- Home
- Entertainment
- 16 ఏళ్లకే పాపులర్ స్టార్, అరెస్ట్ అయ్యాక కెరీర్ ను పోగొట్టుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
16 ఏళ్లకే పాపులర్ స్టార్, అరెస్ట్ అయ్యాక కెరీర్ ను పోగొట్టుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
చిన్నవయస్సులోనే స్టార్ డమ్ అందుకున్న చాలామంది హీరోయిన్లు, జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. కొంత మంది తారలయితే అనూహ్యంగా మరణించిన వారు కూడా ఉన్నారు. ఈక్రమంలోనే కెరీర్ పీక్స్ లో ఉండగా జైలుకెళ్లి, అవకాశాలు పొగొట్టుకున్న హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి కెరీర్ ఎప్పుడు ఫామ్ లో ఉంటుందో, ఎప్పుడు పడిపోతుందో చెప్పడం కష్టం. కొందరయితే చేతులారా వారి కెరీర్ ను నాశనం చేసుకున్నవారు ఉన్నారు. ప్రేమ,పెళ్లి అంటూ కనిపించకుండా పోయినవారు ఎందరో. మరికొందరు మాత్రం దగ్గర ఉన్నవ్యక్తులను గుడ్డిగా నమ్మి మోసపోయినవారు ఉన్నారు. ఆ కోవలోకే వస్తుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ వినీత.
ఇండస్ట్రీలోకి వచ్చాక పేరు మార్చుకున్న హీరోయిన్
సినిమా పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ లో ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఎంత పాపులర్ అవుతారో అంతే తక్కువ టైమ్ లో కనుమరుగు అవుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ వినీత పరిస్థితి కూడా అదే. 90వ దశకంలో తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసిన ఈ తార.. తెలుగులో విక్టరీ వెంకటేష్‌తో పాటు ప్రముఖ పాపులర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
తమిళ ఆడిమన్స్ కాస్త బొద్దుగా ఉన్న హీరోయిన్లను ఎక్కువగా ఆదరిస్తారు. అలానే వినీత కూడా 90ల్లో తమిళంలో పాపులర్ అయింది. తెలుగులో కూడా వినీత (Vineetha) మంచి మంచి సినిమాలు చేసింది. వినీత అసలు పేరు లక్ష్మి. ఇండస్ట్రీలోకి వచ్చేముందు తన పేరును వినీతగా మార్చుకుంది. అప్పటి నుంచి వినీతగానే ఆమె పాపులర్ అయ్యింది. కానీ ఓ కేసులో అరెస్టై జైలుకెళ్లడంతో సినిమాలకు పూర్తిగా దూరమైంది అ హీరోయిన్.
మిస్ ఇండియా కోసం వినీత ప్రయత్నం
విశాఖపట్నంలో పుట్టిన వినీత మెడల్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. సినిమాల్లో కి ఎంట్రీ ఇవ్వడానికి ముందు మిస్ ఇండియా కాంపిటిషన్‌లో కూడా పార్టిసిపేట్ చేసింది ఈ తార. కాని మిస్ ఇండియా అవ్వలేకపోయింది. దాంతో ఆమె సినిమాలపై దృష్టి పెట్టింది.
తమిళ సినిమాల ద్వారా ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 1993లో శరత్ కుమార్‌తో ‘కట్టబొమ్మన్’ అనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది వినీత. ఆ తర్వాత అరుణ్ పాండియన్ హీరోగా వచ్చిన ‘ఊజియన్’తో హిట్టు కొట్టింది. దీంతో ఆమె యాక్టింగ్, అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఇక ఇండస్ట్రీలో వరుస అవకాశాలు ఆమెను వరించాయి. ముఖ్యంగా వినీత వెంకటేష్, రాజేంద్రప్రసాద్, మోహన్ లాల్, శరత్ కుమార్, విజయ్‌కాంత్, జయరాం, కార్తీక్, ఇలా అప్పటి హీరోలందరితో వినీత నటించి మెప్పించింది.
తెలుగులో పాపులర్ అయిన వినీత సినిమాలు
ఇక తెలుగు ప్రేక్షకులకు వినీత గురించి చెప్పాలంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో మనీషా అంటే చాలు అర్ధం అయిపోతుంది. ఈసినిమా 90స్ బ్యాచ్ ను ఎంతలా నవ్వించిందో అందరికి తెలుసు. ఇక అన్ని భాషల్లో పెరియ కుట్టం, వియత్నాం కాలనీ, చిన్న జమీన్, మిస్టర్ మద్రాస్ వంటి సినిమాలు వినీతకు ఎంతో పాపులారిటీని తెచ్చిపెట్టాయి.
తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి ఈ హీరోయిన్ 70కి పైగా సినిమాలు చేసింది.గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు నటన ప్రాధాన్యమున్న పాత్రలను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది వినీత.
ఇక ఇండస్ట్రీలో కొంత మంది కుట్రలకు ఆమె బలైపోయింది. సొంత వారే ఆమెను మోసం చేయడంతో, కెరీర్ ప్రమాదంలో పడి మళ్లీ ఫామ్ లోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేసింది. కాని అప్పటికే అవ్వాల్సిన డ్యామేజ్ అవ్వడంతో మళ్లీ కోలుకోలేకపోయింది వినీత.
వినీత జీవితాన్ని కుదిపేసిన సంఘటన
హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉండగా జరిగిన ఓ ఘటన వినీత జీవితాన్నే తలకిందులు చేసింది. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న టైమ్ లో వినీతపై అక్రమసంబంధాల అభియోగాలతో కేసు నమోదైంది. దీంతో, పోలీసులు ఈమెను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కొన్నాళ్ళపాటు జైలు జీవితం గడిపింది వినీత.
ఆతరువాత బెయిల్‌పై బయటకు వచ్చింది. అయితే ఆ తరువాత అసలు ఆమె తప్పు లేదు అని తేలింది. కొంత మంది చేసిన కుట్రల వల్ల తనకు ఈ పరిస్థితి వచ్చిందని ఆమె నిరూపించింది.అంతే కాదు ఆమె సొంత సోదరుడే మోసం చేసి వినీత కెరీర్ ను నాశనం చేయాలని చూసినట్టు ఆమె ఓ సందర్భంలో వెల్లడించింది.
కోర్టులో కూడా ఈ విషయం నిరూపించడంతో వినీత నిర్దోషిగా తేలింది. అయితే, ఆలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటన తన సినిమా కెరీర్‌ని నాశనం చేయడంతో పాటు మానసికంగా ఆమెను ఎంతో వేదనకు గురిచేసింది. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో వినీత వివరించింది.
వినీత ప్రస్తుతం ఏం చేస్తోంది?
కేసు క్లోజ్ అయ్యింది, వివాదం ముగిసింది. కానీ వినీత కెరీర్ మాత్రం మళ్లీ పుంజుకోలేదు. హీరోయిన్ గా కాకపోయినా నటిగా మళ్లీ ఫామ్ లోకి రావాలని ఆమె చేయని ప్రయత్నం లేదు. కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది హీరోయిన్. కాని అప్పటికే ఆమె కెరీర్ పై పడిన మచ్చ వల్ల అవకాశాలు ఇవ్వడానికి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వెనకడుగు వేశారు.
ఇక అతి కష్టమ్మీద 8 ఏళ్ల గ్యాప్ తర్వాత 2008లో ‘ఎంగ రాసి నల్ల రాసి’ అనే తమిళ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసింది వినీత. ఆతరువాత మళ్ళీ ఆమెకు అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు. దాంతో అసలు సినిమాలు వదిలేసి ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఇప్పుడు వినీత ఏం చేస్తోంది ఎక్కడుంటోంది తెలియదు కాని.. రీసెంట్ గా ఆమె ఫోటోలు మాత్రం వైరల్ అయ్యాయి. అప్పటికి ఇప్పటికీ ఆమెలో చాలా మార్పు. అసలు గుర్తు పట్టనంతగా మారిపోయింది వినీత. హీరోయిన్ గా ఎంత గ్లామర్ ను మెయింటేన్ చేసిందో.. ఇండస్ట్రీని వదిలేసిన తరువాత ఫిట్ నెస్ ను వదిలేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మాత్రం వినీత మళ్లీ తల్లి పాత్రలతో రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆమెను మళ్లీ తెరపై చూడాలని ఆశపడుతున్నారు.