా, ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై, అదికాస్తా నిజంగా ఫిజికల్ వార్ కు దారి తీసిందని సహజనటి చెప్పుకొచ్చింది.
చెప్పుల విషయంలో పెద్దదైన గొడవ
జయసుధ మాట్లాడుతూ “ఆ సీన్‌లో నేను హీల్స్ వేసుకున్నాను. జయచిత్ర మాత్రం నన్ను హీల్స్ తీసేయమంది, ఎందుకంటే ఆమె నా కన్నా పొట్టిగా కనిపించేది. దాంతో సీన్ చేయడం ఇబ్బందిగా అనిపించింది ఆమెకు, మొదట ఒప్పుకోకపోయినా నేను కాసేపటికి సరే అని హీల్స్ తీసేసాను. అయినా సరే ఇద్దరి మధ్య ఏమయ్యిందో ఏమో తెలియదు కాని ఇద్దరం గొడవపడ్డాం. ఒక్కసారిగా మా ఇద్దరం జుట్టు పట్టుకుని నిజంగానే కొట్టుకున్నాం. అందరూ అది సీన్‌లో భాగమే అనుకొని మమ్మల్ని ఆపకుండా ఎంకరేజ్ చేశారు. మేము కూడా రెచ్చిపోయి కొట్టుకున్నాం,” అని జయసుధ వివరించారు.
ఇక ఈ విషయాన్ని జయసుధ గతంలో వివరించారు. జయప్రద హోస్ట్ గా గతంలో ఓ షో నడిచింది. ఈ షోలో దాదాపు టాలీవుడ్ సెలబ్రిటీలు అందరు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈక్రమంలో జయసుధ కూడా ఈ షోలో పాల్గొన్నారు. జయప్రద అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈక్రమంలోనే జయచిత్రతో జరిగిన గొడవ గురించి ఆమె వెల్లడించారు.
షూటింగ్ తరువాత ఏంజరిగిందంటే?
ఆ సంఘటన అలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు. కాని ఆ తర్వాత ఏ ఒక్కరూ అది మనసులో పెట్టుకోలేరు. షూటింగ్ ముగిసిన తరువాత మేమిద్దరం మళ్లీ కలుసుకుని మాట్లాడుకునేవాళ్లం. పార్టీలకు కలిసి వెళ్ళేవాళ్లం. అప్పట్లో మనస్పర్థలు జరిగినా, అవి అక్కడితోనే ముగిసేవి అని జయసుధ అన్నారు.
ఇక అలనాటి హీరోయిన్లలో సహజనటిగా పేరుతెచ్చుకున్నారు జయసుధ. ఆమె నటన, అందానికి అప్పట్లో ఎంతో మంది అభిమానులు ఉండేవారు. జయసుధ సినిమాలకు భారిగా డిమాండ్ ఉండేది. అంతే కాదు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, మురళీ మోహన్, మోహన్ బాబు లాంటి ఎంతో మంది హీరోల సరసన జయసుధ ఆడిపాడింది.