ఓ వ్యక్తి చెంప పగలగొట్టిన సంయుక్తా మీనన్ ,కారణమేంటంటే..?
ఓ వ్యక్తి చెంప పగలకొట్టింది సముక్తా మీనన్. అవును చెంప పగలగొట్టాను.. కారణం కూడా ఉంది అని అంటోంది విరూపాక్ష హీరోయిన్. టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న ఈబ్యూటీ.. తాజాగా ఈ విషయం వెల్లడించింది.
వరుస సక్సెస్ లతో మంచి జోరు మీద ఉంది సంయుక్తా మీనన్ . ఆమె నటిస్తే.. సినిమా హిట్ అన్న పేరు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో చిన్నగా.. గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది బ్యూటీ. సంయుక్త మీనన్. ఆమె తాజాగా నటించిన విరూపాక్ష సినిమా కూడా మంచి సక్సెస్ సాధించి బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్స్ ను రాబడుతుంది. ఈసినిమాతో సంయుక్తా మీనన్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01gy5hpg7yz41bb919gctjw0sy/aaa-jpg_300x171xt.jpg)
ప్రస్తుతం సంముక్తా మీనన్ పేరు మారుమోగుతుంది. సార్ మూవీతో స్టార్ గా మారిన ఈ బ్యూటీ.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ యాటిట్యూడ్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియా వైరల్గా మారింది. సంయుక్త మీనన్ ఓ ఇంటర్వ్యూలో తాను ధైర్యంగా చేసిన ఓ పని గురించి చెప్పుకొచ్చారు. ఓ వ్యక్తిని తాను చెంప మీద కొట్టానన్నారు సంయుక్తా.
అయితే అతను.. తనను, తన తల్లిని ఇబ్బంది పెట్టాడని.. అప్పటికీ ఓపికగా ఎదురు చూసి.. ఇక తప్పదు అనుకున్నాకే చెంప పగులగొట్టానంటున్నారు సంయుక్తా. అయితే ఈ విషయం చాలా ఏళ్ల క్రితం జరిగిందట. ఈ విషయాన్ని సంయుక్తా స్వయగా ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చారు.
నేను మా అమ్మ కలిసి ఓ సారి బయటకెళ్లాం. ఓ చోట మేము నిలబడి ఉన్నాం. అక్కడే ఉన్న ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ ఉన్నాడు. అతడు పొగను మాపై వదులుతున్నాడు. ఇక అతనితో ఎందుకులే అని మేము అక్కడినుంచి పక్కకు వెళదామని అనుకున్నాం. కానీ, పక్కకు వెళ్లటానికి అక్కడ పలేస్ లేదు. దాంతో అక్కడే ఆగిపోయాం..
అయితే.. అప్పటికే మా అమ్మకు బ్రీతింగ్ బ్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆమెకు పొగ పడదు. దాంతో అతడి దగ్గరకు వెళ్లి కాస్త పక్కకు వెళ్లి తాగమని రిక్వెస్ట్ చేశాను. అతడు వినలేదు. పైగా మాతో అసభ్యంగా మాట్లాడాడు అంటు చెప్పుకొచ్చారు సంయుక్తా. దాంతో కోపం కట్టలు తెంచుకుంది. దాంతో అతడి చెంప చెళ్లుమనిపించాను అన్నారు సంయుక్తా మీనన్.
సంయుక్త మీనన్ 2016లో ఇండస్ట్రీలోకి పాప్కార్న్ సినిమాతో అడుగు పెట్టారు సంయుక్తా. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లానాయక్ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తెలుగులో వరుసగా బింబిసార, సార్, విరూపాక్ష సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కోట్టింది బ్యూటీ. దాంతో ఆమెకు లక్కీ హీరోయిన్ అన్న పేరు వచ్చింది. తెలుగులో ప్రస్తుతం డెవిల్ అనే సినిమాలో నటిస్తున్నారు సంయుక్తా.